వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వ్యవసాయంపై ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం వర్ధమాన దేశాలకు వ్యతిరేకంగా ఉంది.: శ్రీ పియూష్ గోయల్
G-33 వర్చువల్ మినిస్టీరియల్ సమావేశంలో ప్రసంగించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్
Posted On:
17 SEP 2021 3:34PM by PIB Hyderabad
జి-33 వర్చువల్ మినిస్టీరియల్ సమావేశాన్ని నిన్న ఇంటొనేసియా ఏర్పాటు చేసింది. జి 33 కి చెందిన వ్యవసాయ ప్రాధాన్యతా అంశాలను, 12 వ మినిస్టీరియల్ కాన్ఫరెన్సు విషయంలో ఎలా ముందుకు పోవాలనే అంశాన్ని చర్చించేందకుకు ఈ వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. 12 వ మినిస్టీరియల్ కాన్ఫరెన్సు 2021 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు నిర్వహించనున్నారు.
ఈ ఇన్ఫార్మల్ సమావేశానికి ఇండొనేసియా రిపబ్లిక్ వాణిజ్య మంత్రి ముహమ్మద్ లుట్ఫి అధ్యక్షత వహించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుటిఒ డైరక్టర్ జనరల్ డాక్టర్ న్గోజి ఒకోన్జోఐవిఏలా కీలకోపన్యాసం చేశారు. మొత్తం 47 జి 33 సభ్యదేశాలలో ఇండియాసహా 21 సభ్యదేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రసంగించారు.
భారత అధికారిక ప్రతినిధి వర్గానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజాపంపిణీ, టెక్స్‌టైల్ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, 12 వ మినిస్టీరియల్ సదస్సు విషయంలో విశ్వసనీయత పాదుకొల్పడంలో భాగంగా జి -33 ఆహార భద్రతా అవసరాలకు పబ్లిక్ స్టాక్‌హొల్డింగ్‌కు సానుకూల శాశ్వత పరిష్కారాన్ని సాధించేందుకు కృషి చేయాలని , అలాగే ప్రత్యేక రక్షణ యంత్రాంగం (ఎస్.ఎస్.ఎం)ను సత్వరం ఖరారు చేయాలని అన్నారు. అలాగే దేశీయ మద్దతుకు సంబంధించి సమతూకంతో కూడిన పరిష్కారం సాధించాలన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన వ్యవసాయంపై ఒప్పందంలో తీవ్ర అసమానతలు ఉన్నాయని అన్నారు. ఇవి అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా ఉన్నాయని, ఇవి చాలావరకు అభివృద్ధి చెందుతున్నదేశాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. అందువల్ల వ్యవసాయ సంస్కరణలలో మొదటి చర్యగా, చారిత్రక అసమానతలు, అసమతౌల్యాన్ని సరిచేసి నిబంధనల ఆధారిత, నిస్ఫాక్షిక, సమాన న్యాయంతో కూండి వ్యవస్థ ఉండేలా చూడాలన్నారు.
జి-33 సభ్య దేశాలు సమష్టిగా ,జి 33 కూటమి బంధాన్ని గట్టిగా నిలుపుకునేందుకు, దీనిని మరింతగా బలోపేతం చేసేందుకు, కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే భావసారూప్యతగల అభివృద్ధి చెందుతున్న గ్రూపుల మద్దతు సాధించేందుకు, నిస్ఫాక్షిక, సమతూకంతో కూడిన అభివృద్ధి కేంద్రిత ఫలితాన్ని 12 వ మినిస్టీరియల్ సదస్సులో సాధించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
వ్యవసాయ రంగంలో ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్దేశిత అంశాల సత్వర పరిష్కారానికి తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తూ జి 33 మినిస్టీరియల్ ప్రకటనను సమావేశం ముగింపు సందర్బంగా వెలువరించారు. అంతర్జాతీయ వాణిజ్య చర్చలలో అంతర్భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల, ఎల్‌డిసి ల అభివృద్ధి , ప్రత్యేక విభిన్న హోదా, అభివృద్ధి సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించాలని సమావేశం పిలుపునిచ్చింది.
***
(Release ID: 1756059)
Visitor Counter : 194