రైల్వే మంత్రిత్వ శాఖ

స్కిల్ ఇండియా మిషన్‌ అమలులో భారతీయ రైల్వేల ప్రయాణం


ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) లో భాగంగా అమలు కానున్న రైల్ కౌశల్ వికాస్ యోజన(ఆర్కేవీవై)ని ప్రారంభించిన శ్రీ అశ్విని వైష్ణ వ్

దేశవ్యాప్తంగా 75 రైల్వే శిక్షణా సంస్థల ద్వారా పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలలో ప్రవేశ స్థాయి శిక్షణ అందించనున్న రైల్వేలు

Posted On: 17 SEP 2021 12:36PM by PIB Hyderabad

రైల్వేలలో ప్రాథమిక స్థాయి శిక్షణను అందించి యువతకి సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే శిక్షణా సంస్థల ద్వారా అందించనున్న శిక్షణా కార్యక్రమాలను  కేంద్ర  రైల్వేకమ్యూనికేషన్స్ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ కౌశల్ వికాస్ ప్రారంభించారు. ఢిల్లీ రైల్ భవన్ లో మంత్రి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) లో భాగంగా అమలు కానున్న రైల్ కౌశల్ వికాస్ యోజన(ఆర్కేవీవై) ను అమలు చేస్తారు. ప్రారంభ కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓ శ్రీ సునీత్ శర్మ మరియు రైల్వే ఇతర సీనియర్ అధికారులు  పాల్గొన్నారు.

దేశంలో విశ్వకర్మ జయంతి రోజున శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి జన్మ దిన కానుకగా ఈ శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు.  రైల్ కౌశల్ వికాస్ యోజన కింద 50 వేల మంది యువతకు శిక్షణ ఇస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో యువత నైపుణ్యాలను మెరుగు పరచాలన్న లక్ష్యంతో రైల్ కౌశల్ వికాస్ యోజనకు రూపకల్పన చేశామని మంత్రి వివరించారు. రైల్ కౌశల్ వికాస్ యోజన కింద మారుమూల ప్రాంతాలలో కూడా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. రైల్ కౌశల్ వికాస్ యోజన శిక్షణా కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని ఆయన కోరారు.

రైల్ కౌశల్ వికాస్ యోజన కింద మూడు సంవత్సరాల కాలంలో 50000 మంది అభ్యర్థులకు శిక్షణ అందిస్తారు. తొలుత 1000 మంది అభ్యర్థులకు నాలుగు ట్రేడ్‌లలో అవసరమైన శిక్షణ అందిస్తారు.  ఎలక్ట్రీషియన్వెల్డర్మెషినిస్ట్ మరియు ఫిట్టర్ తరగతుల్లో 100 గంటల ప్రాథమిక ప్రాథమిక శిక్షణ ఉంటుంది.  ప్రాంతీయ డిమాండ్‌లు  అవసరాలకు అనుగుణంగా జోనల్ రైల్వే, ఉత్పత్తి యూనిట్లు  ఇతర ట్రేడ్‌లలో శిక్షణా కార్యక్రమాలను అందిస్తాయి.  శిక్షణ ఉచితంగా అందించబడుతుంది. మెట్రిక్యులేషన్‌లో మార్కుల ఆధారంగా పారదర్శక విధానంలో  ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను  ఎంపిక చేస్తారు.  10 వ తరగతి ఉత్తీర్ణులై 18-35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అయితే ఈ శిక్షణ ఆధారంగా రైల్వేలో ఉద్యోగం పొందడానికి ఎలాంటి క్లెయిమ్ ఉండదు. 

 శిక్షణా  పాఠ్యాంశాలను బనారస్ లోకోమోటివ్ వర్క్స్ అభివృద్ధి చేసింది. కార్యక్రమాన్ని అమలు చేసే  బనారస్ లోకోమోటివ్ వర్క్స్ అంచనాలను ప్రామాణీకరించి పాల్గొనేవారి కేంద్రీకృత డేటాబేస్‌ను కూడా నిర్వహిస్తుంది.  తొలుత  1000 మందికి ఈ పథకం కింద  శిక్షణ ఇస్తారు.  అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం అప్రెంటీస్‌కి అందించే శిక్షణ కంటే ఎక్కువ ఉంటుంది.  అందించే కార్యక్రమాలు ధరఖాస్తులు ఆహ్వానిస్తూ జారీ అయ్యే నోటిఫికేషన్ ఎంపికైన అభ్యర్థుల జాబితా,  స్టడీ మెటీరియల్ మరియు  ఇతర వివరాలను అందించడానికి  వెబ్‌సైట్ ను అభివృద్ధి చేస్తున్నారు.   ప్రస్తుతందరఖాస్తుదారులు ప్రారంభ దశలో స్థానికంగా జారీ చేసిన ప్రకటనలకు ప్రతిస్పందనగా దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆన్‌లైన్లో  దరఖాస్తులను స్వీకరించడానికి త్వరలో కేంద్రీకృత వెబ్‌సైట్‌లో తెరవబడుతుంది.

  ప్రామాణికమైన మదింపు ముగిసిన తర్వాత శిక్షణ పొందినవారికి  నేషనల్ రైల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ ద్వారా కేటాయించిన ట్రేడ్‌లో సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.  వారికి కూడా వారి ట్రేడ్‌కు సంబంధించిన టూల్‌కిట్‌లు అందించబడతాయి. శిక్షణను సద్వినియోగం చేసుకోవడానికి స్వయం ఉపాధి కోసం సామర్థ్యాన్ని పెంచడంతోపాటు వివిధ పరిశ్రమల్లో ఉపాధిని పెంపొందించడానికి సహాయపడుతుంది.

 

 దేశవ్యాప్తంగా ఉన్న 75 రైల్వే శిక్షణా సంస్థలను  దేశవ్యాప్తంగా  యువతకు ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేయడం జరిగింది.  ఈ పథకం యువత ఉపాధి సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారికి, మరియు కాంట్రాక్టర్ల వద్ద పని చేస్తున్న వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. నైపుణ్య భారత్ సాధనకు ఇది సహకరిస్తుంది. 

 

***



(Release ID: 1755782) Visitor Counter : 189