ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి లో బహుళ ఆరొగ్య సదుపాయాలను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ
దేశం మొత్తానికి నమూనా ఆస్పత్రిగా దీనిని తీర్చిదిద్దాల్సిందిగా పిలుపునిచ్చిన మంత్రి
నవభారతం కోసం ఆరోగ్యవ్యవస్థను సమగ్రంగా పరివర్తన చెందెలా చేసేందుకు సమష్టిగా కృషి చేద్దామన్న మంత్రి
Posted On:
16 SEP 2021 2:23PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ, ఈరోజు న్యూడిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో పేషెంట్ కేంద్రిత పలు సదుపాయాలను ప్రారంభించారు. అకృత్యాలనుంచి బాలల రక్షణ కేంద్రాన్నిఆస్పత్రి నూతన బ్లాక్‌లో ఆవిష్కరించారు. అఅలాగే పిఎం కేర్స్ నిధులతో ఏర్పాటైన మూడవ అ ఎం.టి ప్రెజర్ స్వింగ్ అడ్‌సార్ప్సన్ ఆక్సిజన్ ప్లాంట్‌ను, అదే ప్రాంగణంలో తాత్కాలిక ఆస్పత్రి సదుపాయాన్ని మంత్రి ప్రారంభించారు. క్వాలిటీకి బాత్ పేరుతో ఒక పుస్తకాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. అలాగే ఎన్.ఎ.బి.హెచ్ ఎంట్రీ స్థాయి సర్టిఫికేట్‌ను ఆయన అందజేశారు.
ఆస్పత్రి వర్గాలను అభినందిస్తూ మంత్రి శ్రీ మాండవీయ, వైద్యుల నిబ్ద్ధత ,చిత్తశుద్ధి ఆరోగ్యరంగానికి కీలక స్థంబాల వంటివని అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి పునాది అన్నారు. ఆస్పత్రులు, వైద్యులు నాణేనికి రెండువైపుల వంటి వారని అంటూ
కేంద్ర మంత్రి , ఒకరు లేకుండా మరొకరు లేరని అన్నారు. డాక్టర్లు తమ అకుంఠిత దీక్ష, పనిపై దృష్టితో దీనిని గమనించకపోవచ్చని కానీ సమాజంలో వైద్యులకు అద్భుత గౌరవం ఉందని అన్నారు. కరోనా బారినుంచి రక్షించడంలో వైద్యుల చిత్తశుద్ధి వారిపట్ల గౌరవాన్ని మరింత పెంపొందింప చేసిందని ఆయన అన్నారు. ఆస్పత్రి అనేది ఈ విలువలకు సహజసిద్ధమైన కొనసాగింపు వంటిదని శ్రీ మాండవీయ అన్నారు.
కొద్దిరోజుల క్రితం తాను ఆకస్మికంగా ఆస్పత్రిని సందర్శించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు వారి బంధువులపై భారాన్ని తగ్గించేందుకు అవకాశం ఉందని అన్నారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికత అయిన నవ భారతావని ఆకాంకక్షలకు అనుగుణంగా వ్యవస్థలో సంస్కరణలతో ఇది ముడిపడి ఉందని ఆయన అన్నారు. ఈ ఆస్పత్రిని దేశానికే నమూనా ఆస్పత్రిగా తీర్చిదిద్దాల్సిందిగా సిబ్బందికి సూచిస్తూ మంత్రి , వైద్యులు , వ్యక్తుల దృష్టిలోనుంచి కాక మొత్తం ఆస్పత్రి ఒక బృందంగ పనిచేయడంపై దృష్టిపెట్టాలని అన్నారు. అప్పుడు ఆస్పత్తి కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగడానికి వీలు కలుగుతుందని అన్నారు. ఆస్పత్రి ప్రతిష్ఠను మరింత పెంచేందుకు ఇది ఉపకరిస్తుందని అయన అన్నారు.
యువ వైద్యులను ప్రోత్సహించేందుకు , మంత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారితో పనిచేసిన అనుభవాల గురించి మంత్రి వివరించారు. ప్రధానమంత్రి గారి కర్మయోగి సిద్ధాంతం ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ఆరోగ్యరంగంలోని వారు మరింత ఉ త్సాహంతో మెరుగ్గా పనిచేయడానికి ప్రేరణగా నిలిచిందని, ఇది వ్యవస్థ మెరుగుపడడానికి, ప్రవర్తనలోమార్పును సంస్థాగతం చేసి మొత్తం వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఉపకరించిందని అన్నారు.
కే్ంద్రమంత్రి ఆస్పత్రిలో పలువురు పేషెంట్లతో కూడా ముచ్చటించారు.
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, కేంద్ర ఆరోగ్య సర్వీసుల డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ , సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎస్.వి.ఆర్య మంత్రి వెంట ఉన్నారు.
(Release ID: 1755473)
Visitor Counter : 170