ఆయుష్
ఆయుర్వేదలో అకాడెమిక్ చైర్ ఏర్పాటుకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మరియు ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం
Posted On:
07 SEP 2021 4:04PM by PIB Hyderabad
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద' సంస్థలో ఆయుర్వేద అకడెమిక్ ఛైర్‌ను నియమకానికి సంబంధించి వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ఆస్ట్రేలియా ఎన్ఐసీఎంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వర్చువల్ విధానంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద
డైరెక్టర్ ప్రోఫెసర్ తనూజ నేసరి, ఆస్ట్రేలియా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ బార్నీ గ్లోవర్ ఈ అవగాహన ఒప్పందంపై తమ తమ సంతకాలు చేశారు. ఆయుష్ కార్యదర్శి వైద్య రాజెచ్ కోటెచా, ఆస్ట్రేలియా దేశ ఎంపీ, వాణిజ్య, పర్యటక, పెట్టుబడులు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మిస్టర్ డాన్ టెహాన్ ల సమక్షంలో ఎంఓయుపై సంతకాల కార్యక్రమం జరిగింది. కొత్త అకాడెమిక్ చైర్ ఆయుర్వేదంలో విద్యా మార్గదర్శకాలతో సహా వివిధ విద్యా మరియు సహకార పరిశోధన కార్యకలాపాలను కూడా చేపట్టనుంది.
మూలికా ఔషధాలు, యోగా అలాగే విద్యా ప్రమాణాల రూపకల్పన మరియు స్వల్పకాలిక/మధ్య కాలిక కోర్సులు, విద్యా విధి విధానాలు రూపకల్పన వంటి కార్యక్రమాలను చేపట్టనుంది. ఈ చైర్ ఆయుర్వేదంపై కార్యశాలలను/ సెమినార్లు/కాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తుంది, ఆస్ట్రేలియాలో ఆయుర్వేద వ్యవస్థలను సురక్షితంగా మరియు సమర్థవంతంగా ఉపయోగించేలా చర్యలను కూడా చేపడుతుంది. ఆయుర్వేదం విద్యా మరియు పరిశోధన కార్యక్రమాలలో బలాలు మరియు అంతరాలను గుర్తించి పరిశోధన కార్యకలాపాలలో తగిన ప్రోత్సాహంతో సహా విద్యార్థులకు ట్యుటోరియల్స్ అందిస్తారు.. మరియు భారతదేశంలో ఆయుర్వేదంలో ఆవిష్కరణలకు తగిన తొడ్పాటును అందిస్తారు. సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ విషయంలో తగిన సాక్ష్యాధారిత ఆయుర్వేద ఔషధాల అనువాదం మరియు ఏకీకరణను ప్రోత్సహించడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడానికి, బలమైన ఆస్ట్రేలియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్‌లో ఆయుర్వేదానికి సంబంధించిన తగిన పరిశోధన మరియు విధాన అభివృద్ధిలో బోధనల నైపుణ్యాన్ని ప్రదర్శించడం, పెంపొందించడంలో విద్యా నాయకత్వాన్ని అందించేలా ఈ చైర్ కృషి చేస్తుంది.
పరిశోధనల ఆవిష్కరణ, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది..
డబ్ల్యుఎస్‌యు ఆస్ట్రేలియా ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ లిండా టేలర్, డబ్ల్యుఎస్‌యు ఆస్ట్రేలియా వైస్ ఛాన్సలర్, అధ్యక్షుడు ప్రొఫెసర్ బార్నీ గ్లోవర్ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేశారు. ఈ చొరవ రెండు దేశాలకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుందని మరియు పరిశోధన ఆవిష్కరణ మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుందని మరియు సామాజిక అభివృద్ధిలో కూడా సహాయపడుతుందని వారు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ చొరవ ఆర్థిక అభివృద్ధి అలాగే ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటెచా మాట్లాడుతూ చైర్ ఎంఒయు ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఎంఓయు అనుకున్న లక్ష్యాలను తన లక్ష్యాలను చేరుకొనేలా ఆయుష్ మంత్రిత్వ శాఖ తన సంపూర్ణ సహకారం, మద్దతును అందిస్తుందని హామీ ఇచ్చారు.
మూడేండ్ల కాలపరిమితితో ఏర్పాటు..
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీకి చెందిన ఎన్ఐసీఎం హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో వెస్ట్ మీడ్ క్యాంపస్ కేంద్రంగా ఈ ఆయుర్వేద అకాడెమిక్ చైర్ మూడేళ్ల కాలపరిమితితో పని చేస్తుంది. చైర్ ఏర్పాటుకు భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు పశ్చిమ సిడ్నీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిధులు సమకూర్చాయి. 2022 ప్రారంభం నుంచి ఇది పని చేయడం ప్రారంభిస్తుందని అంచనా.
****
(Release ID: 1752963)
Visitor Counter : 214