వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ‌త సీజ‌న్‌కంటే 16 శాతం పెరిగిన ధాన్యం సేక‌ర‌ణ‌


ఖ‌రీఫ్ ధాన్యం సేక‌ర‌ణ వ‌ల్ల 130.47 ల‌క్ష‌ల మంది రైతులు ప్ర‌యోజ‌నం పొందారు.
ర‌బీప్రొక్యూర్‌మెంట్ ద్వారా ప్ర‌యోజనం పొందిన 49.20 ల‌క్ష‌ల మంది

Posted On: 06 SEP 2021 5:41PM by PIB Hyderabad

2020-21 ప్ర‌స్తుత ఖ‌రీఫ్ సీజ‌న్‌లో కేంద్ర ప్ర‌భుత్వం 889.62 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని ( ఖ‌రీఫ్ పంట 718.09 ల‌క్ష‌ల మెట‌రిక్ ట‌న్నుల‌, ర‌బీ పంట 171.53 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులను 05-09-2021 నాటికి కొనుగోలు చేయ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది కొనుగోలు చేసిన ధాన్యం 764.39 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు. గ‌త ఏడాది కంటే ఇది అధికం.

ప్ర‌స్తుత ధాన్యం సేక‌ర‌ణ‌ 130.47 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించింది.దీని మ‌ద్ద‌తు ధ‌ర రూ 1,67,960.77 కోట్లు. ధాన్యం ప్రొక్యూర్‌మెంట్ గ‌త ఏడాది .2019-20 సేక‌ర‌ణ  అయిన 773.45 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల స్థాయికి మించి మున్నెన్న‌డూ లేనంత‌టి గ‌రిష్ఠ‌స్థాయికి చేరింది.

ఆర్‌.ఎం.ఎస్ 2021-22 కు సంబంధించిన మార్కెటింగ్ సీజ‌న్ గోధుమ ప్రొక్యూర్‌మెంట్ రాష్ట్రాల‌లో ముగిసింది. ఇప్ప‌టివ‌ర‌కు అంటే 18-08-2021 నాటికి 433.44 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ను సేక‌రించ‌డం జ‌రిగింది. (ఇది గ‌రిష్ఠ‌స్థాయి సేక‌ర‌ణ‌.ఇది గ‌త ఏడాది సేక‌రించిన అంటే 2020-21లో సేక‌రించిన 389.93 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు మించి ఉంది.) గ‌త ఏడాది ఇదే కాలానికి కేంద్ర ప్ర‌భుత్వం 389.93 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు సేక‌రించింది.

ప్ర‌స్తుత ఆర్‌.ఎం.ఎస్ ప్రొక్యూర్‌మెంట్ కార్య‌క‌లాపాల నుంచి 49.20 ల‌క్ష‌ల మంది రైతులు ప్ర‌యోజ‌నం పొందారు. దీని మ‌ద్ద‌తు ధ‌ర విలువ 85603.57 కోట్ల రూపాయ‌లు.

2020-21 పంట సంవ‌త్స‌రానికి అంటే 2020-21 ఖ‌రీఫ్‌, 2021 ర‌బీ, 2021 వేస‌వి సీజ‌న్ తో క‌లిపి, ప్ర‌భుత్వం త‌న నోడ‌ల్ ఏజెన్సీల ద్వారా 11,93,713.15 మెట్రిక్ ట‌న్నుల ప‌ప్పుధాన్యాలు, చ‌మురు గింజ‌ల‌ను 6,742.51 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల మ‌ద్ద‌తు ధ‌ర‌కు కొనుగోలు చేసింది. దీనివ‌ల్ల త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,తెలంగాణా, హ‌ర్యానా, ఒడిషా, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌కు చెందిన 7,02,368 మంది రైతుల‌కు 2021 సెప్టెంబ‌ర్ 5 నాటికి ప్ర‌యోజ‌నం క‌లిగింది.

 

2021-22 ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్ కు సంబంధించి తాజా పంట త్వ‌ర‌లోనే రానుంది. క‌ర్ణాట‌క రాష్ట్రం నుంచి అందిన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం, 40,000 మెట్రిక్ ట‌న్నుల ప‌ప్పుధాన్యాల‌ను మ‌ద్ద‌తు ధ‌ర ప‌థ‌కం (పిఎస్ఎస్ ) కింద 2021-22 ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్‌లో  సేక‌ర‌ణ‌కు అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రిగింది. ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌నుంచి ప్ర‌తిపాదన‌లు అందిన‌వెంట‌నే  పప్పుధాన్యాలు, చ‌మురుగింజ‌లు, కొబ్బ‌రిని మ‌ద్ద‌తు ధ‌ర‌కింద  అనుమ‌తులు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. దీనివ‌ల్ల ఎఫ్‌.ఎ.క్యు గ్రేడ్ కు చెందిన ఈ పంట‌ల మార్కెట్‌ధ‌ర‌  2021-22 ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్‌లో,  ఎం.ఎస్‌.పి కంటే త‌గ్గితే వాటిని రిజిస్ట‌ర్ రైతుల‌నుంచి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో నోటిఫై చేసిన పంట కాలంలో సెంట్ర‌ల్ నోడ‌ల్ ఏజెన్సీలు రాష్ట్రాలు నామినేట్ చేసే ప్రొక్యూర్ ఏజెన్సీల  ద్వారా   గ‌త  ఏడాది సేక‌రించిన‌ట్టుగా నేరుగా సేక‌రించ‌డానికి వీలు క‌లుగుతుంది.

2021-22 సీజ‌న్‌కు సంబంధించి త‌మిళ‌నాడు నుంచి 51,000 మెట్రిక్ ట‌న్నుల  కొబ్బ‌రి సేక‌ర‌ణ‌కు అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రిగింది. 2021 సెప్టెంబ‌ర్ 5 వ తేదీ నాటికి 8.30 మెట్రిక్ ట‌న్నులు 0.09 కోట్ల రూపాయ‌ల వ్య‌వ‌యంతో త‌మిళ‌నాడులో సేక‌రించ‌డం జ‌రిగింది. దీనివ‌ల్ల త‌మిళ‌నాడులోని 36 మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగింది.

సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాలు ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్ 2021-22 కుసంబంధించి ప‌ప్పుధాన్యాలు, చ‌మురుగింజ‌ల పంట సేక‌ర‌ణ‌కు ఆయా రాష్ట్రాలు నిర్ణ‌యించిన తేదీనుంచి సేక‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్నాయి.

***

 


(Release ID: 1752684) Visitor Counter : 213