శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పర్యావరణ హితకరమైన పొదుపైన సెలైన్ గార్గల్ ఆర్‌టిపిసిఆర్ టెక్నిక్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖకు బదలీ
పౌరహితకరమైన , సత్వర కోవిడ్ -19 పరీక్షలను గ్రామీణ , గిరిజన ప్రాంతాలలో నిర్వహించేందుకు సెలైన్ గార్గల్ ఆర్‌టిపిసిఆర్ పద్ధతిని ఉపయోగించవచ్చు: నకేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
సెలైన్ గార్గల్ ఆర్‌టిపిసిఆర్ ఆవిష్కరణను అర్హులైన భాగస్వాములకు పెద్ద ఎత్తున ఉత్పత్తికి లైసెన్సు ఇచ్చే అవకాశం ఉంది. : సిఎస్ఐఆర్- ఎన్.ఇ.ఇ.ఆర్.ఐ
Posted On:
12 SEP 2021 11:59AM by PIB Hyderabad
కోవిడ్ -19 పై ఇండియా సాగిస్తున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సిఎస్ ఐ ఆర్)కు చెందిన నాగపూర్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ ఇ ఇఆర్ ఐ), దేశీయంగా అభివృద్ధి చేసిన సెలైన్ గార్గల్ ఆర్‌టిపిసిఆర్ టెక్నిక్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసింది. కోవిడ్ -19 శాంపిళ్ల పరీక్షకు ఇది ఉపయోగపడుతుంది. సెలైన్ గార్గల్ పరీక్ష సులభమైనది, త్వరతగతిన ఫలితం వచ్చేది. తక్కువ ధరతో సాధ్యమ్యేది, పేషెంట్‌కు అనుకూలమైనది, సౌకర్యవంతమైనది. దీని ద్వారా అప్పటికప్పుడు ఫలితాన్ని తెలుసుకోవచ్చు, ఇది గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు ఎంతో అనువైనది. కనీస మౌలిక సదుపాయాలు మాత్రమే ఉన్న చోట ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ ఆవిష్కరణను సమాజహతం కోసం జాతికి అంకితం చేస్తున్నట్టు సిఎస్ ఐ ఆర్- ఎన్ ఇ ఇ ఆర్ ఐ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న , మధ్యతరహా ఎంటర్ ప్రైజ్ మంత్రిత్వశాఖకు బదలీ చేస్తున్నట్టు తెలిపింది. దీనితో ఈ ఆవిష్కరణకు సంబంధఙంచి వాణిజ్య పరంగా సమర్ధులైన వారికి దీని తయారీకి లైసెన్సులు ఇవ్వడానిఇక వీలు కలుగుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు, వివిధ గ్రామీణ పథకాలు, విభాగాల కింద దీనిని తయారు చేయడానికి వీలు కలుగుతుంది. లైసెన్సులు పొందిన వారు సులభంగా వాడకానికి వీలైన కిట్ల రూపంలో వీటిని తయారు చేయవలసి ఉంటుంది. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అలాగే మూడో వేవ్ వస్తుందన్న ఊహాగానల మధ్య సిఎస్ ఐఆర్ -ఎన్.ఇ.ఇ.ఆర్ ఐ ఇందుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని బదలీ చేసింది. దేశ వ్యాప్తంగా లైసెన్సులు అందుబాటులోకి వచ్చేందుకు ఈ చర్యలు తీసుకుంది.
సెలైన్ గార్గల్ ఆర్‌టిపిసిఆర్ టెక్నిక్ కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదిలి 2021 సెప్టెంబర్ 11న కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి మాట్లాడుతూ , సెలైన్ గార్గల్ ఆర్‌టి-పిసిఆర్ పద్ధతి ని దేశవ్యాప్తంగా అమలు చేయవలసి ఉంది. ప్రత్యేకింది గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో పెద్దగా సదుపాయాలు అందుబాటులో లేని ప్రాతాలలో ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వరా సత్వరం ఫలితాలు రాబట్టవచ్చు. అలాగే ఈ పరీక్షా పద్ధతి పౌరులకు ఎంతో అనుకూల మైనది. కోవిడ్ పై పోరాటంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఎం.ఎస్.ఎం. ఇ యూడినట్ ఈ సెలైన్ గార్గిల్ ఆర్‌టి పిసిఆర్ టెక్నాలజీని వాణిజ్య పరంగా అందుబాటులోకి తెచ్చేందుకు సిఎస్ఐఆర్- ఎన్ఇఇఆర్ ఐని సంప్రదించింది.
గార్గల్ ఆర్‌టి పిసిఆర్ టెక్నాలజీని కనుగొన్న ప్రధాన శాస్త్రవేత్త ఎన్.ఇ.ఇఆర్ ఐ కి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ ఖైర్నర్, అలాగే నాగపూర్ లోని సిఎస్ఐఆర్ – ఎన్.ఇ.ఇ.ఆర్.ఐ కి చెందిన ఎన్విరాన్‌మెంటల్ వైరాలజీ పరిశోధక బృందం శాస్త్రవేత్త, ఇవిసి, ఇవిసి, సిఎస్ఐఆర్- ఎన్ ఇ ఇ ఆర్ ఐ, సెలైన్ గార్గల్ ఆర్‌టి-పిసిఆర్ ను కనుగొన్న డాక్టర్ కృష్ణకుమార్, సిఎస్ ఐఆర్ -ఎన్ ఇ ఇ ఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారిఇ చంద్రశేఖర్, సిఎస్ైఆర్-ఎన్ఇఇఆర్ ఐ టెక్నాలజీ ట్రాన్సఫర్ ఛైర్మన్ డాక్టర్ అతుల్ వైద్య, ఎం.ఎస్.ఎం.ఇ యూనిట్ డైరక్టర్ శ్రీ రాజేష్ దగా, ఎంస్.ఎంఇ యూనిట్ డైరక్టర్ శ్రీ కమలేష్ దగా లు కూడా ఎం.ఎస్.ఎం. ఇ యూనిట్‌కు టెక్నాలజీ బదలీ సందర్భంలో హాజరయ్యారు.
ఇది కూడా చదవండి:
వినూత్న, పేషెంట్ అనుకూల సెలైన్ గార్గల్ ఆర్‌టి-పిసిఆర్ విధానం. ఎన్.ఇ.ఇ.ఆర్‌పి నాగపూర్‌కు ధన్యవాదాలు
(Release ID: 1754366)
Visitor Counter : 285