ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఎఫ్ఓఎస్ఎస్‌4జీఓవీ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ వరకు పొడిగింపు

Posted On: 08 SEP 2021 4:58PM by PIB Hyderabad

ప్ర‌భుత్వ పాల‌న మరియు ప్రభుత్వ పనితీరుల‌లో ఎఫ్ఓఎస్ఎస్ వినియోగం, దానిని అందిపుచ్చుకోవ‌డానికి  సంబంధించి త‌గిన అవ‌గాహ‌న‌ను క‌ల్పించేందుకు గాను  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ  గ‌త ఏప్రిల్ 22వ తేదీన  'ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ (ఎఫ్ఓఎస్ఎస్‌) అనే అంశంపై  వర్చువల్ రౌండ్ టేబుల్ చర్చను నిర్వహించింది. మైగౌవ్ (ఎంవైజీఓవీ)  ఏడు సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ  # ఎఫ్ఓఎస్ఎస్ 4 జీవోవీ
ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ని ప్రారంభించింది.  ప్రభుత్వంలో ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ (ఎఫ్ఓఎస్ఎస్‌) స్వీకరణను వేగవంతం చేయడానికి, భారత ఎఫ్ఓఎస్ఎస్‌ పర్యావరణ వ్యవస్థను జూలై 26, 2021వ తేదీన  ఏర్పాటు చేసింది.  ఈ సవాలు ద్వారా, భారత దేశంలోని వివిధ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, విద్యావేత్తలు మరియు విద్యార్థులు తమ ప్రస్తుత ఎఫ్ఓఎస్ఎస్ ఆధారిత ఆవిష్కరణలను ప్రదర్శించడానికి మరియు/లేదా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం) మరియు ఎంటర్‌ప్రైజెస్ రీసోర్స్ ప్లానింగ్ (ఈఆర్‌పీల‌లో) కొత్త, అమలు చేయగల, ఓపెన్-సోర్స్ ఉత్పత్తి ఆవిష్కరణలను రూపొందించడానికి సంబంధించి ప్ర‌తిపాద‌న‌ల‌ను ఈ ఛాలెంజ్ ద్వారా  ఆహ్వానించబడ్డాయి.  ఆరోగ్యం,  విద్య‌, వ్య‌వ‌సాయం, ప‌ట్ట‌ణ ప‌రిపాల‌న రంగం మొదలైన వాటిలో గౌటెక్ వినియోగం గురించి కూడా ఈ ఛాలెంజ్‌లో ప్ర‌తిపాద‌న‌లు ఆహ్వానించ‌బ‌డినాయి. ఛాలెంజ్ విజేతల‌కు
నగదు రివార్డుల‌తో పాటుగా , ప్రభుత్వ ఇ -మార్కెట్ (జీఈఎమ్) లో లిస్టింగ్ ద్వారా తమ ఉత్పత్తుల విస్తృతిని పెంచుకోవ‌డానికి
ఇంక్యుబేషన్ సపోర్ట్ అందుతుంది. ఈ ఛాలెంజ్‌లో మరింత ఎక్కువ మంది పాల్గొనేలా  ప్రోత్సహించడానికి, పాల్గొనేలా చూసేందుకు మరియు త‌మ ఎంట్రీల‌ను సమర్పించడానికి వీలు క‌ల్పించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా ఎంట్రీల‌ను పంపేందుకు గాను చివరి తేదీని 15 సెప్టెంబర్, 2021 వరకు పొడిగించబడింది. ఎఫ్ఓఎస్ఎస్‌ విప్లవాన్ని దాని గరిష్ట సామర్థ్యానికి నడిపించడానికి పెద్ద సంఖ్యలో పాల్గొనమని ఎఫ్ఓఎస్ఎస్‌ ఆవిష్కర్తలకు మంత్రిత్వ శాఖ‌ విజ్ఞప్తి చేసింది.

 

***



(Release ID: 1753253) Visitor Counter : 165