పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

పర్యావరణంపై భారత-జపాన్ దేశాల మధ్య ఈ రోజు జరిగిన - మొదటి ఉన్నత స్థాయి విధానపరమైన చర్చలు

Posted On: 07 SEP 2021 6:24PM by PIB Hyderabad

భారత - జపాన్ దేశాల మొదటి ఉన్నత స్థాయి విధానపరమైన చర్చలు 2021 సెప్టెంబర్, 7వ తేదీ న, భారత కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మరియు జపాన్ దేశ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ కోయిజుమి షింజిరో ల మధ్య జరిగాయి.   వాయు కాలుష్యం, స్థిరమైన సాంకేతికతలు, రవాణా, వాతావరణ మార్పు,  సముద్రపు చెత్త  , ఫ్లోరోకార్బన్లు, సి.ఓ.పి.-26, మొదలైన అంశాలపై వారు చర్చించారు.

ఈ సమావేశంలో, శ్రీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, పర్యావరణంపై భారత-జపాన్ ద్వైపాక్షిక సహకారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడంతో పాటు, భారతదేశంలో కొత్త సాంకేతికతలను తీసుకురావడంలో జపాన్ చేసిన కృషిని ప్రశంసించారు. అదేవిధంగా, గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వంలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతదేశం సాధించిన విజయాలను కూడా ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. 

భారత - జపాన్ దేశాల మధ్య ముఖ్యంగా సర్కులర్ ఆర్థిక వ్యవస్థ, వనరుల సామర్థ్యం, తక్కువ కార్బన్ సాంకేతికత, గ్రీన్ హైడ్రోజన్ మొదలైన వాటిపై ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి అన్వేషించవచ్చునని, శ్రీ యాదవ్ సూచించారు. 

తక్కువ కార్బన్ సాంకేతికతపై జపాన్ నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, భారత, స్వీడన్ దేశాల నేతృత్వంలో ప్రపంచ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలలో, పరిశ్రమ పరివర్తన కోసం లీడర్‌షిప్ గ్రూపులో చేరడాన్ని పరిగణించాలని కూడా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జపాన్‌ దేశాన్ని అభ్యర్థించారు.

జపాన్ పర్యావరణ శాఖ మంత్రి, శ్రీ కోయిజుమి షింజిరో, జపాన్ పర్యావరణ మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ,   జాయింట్ క్రెడిట్ మెకానిజం (జె.సి.ఎం), విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి (సి.డి.ఆర్‌.ఐ) ద్వారా రెండు దేశాలు ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయగలవనీ, జి-20 ఆమోదించిన ప్రాంతాలలో సహకారం, ముఖ్యంగా వాతావరణం, పర్యావరణం మరియు విద్యుత్తు గురించి కూడా అన్వేషించవచ్చునని, పేర్కొన్నారు.

పర్యావరణంపై ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికీ, జె.సి.ఎం. పై చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడానికీ ఇరుపక్షాలు అంగీకరించాయి.

 

*****



(Release ID: 1753023) Visitor Counter : 185


Read this release in: English , Urdu , Hindi , Odia