ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘ఫుడ్ ప్రాసెసింగ్ వీక్’ను నిర్వహించింది.
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్న 'ఫుడ్ ప్రాసెసింగ్ వీక్' సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రారంభమయింది.
మధ్యప్రదేశ్‌లోని దమోహ్ ఐఐఎఫ్‌టి ద్వారా 'వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్' కింద టొమాటో ప్రాసెసింగ్ మరియు వాల్యూ యాడ్‌పై వెబినార్
మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ‘ఆత్మనిర్భర్ ఎంటర్‌ప్రైజెస్’ సిరీస్‌లో శ్రీమతి రాధిక కామత్ విజయగాథను ప్రచురించడం
రూ .3.16 కోట్ల విత్తన మూలధనం ఒడిశాలోని 811 స్వయంసహాయక సభ్యుల కోసం గ్రామ పంచాయితీ స్థాయి సమాఖ్యలకు బదిలీ చేయబడింది
మధ్యప్రదేశ్‌లోని మాండ్ల జిల్లా మానేరి ఫుడ్ పార్క్‌లో ఎం/ఎస్ విభూతి మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రారంభించారు.
Posted On:
06 SEP 2021 8:36PM by PIB Hyderabad
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవం' జరుపుకుంటుంది. వేడుకలో భాగంగా, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2021 సెప్టెంబర్ 6 నుండి 12 వరకు 'ఫుడ్ ప్రాసెసింగ్ వీక్' పాటిస్తోంది. అందులో భాగంగా మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అధికారిక వీడియో ద్వారా మంత్రిత్వ శాఖ 'ఫుడ్ ప్రాసెసింగ్ వీక్' ను 6 సెప్టెంబర్, 2021 సోమవారం నాడు ప్రారంభించింది. పిఎంఎఫ్‌ఎంఈ పథకం లబ్ధిదారు విజయ గాథ శ్రీమతి. రాధికా కామత్ ‘ఆత్మనిర్భర్ ఎంటర్‌ప్రైజెస్’ సిరీస్‌లో మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ప్రచురించబడింది.
మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ద్వారా 'వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్' కింద టొమాటో ప్రాసెసింగ్ మరియు వాల్యూ యాడ్‌పై ఒక వెబ్‌నార్ నిర్వహించబడింది. రూ .3.16 కోట్ల విత్తన మూలధనం మొత్తం 811 స్వయం సహాయక బృందాల సభ్యుల కోసం గ్రామ పంచాయితీ స్థాయి సమాఖ్యలకు బదిలీ చేయబడింది.
ఈ క్రమంలో గౌరవనీయ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ కేంద్ర పథకం - ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన సిఇఎఫ్‌పిపిసి పథకం కింద మధ్యప్రదేశ్‌లోని మాండ్ల జిల్లా మానేరి ఫుడ్ పార్క్‌లో 'ఎం/ఎస్ విభూతి మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్' యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు.
గౌరవనీయమైన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యాధునిక ప్రాసెసింగ్ సదుపాయాన్ని అభివృద్ధి చేసినందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రమోటర్లను అభినందించారు. ఈ యూనిట్ రైతులు, స్వయం సహాయక బృందాలు మరియు సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు ప్రాసెసింగ్ అవకాశాలను అందిస్తుంది. మరియు పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు.
ఈ యూనిట్ రూ .12.90 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో మరియు మంత్రిత్వ శాఖ నుండి రూ .4.65 కోట్ల గ్రాంట్-ఇన్-ఎయిడ్ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ యూనిట్ యొక్క మొత్తం సామర్థ్యం (అవుట్‌పుట్) గంటకు 4000 లీటర్లు. ఈ యూనిట్ 260 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధిని అందిస్తుంది. మరియు రైతులు వారి వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలను పొందేందుకు ప్రయోజనం చేకూరుస్తుంది.
*****
(Release ID: 1752749)
Visitor Counter : 261