ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్- అప్‌డేట్స్
Posted On:
08 SEP 2021 6:53PM by PIB Hyderabad
ఆదాయ పన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్ (www.incometax.gov.in) ను 2021 జూన్ 7 వ తేదీని ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారలు, ప్రొఫెషనల్స్ ఇందుకు సంబంధించిన ఇబ్బందులపై ఆదాయపన్నుశాఖ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు ఆర్ధిక మంత్రిత్వశాఖ దీనిని నిరంతరం సమీక్షిస్ఊత వస్తుంది. సమస్యలను ఇన్‌ఫోసిస్ లిమిటెడ్‌తో కలిసి పరిష్కరింపచేస్తూ వస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫోసిస్ మేనేజ్‌డ్ సర్వీసెస్ ప్రోవైడర్‌గా ఉంది.
ఇందుకు సంబంధించి పలు సాంకేతిక అంశాలను సానుకూలంగా పరిష్కరించడం జరిగింది. దీనితో ఈ పోర్టల్‌లో వివిధ ఫైలింగ్‌ల గణాంకాలు సానుకూల సంకేతాన్ని సూచిస్తున్నాయి. 2021 సెప్టెంబర్ 7 వ తేదీ వీరకు 8.83 కోట్ల మంది ప్రత్యేక పన్ను చెల్లింపుదారులు తమ ఫైలింగ్‌లను దీని ద్వారా దాఖలుచేశారు. రోజువారి సగటు సెప్టెంబర్ 2021లో 15.55 లక్షలకు పైగానే ఉంది. ఆదాయన్ను రిటర్న్ (ఐటిఆర్) ఫైలింగ్ సెప్టెంబర్ 2021లో రోజూ3.2 లక్షలకు పెరిగింది. అలాగే ఆయకార్ సంవత్సరం 2021-22 కు సంబంధించి 1.19 కోట్ల ఆదాయప్ను రిటర్నులు దాఖలయ్యాయి. ఇందులో 76.2 లక్షల పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను ఫైల్ చేయడానికి ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.
మరో ప్రోత్సాహకరమైన అంశం ఏమంటే 94.88 లక్షలకు పైగా ఐటిఆర్‌లను ఈ -వెరిఫై చేయడం జరిగింది. సెంట్రలైజ్‌డ్్ ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా ప్రాసెసింగ్‌కు ఇది అవసరం. ఇందులో 7.07 లక్షల ఐటిఆర్‌లను ప్రాసెస్ చేయడం జరిగింది.
ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, అప్పీల్, పెనాల్టీ ప్రొసీడింగ్స్ కింద డిపార్టమెంట్ జారీచేసిన 8.74 లక్షల నోటీసులను పన్ను చెల్లింపుదారులు చూడగలుగుతున్నారు. ఇందులో 2.61 లక్షల సమాధానాలు ఫైల్ అయ్యాయిఇ. సగటున 8,285 నోటీసులు ఈ ప్రోసీడింగ్స్ కోసం జారీ అయ్యాయి. , 5,889 స్పందనలు రోజువారి లెక్కన ఫైల్ అయ్యాయి.
10.60 లక్షల చట్టబద్ధ ఫారమ్‌లు దాఖలయ్యాయి. ఇందులో 7.86 లక్షల టిడిఎస్ స్టేట్‌మెంట్లు, 1.03 లక్షల ఫారమ్ 10 ఎ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రస్ట్స్, ఇన్‌స్టిట్యూషన్లు ఉన్నాయి. 0.87 లక్షల ఫారమ్ 10 ఇ శాలరీ అరియర్స్‌కు సంబంధించినవి ఉననాయి. 0.10 లక్షల ఫారమ్ 35 అప్పీల్ వి ఉన్నాయి.
ఆధార్- పాన్ అనుసంధానత 66.44 లక్షల పన్ను చెల్లింపుదారులు చేసుకున్నారు,14.59 లక్షలకు పైగా ఈ- పాన్ అలాట్ అయింది. ఈ రెండు సదుపాయాలను 0.50 లక్షల పన్ను చెల్లింపుదారులు 2021 సెప్టెంబర్‌లో రోజువారీ పద్ధతిలో ఉపయోగించుకున్నారు.
పన్ను చెల్లింపుదారులకు సులభతర ఫైలింగ్ అనుభవంలోకి వచ్చేందుకు ఆదాయపన్నుశాఖ నిరంతరం ఇన్‌ఫోసిస్‌తో సంప్రదిస్తూ ఉన్నట్టు ఆ సంస్థ పునరుద్ఘాటించింది.
****
(Release ID: 1753532)
Visitor Counter : 217