బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన నార్తరన్ కోల్ ఫీల్డ్స్( ఎన్‌సిఎల్) చే ఆజాది కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా వేలాది మంది గ్రామీణులకు ప్రయోజనం కలిగించే విధంగా సింగ్రౌలి జిల్లాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 2.25 కోట్ల రూపాయల విలువగల కార్యక్రమాలు ప్రారంభం.
Posted On:
05 SEP 2021 1:40PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వశాఖ కింద గల కోల్ ఇండియా లిమిటెడ్ విభాగమైన నార్తరన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) సింగ్రౌలి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి ఉపయోగపడే విధంగా పలు కార్యక్రమాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామీణ మౌలిక సదుపాయాలు, విద్య , నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, ఉపాధి అవకాశాల కల్పన, పారిశుధ్యం, పరిశుభ్రమైన నీటిని అందించడం, వంటి కార్యక్రమాల కింద 2.5 కోట్ల రూపాయల విలువగల పలు కార్యక్రమాలను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా చేపట్టారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి రితి పాఠక్,మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి కల్పించడం, మొత్తంగా సింగ్రౌలి జిల్లా అభివృద్ధికి ఎన్.సి.ఎల్ కృషిని అభినందించారు. సెమువార్ పంచాయత్‌లో 1.6 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్‌సిఎల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీనివల్ల పాలి, సెముర్, పొరుగున ఉన్న ప్రాంతాలకు చెందిన పదివేల మంది గ్రామస్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దీనిని ప్రారంభింరారు.
స్థానిక మహిళలు, బాలికలను స్వావలంబన సాధించే విధంగా సాధికారత కల్పించేందుకు కుట్టుబిషన్లు అందజేశారు. నైపుణ్య శిక్షణఅభివృద్ధి కార్యక్రమం కింద శిక్షణపొందిన మహిళలు, బాలికలకు నైపుణ్య శిక్షణ సర్టిఫికేట్లు అందజేశారు.
మారుమూల గ్రామాలలో ఆధునిక విద్యా సదుపాయాలు కల్పించడంలో భాగంగా, 8 సెట్ల స్మార్ట్ టీవిలు, కంప్యూటర్లను ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేశారు. అధునాతన ప్రయోగశాల పరికరాలను కూడా నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేశారు. దీనివల్ల 500 మంది విద్యార్ధులకు ప్రాక్టికల్స్‌కు సంబంధించిన పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. దీనికితోడు ఆర్.ఒ మిషన్ కలిగిన నాలుగు వాటర్ కూలర్లను ఆ పరిసర ప్రాంతాలలోని పాఠశాలలకు అందించేందుకు అధికారులకు అందజేశారు. దీనివల్ల సుమారు వెయ్యి మంది విద్యార్ధులకు సుఉరక్షిత మంచినీరు అందుబాటులోకి వస్తుంది.
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సింగ్రౌలి జిల్లాలోని పది పంచాయతిలకు చెందిన 43 అంగన్‌వాడీలకు ఫ్లోర్ మాట్‌లు, ప్లేస్కూలు స్లయిడ్‌లు, వంట పాత్రలు అందజేశారు.
స్వచ్ఛభారత్ అభియాన్‌కు మరింత ఊపునిస్తూ, నౌదియా పంచాయతిలో చెతత్ సేకరణకు వాహనాన్ని అందజేసి దానిని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ వాహనం ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తుంది. దీనివల్ల ఐదువేల మంది స్థానికులు పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడానికి వీలు కల్పిస్తుంది.
సింగ్రౌలిజిల్లాలోని బౌదార్ గ్రామంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద నిర్మించిన పాఠశాల కాంపౌండ్ వాల్ ను ప్రారంభించారు. అలాగే ఎన్.సి.ఎల్ ఏర్పాటు చేసిన ఖాదీ , చేనేత సెంటర్‌ను సందర్శించడం రిగింది. ఇక్కడ 30 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు.
ఎన్‌సిఎల్ సింగ్రౌలిలోగల మినిరత్న కంపెనీ. ఇది బొగ్గు మంత్రిత్వశాఖ పరిధిలోని సంస్థ. భారీయాంత్రికీకరణ కలిగిన 10 బొగ్గు గనులను ఇది నిర్వహిస్తోంది. దేశ మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 15 శాతం బొగ్గును ఇది ఉత్పత్తి చేస్తుంది. గత ఆర్ధిక సంవత్సరంలో 115 మిలియన్ టన్నుల బొగ్గును ఈ సంస్థ దేశానికి అందించింది.
***
(Release ID: 1752421)
Visitor Counter : 286