నౌకారవాణా మంత్రిత్వ శాఖ
పారదీప్ పోర్ట్ ట్రస్ట్ వద్ద స్వచ్ఛతా పఖ్వాడా- 2021 నిర్వహణ
Posted On:
16 SEP 2021 4:11PM by PIB Hyderabad
ఏక కాలంలో 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకలతో పాటుగా పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ (పీపీటీ) ఆవరణంలో ఈ రోజు "స్వచ్ఛతా పఖ్వాడా" పాటించడం మొదలుపెట్టారు. 'స్వచ్ఛత ప్రతిజ్ఞ' కార్యక్రమంతో ఇది ప్రారంభమైంది. పీపీటీ డిప్యూటీ చైర్మెన్ ఎ.కె.బోస్ నుంచి మొదలై హెచ్ఓడీలు, డిప్యూటీ హెచ్ఓడీలు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీపీటీ పరిపాలన భవనం ముందు ఉన్న పోర్టికోలో ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం వివిధ కార్యాలయ అధిపతి మరియు సిబ్బంది సామాజిక దూర నిబంధనలను పాటిస్టూ సంబంధిత కార్యాలయ ప్రాంగణాలలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఇంజినీరింగ్ విభాగం యొక్క ఆర్ అండ్ బీ శాఖ వారు పరిపాలనా భవనం పరిసరాలలో పరిశుభ్రత కార్యకలాపాలను చేపట్టారు. పీపీటీ కార్మికులు, సిబ్బందిలో అవగాహన కల్పించడంలో భాగంగా వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. స్వచ్ఛతా పఖ్వాడాలో భాగంగా చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి పీపీటీ ఒక వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించింది.
స్వచ్ఛతకు సంబంధించి కార్మికులు, వివిధ డిపార్ట్‌మెంట్‌ల వారిలో అవగాహన కల్పించడం, స్వచ్ఛం అవగాహనకు చెందిన హోర్ఢింగ్‌లను ఏర్పాటు చేయడం, స్వచ్ఛత రథ్, పంపు హౌస్‌లను శుభ్రపరచడం, టౌన్‌షిప్‌లలోని ముఖ్యమైన ప్రాంతాలలో డిజిటల్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. కోవిడ్ సంక్షోభం మరియు అన్‌లాక్ మార్గదర్శకాల కారణంగా, పఖ్వాడా కాలంలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలలో సామాజిక దూరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
****
(Release ID: 1755672)