గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ ఎన్ఆర్ఇజిఎ హక్కులు/ అర్హతల అవగాహన వారోత్సవం
మహాత్మగాంధీ ఎన్ఆర్ఇజి పథకం నుంచి లబ్ధిదారులు గరిష్టంగా లబ్ధి పొందేందుకు తోడ్పడనున్న ఉపాధి, హక్కుల అవగాహనకార్యక్రమాలు
Posted On:
03 SEP 2021 1:22PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మహాత్మా గాంధీ ఎన్ఆర్ఇజి చట్టంలో పొందు పరిచిన హక్కులు, ఉపాధి గురించి శ్రామికులలో చైతన్యం/ అవగాహన తీసుకువచ్చేందుకు ఉపాధి అవగాహన వారోత్సవాలను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు నిర్వహించాయి. ఈ వారోత్సవాలను 27 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్ 2021 వరకు జరిగాయి. ఉపాధి కోరుతున్న వారికి చట్టంలోని అనేక అంశాల ద్వారా మహాత్మాగాంధీ ఎన్ ఆర్ఇజిఎ అనేక చట్టపరమైన హక్కులను కల్పిస్తుంది.
సిక్కింలోని పశ్చిమ జిల్లాలో మహాత్మా గాంధీ ఎన్ఆర్ఇజిఎ చట్టం కింద గల హక్కులు, ఉపాధి అవకాశాల గురించి శ్రామికులలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
ప్రజలకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అనేక చొరవలు తీసుకున్నాయి. తమ తమ జిల్లాలు, బ్లాకులు, గ్రామ పంచాయితీలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో పలు కార్యకలాపాలను నిర్వహించాయి. శ్రామికుల సౌకర్యార్ధం వివిధ జిల్లాలలో గ్రామ పంచాయితీ భవనాలలో గ్రామ సభలు నిర్వహించగా, కొన్ని జిల్లాలలో పని ప్రాంతంలో కార్మికులను అధికారులు కలుసుకున్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలలో అధికారులు, ఉద్యోగులు మహాత్మా గాంధీ ఎన్ఆర్ఇజిఎ లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో చురుకుగా, ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ ఉపాధి, హక్కుల చైతన్యం గురించిన కార్యక్రమాలు లబ్ధిదారులు మహాత్మగాంధీ ఎన్ఆర్ఇజి పథకం నుంచి గరిష్టంగా లబ్ధి పొందేందుకు తోడ్పడతాయి.
దుంగర్‌పూర్ జిల్లాలో గ్రామ పంచాయితీ సమితి ఎంజిఎన్ఆర్ఇజిఎ కార్మికుల కోసం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఇండియా@75 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అన్నది 75వారాల వేడుక. ఈ వేడుకలనుప్రధానమంత్రి 12 మార్చి 20న ప్రారంభించారు.
(Release ID: 1751744)
Visitor Counter : 306