ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రిక్స్ 13వ శిఖర సమ్మేళనం

Posted On: 07 SEP 2021 8:20AM by PIB Hyderabad

బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్‌’) కు 2021వ సంవత్సరం లో భారతదేశం అధ్యక్ష స్థానం లో కొనసాగుతూ ఉన్న నేపథ్యం లో, 2021 సెప్టెంబర్ 9 న జరుగనున్న ‘బ్రిక్స్’ పదమూడో శిఖర సమ్మేళనాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించనున్నారు.  ఈ సమావేశం లో బ్రెజిల్ అధ్య‌క్షుడు మాన్య శ్రీ జాయిర్ బోల్ సొనారొ,  రష్యా అధ్యక్షుడు మాన్య శ్రీ వ్లాదిమీర్ పుతిన్, చైనా అధ్యక్షుడు మాన్య శ్రీ శీ చిన్ పింగ్, ద‌క్షిణ ఆఫ్రికా అధ్య‌క్షుడు మాన్య‌ శ్రీ సాయిరిల్ రామాఫోసా లు పాలుపంచుకోనున్నారు.   భారతదేశాని కి జాతీయ భద్రత సలహాదారు  గా ఉన్న శ్రీ అజిత్ డోవాల్, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ మార్కోస్ ట్రాయజో, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడు శ్రీ ఓంకార్ కంవర్, బ్రిక్స్ విమెన్స్ బిజినెస్ అలాయన్స్ తాత్కాలిక అధ్యక్షురాలు డాక్టర్ సంగీత రెడ్డి ఈ సందర్భం లో తమ తమ హోదాల లో ఏడాది పొడవున చేపట్టిన కార్యాల ఫలితాల ను గురించిన నివేదిక ను నేతల కు సమర్పిస్తారు.
 

ఈ శిఖర సమ్మేళనాని కి ‘BRICS@15: ఇంట్రా- ‘బ్రిక్స్’ కోఆపరేశన్ ఫార్ కంటీన్యూటీ, కన్సాలిడేశన్ ఎండ్ కన్ సెన్సస్’ అనే అంశం ఇతివృతం గా ఉంది.  భారతదేశం తన అధ్యక్ష హోదా లో నాలుగు ప్రాధన్య రంగాల ముసాయిదా ను రూపొందించింది.  ఆ నాలుగు రంగాల లో బహుళ స్థాయి ల ప్రణాళిక, ఉగ్రవాదాన్ని ఎదురించడం, ఎస్ డిజి స్ లక్ష్యాల ను సాధించడం కోసం డిజిటల్ ఎండ్ టెక్నలాజికల్ టూల్స్ ను వినియోగించడం లతో పాటు ప్రజల మధ్య రాకపోకల ను పెంచడం వంటివి భాగం గా ఉన్నాయి.  ఈ రంగాల కు అదనం గా, నేత లు కోవిడ్ మహమ్మారి దుష్ప్రభావాలు, ఇతర వర్తమాన ప్రాంతీయ అంశాలు మరియు ప్రపంచ అంశాల పై వారి వారి అభిప్రాయాల ను కూడా పరస్పరం వ్యక్తం చేయనున్నారు.

ప్రధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోదీ ‘బ్రిక్స్’ సమ్మేళనానికి అధ్యక్షత వహించడం ఇది రెండో సారి.  ఇంతకు ముందు 2016వ సంవత్సరం లో ఆయన గోవా శిఖర సమ్మేళనాని కి అధ్యక్షత వహించారు.  ఈ సంవత్సరం లో ‘బ్రిక్స్’ కు భారతదేశం అధ్యక్ష స్థానం లో ఉండడం, ఈ ఏడాది లో ‘బ్రిక్స్’ తాలూకు పదిహేనో స్థాపన వార్షిక ఉత్సవాన్ని జరుపుకొంటూ ఉండడం యాదృచ్చికం అని చెప్పాలి.  ఇదే అంశం ఈ శిఖర సమ్మేళనాని కి ఎంపిక చేసిన ఇతివృత్తం లో కూడా ప్రతిఫలిస్తున్నది.
 


 

***
 


(Release ID: 1752767) Visitor Counter : 282