ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆదాయపన్నుశాఖ కార్యాలయానికి శంకుస్థాపనచేసిన కేంద్ర ఆర్ధిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
05 SEP 2021 12:07PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 5 వ తేదీన బెంగళూరులోని ఇన్‌ఫాంట్రీ రోడ్ ప్లాట్ 4,5, 6 లలో ఆదాయపన్ను శాఖ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకుస్థాపన ఫలకాన్ని అక్కడ ఆవిష్కరించారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు శ్రీ పి.సి.మోహన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి భారత ప్రభుత్వ రెవిన్యూ శాఖ కార్యదర్శి శ్రీ తరుణ్ బజాజ్, సిబిడిటి ఛైర్మన్‌శ్రీ జె.బి. మహాపాత్ర, సిబిఐసి ఛైర్బన్ శ్రీ ఎం.అజిత్ కుమార్ లు హాజరయ్యారు. ప్రస్తుతం నిర్మించనున్న ఆదాయపన్ను కార్యాలయం గ్రౌడ్ ప్లస్ 18 ఫ్లోర్స్, ఒక బేస్‌మెంట్ పార్కింగ్ కలిగి ఉంటుంది.
ఈ భవనంలో గరిష్ఠంగా సహజసిద్ధమైన వెలుతురు ఉంటేట్టు చూస్తారు. అలాగే గృహ -4 రేటింగ్ కు అనుగుణంగా దీనిని నిర్మిస్తారు. విద్యుదుత్పత్తికి సోలార్ పానెళ్ల ఏర్పాటు కు అవకాశం ఉంది. అలాగే వాన నీటి సంరక్షణ సదుపాయం కల్పిస్తారు. రీసైకిల్ చేసిన నీటిని తోటకు ఉపయోగిస్తారు. బహుళ ప్లంబింగ్ వ్యవస్థ కలిగి ఉంటుంది. మాగ్నటిక్ ఫిల్టర్‌తో సెంట్రల్ ఎయిర్ క్లీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
యువి రే స్టెరిలైజేషన్ ఏర్పాటు ఉంటుంది. సిపిడబ్ల్యుడి బెంగళూరు ప్రాజెక్ట్ సర్కిల్ దీనిని నిర్మిస్తుంది.
ఈ అధునాతన భవనంలో ప్రత్యేకంగా ప్రజాసంబంధాల కార్యాలయం ఉంటుంది. ఇది ప్రజా ఫిర్యాదులను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరిస్తుంది. పన్ను చెల్లింపుదారులకు వేచివుండే లాంజ్ ఏర్పాటు చేస్తారు. పన్ను చెల్లింపుదారుల సేవలకు సంబంధిఇంచి ఆయకార్ సేవా కేంద్రాలు కూడా ఇందులో పనిచేస్తాయి. కీలక ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఈకార్యాలయం పన్ను చెల్లింపుదారులకు ఎంతో సానుకూలంగా ఉండనుంది. విశౄల మైన భవనం, తగిన విధంగా డిజైన్ రూపకల్పన కలిగిన ఈ భవనంలో ఆదాయపన్ను అధికారులు, సిబ్బందికి తమ కార్యకలాపాలు మరింత మెరుగుగా కొనసాగించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
***
(Release ID: 1752346)
Visitor Counter : 216