పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఐసీఎంఆర్‌, ఐఐటీ-బొంబాయికి డ్రోన్ వినియోగ అనుమతులను మంజూరు చేసిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

Posted On: 13 SEP 2021 5:00PM by PIB Hyderabad

భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌),  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బొంబాయి (IIT-B) సంస్థ‌లు డ్రోన్ల‌ను వినియోగించేందుకు గాను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసీఏ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డ్రోన్ రూల్స్, 2021 షరతులతో కూడిన మినహాయింపును మంజూరు చేసింది. అండమాన్, నికోబార్ దీవులు, మణిపూర్, నాగాలాండ్‌లో 3000 మీటర్ల ఎత్తు వరకు డ్రోన్‌లను ఉపయోగించి ప్రయోగాత్మక బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ 


బీవీఎల్ఓఎస్‌) వ్యాక్సిన్ డెలివరీ చేసేందుకు వీలుగా ఐసీఎంఆర్‌కు అనుమ‌తులు మంజూరు చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్  ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి (ఐఐటీ-బీ), తన సొంత ప్రాంగణంలో పరిశోధన, అభివృద్ధి,  డ్రోన్‌ల పరీక్షల నిమిత్తం డ్రోన్ల‌ వినియోగ‌పు అనుమతిని పొందింది. ఈ మినహాయింపు నిర్ధ‌ష్ట‌ గగనతల క్లియరెన్స్  నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. గగనతల క్లియరెన్స్ ఆమోదం పొందిన తేదీ నుండి లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఏది ముందు అయితే అది ఒక సంవత్సరం పాటు చెల్లుబాటుతో  ఈ అనుమ‌తులు అమ‌ల‌వుతాయి. దీనికి సంబంధించిన పబ్లిక్ నోటీసులకు లింక్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ నుండి పొంద‌వ‌చ్చును. ఇంతకుముందు, 11 సెప్టెంబర్ 2021 న, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ వద్ద మొదటిసారిగా ‘మెడిసిన్స్ ఫ్రమ్ ది స్కై’ ప్రాజెక్టును ప్రారంభించారు, దీని కింద డ్రోన్‌లను ఉపయోగించి మందులు మరియు వ్యాక్సిన్‌లను పంపిణీ చేస్తారు. 25 ఆగష్టు 2021న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డ్రోన్ కార్యకలాపాలలో ర‌క్ష‌ణ మరియు భద్రతా అంశాలను సమతుల్యం చేసుకుంటూ సూపర్-నార్మల్ వృద్ధి యుగాన్ని ప్రారంభించడానికి సరళీకృత డ్రోన్ రూల్స్, 2021ను అందుబాటులోకి తెచ్చింది. 

 



(Release ID: 1754577) Visitor Counter : 160