ఆయుష్

రోగనిరోధక మందుల పంపిణీ కోసం జైపూర్‌ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్


పురాతన ఆయుర్వేద మరియు యోగా విజ్ఞానం ద్వారా భారతదేశం ప్రపంచాన్ని నడిపించేలా మొత్తం ఆయుర్వేద సమాజం కలిసి కట్టుగా పనిచేయాలని మంత్రి విజ్ఞప్తి

Posted On: 03 SEP 2021 3:20PM by PIB Hyderabad

ఆయుష్, పోర్ట్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ 'ఆజాది కా అమృత్ మహోత్సవ'లో భాగంగా జైపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఏ) లో ఆయుష్ రోగనిరోధక మందులు, ఆహారం, జీవనశైలిపై ముద్రించిన మార్గదర్శకాలను పంపిణీ చేసే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా  గుడుచి లేదా గిలోయ్ ఘన్ వటి,  అని కూడా పిలిచే  సంశమణివటి, అశ్వగంధవటి వృద్ధుల (60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రజలు) జనాభాపై ప్రత్యేక దృష్టి పెడుతూ ముందు వరుస కార్మికులతో సహా దేశవ్యాప్తంగా 75 లక్షల మందికి రాబోయే ఒక సంవత్సరంలో పంపిణీ చేస్తారు.

ఈ సభలో ప్రసంగించిన శ్రీ సోనోవాల్, ఆయుర్వేద సందేశాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, తద్వారా ప్రతిఒక్కరూ తమ జీవనశైలిని, ఆరోగ్యవంతమైన దేశసామజిక లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. మొత్తం ఆయుర్వేద సమాజం, చేతులు కలిపి కలిసి పనిచేయాలి, తద్వారా భారతదేశం తన పురాతన ఆయుర్వేద, యోగ జ్ఞానం ద్వారా ప్రపంచాన్ని నడిపిస్తుంది. అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.    

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00161DH.jpg

కేంద్ర మంత్రి ఎన్ఐఏ ఆసుపత్రిని కూడా సందర్శించారు, అక్కడ విద్యార్థులు మరియు ఆసుపత్రి సిబ్బందితో సంభాషించారు. ప్రత్యేకంగా ఆసుపత్రిలో పరిశుద్ధత, పరిశుభ్రతను ప్రశంసించారు. ఆయుర్వేద ఔషధాల కిట్, మార్గదర్శకాలను ఆయుర్వేద ఔషధ పరిశోధనక సెంట్రల్ కౌన్సిల్ (సిసిఆర్ఏసి) తయారు చేసింది.
భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్య్రానికి గుర్తుగా భారత ప్రభుత్వం ప్రారంభించిన 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' ప్రచారంలో భాగంగా రోగనిరోధక ఔషధాలు, ఆహారం, జీవనశైలి మార్గదర్శకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశం స్వాతంత్ర్య 75 వ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆగస్టు 2022 వరకు ఏడాది పొడవునా ప్రచారం కొనసాగుతుంది.

 

రైతులు మరియు ప్రజలకు వివిధ ఔషధ మొక్కల పంపిణీ, వై-బ్రేక్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభం, వివిధ వెబ్‌నార్‌లతో సహా అనేక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖకు 30 ఆగస్ట్ నుండి 5 సెప్టెంబర్ 2021 వరకు ఒక వారం కేటాయించింది. .

***



(Release ID: 1751748) Visitor Counter : 239