ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

76.57 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 64.5 లక్షలకుపైగా డోసులు పంపిణీ

97.64 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 30,570 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,42,923) 1.03 శాతం

వారపు పాజిటివిటీ రేటు (1.93 శాతం) గత 83 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 16 SEP 2021 9:31AM by PIB Hyderabad

దేశంలో కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 76.57 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన  64,51,423 డోసులతో కలిపి, మొత్తంగా 76.57 కోట్ల డోసులను (76,57,17,137) టీకా కార్యక్రమం అధిగమించింది. 77,22,914 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

1st Dose

1,03,65,645

2nd Dose

86,41,364

 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

1st Dose

1,83,40,334

2nd Dose

1,42,03,101

 

18-44 ఏళ్ల వారు

1st Dose

30,91,72,935

2nd Dose

4,88,51,566

 

45-59 ఏళ్ల వారు

1st Dose

14,62,56,729

2nd Dose

6,50,07,644

 

60 ఏళ్లు పైబడినవారు

1st Dose

9,45,11,108

2nd Dose

5,03,66,711

మొత్తం

76,57,17,137

 

దేశవ్యాప్తంగా టీకాల వేగాన్ని పెంచడానికి, పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

గత 24 గంటల్లో 38,303 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,25,60,474కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.64 శాతానికి చేరింది.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 81వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 30,570 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 3,42,923. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 1.03 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 15,79,761 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 54.77 కోట్లకుపైగా (54,77,01,729) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది. గత 83 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.94 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 17 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 100 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****



(Release ID: 1755387) Visitor Counter : 119