రక్షణ మంత్రిత్వ శాఖ
డయ్యూ తీరంలో ప్రతికూల వాతావరణం మధ్య ఏడుగురు మత్య్యకారులను రక్షించిన భారత తీర రక్షకదళం (ఐసిజి)
Posted On:
15 SEP 2021 11:15AM by PIB Hyderabad
భారత తీర రక్షకదళం (ఐసిజి) సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు దేశీయ ఎ.ఎల్.హెచ్ ఎం.కె -3ని వినియోగిస్తోంది.
యాంత్రిక వైఫల్యం కారణంగా బాధిత పడవ కల్లోల కడలిలో వానక్ బరా తీరానికి దూరంగా నిలిపివేయడం జరిగింది. సహాయ పునరావాస కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు జామ్‌నగర్‌లో సిబ్బందిని. పరికరాలను భారత తీర రక్షక దళం ఏర్పాటు చేసింది.
2021 సెప్టెంబర్ 13 వ తేదీ రాత్రి డయ్యూ సమీపంలోని వానక్ బరా తీరానికి దూరంగానిలిపి ఉంచిన, మునిగిపోవడానికి సిద్ధఃగా ఉన్న పడవ నుంచి ఏడుగురు మత్స్య కారులను తీర రక్షకదళం రక్షించింది. డయ్యూ పాలనాయంత్రాంగం నుంచి సహాయం కోసం సమాచారం అందిన వెంటనే భారత తీరరక్షక దళం స్పందించి దేశీయ అధునాతన తేలికపాటి హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్) ఎం.కె.-3ని పోరుబందర్ నుంచి సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు కటిక చీకటి, ప్రతికూల వాతావరణంలో అక్కడకు పంపింది.డయ్యూ గుజరాత్‌లోని పోరుబందర్‌నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పెనుగాలుఉల, వర్షానికి తట్టుకుని భారత తీర రక్షక దళ హెలికాప్టర్ , సహాయం కోసం ఎదురు చూస్తున్న పడవ ఉన్న ప్రాంతానికి చేరుకుంది. కటిక చీకటి, దీనికి తోడు సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పరిస్థితి సంక్లిష్టంగా తయారైంది. అయినప్పటికీ, పడవలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను రెండు విడతలలో సురక్షితంగా తీరానికి చేర్చారు.
యాంత్రిక వైఫల్యం కారణంగా పడవ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. తీర రక్షక దళం రక్షించిన ఏడుగురు మత్స్య కారులను స్థానిక పాలనా యంత్రాంగానికి అప్పగించారు. వారంతా సురక్షితంగా , ఆరోగ్యంగా ఉన్నారు.
దీనితోపాటు 2021 సెప్టెంబర్ 13న 300 కిలోమీటర్ల దూరంలో ని జామ్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ , సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు సహాయక పడవలతో పాటు సిబ్బందిని పంపాల్సిందిగా భారత తీర రక్షక దళాన్ని కోరింది. జామ్‌నగర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద పరిస్థితులు ఏర్పడవచ్చన్న ముందస్తు అంచనాలతో ఐసిజిని సహాయం కోసం కోరారు. సమాచారం అందుకున్న వెంటనే తీర రక్షక దళం 6 జెమిని ఇన్‌ఫ్లాటబుల్ బోట్ లను, 35 మందితో కూడిన విపత్తు సహాయ బృందాన్ని , వైద్య బృందాన్ని వడినార్ నుంచి జామ్‌నగర్ పంపింది. సహాయ , పునరావాస కార్యకలాపాలు వేగవంతం చేసేందుకు వీరిని పంపారు.
స్థానిక పాలనాయంత్రాంగం అవసరాల మేరకు తగిన సహాయకార్యక్రమాలు చేపట్టేందుకు ఐసిజి డిఆర్‌టి సిబ్బందిని పంపడం జరుగుతుంది.
***
(Release ID: 1755093)
Visitor Counter : 174