శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మిషన్ కోవిడ్ కింద బయోటెక్నాలజీ శాఖ సహకారంతో బయోలాజికల్ ఇ లిమిటెడ్ అభివృద్ధి చేసిన వినూత్న కోవిడ్ -19 వ్యాక్సిన్ 'కోర్బెవాక్స్' క్లినికల్ పరీక్షల కు ఆమోదం తెలిపిన డీసీజీఐ
• వయోజన జనాభాలో క్రియాశీల నియంత్రిత III వ దశ క్లినికల్ ట్రయల్
* పిల్లలు మరియు కౌమారదశలో II/III దశల పీడియాట్రిక్ ట్రయల్ (5 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ)
Posted On:
03 SEP 2021 1:25PM by PIB Hyderabad
కోవిడ్-19 టీకాల పరిశోధన అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెరిగేలా చూడడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బయోటెక్నాలజీ అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నది. ఆత్మనిర్భర్ భారత్ సాధన దిశలో కోవిడ్ -19 టీకాలను అభివృద్ధి చేసి ప్రజలందరికి సాధ్యమైనంత త్వరగా సులువుగా సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలను అమలు చేసి అందుబాటులో ఉన్న వనరులను సమీకరించడానికి బయోటెక్నాలజీ శాఖ మిషన్ కోవిడ్ ను అమలు చేస్తున్నది.
బయోటెక్నాలజీ శాఖ దాని అనుబంధ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ కోవిడ్-19 టీకాను అభివృద్ధి చేయడానికి బయోలాజికల్ ఈ కి సహకారం అందించాయి. క్లినికల్ దశ ముందు నుంచి III వ దశ వరకు ఈ సహకారం అందించడం జరిగింది. మిషన్ కోవిడ్ సురక్ష తో పాటు కోవిడ్ -19 రీసెర్చ్ కన్సార్టియం కింద నేషనల్ బయో ఫార్మా మిషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.
. దశ I మరియు II క్లినికల్ ట్రయల్స్ సమాచారాం ఆధారంగా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమీక్ష తర్వాత పెద్దలలో ఫేజ్ III కంపేటర్ భద్రత,రోగనిరోధక శక్తి పరీక్షలను నిర్వహించడానికి బయోలాజికల్ ఈ కి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులను జారీ చేసింది. అదనంగా, పిల్లలు మరియు కౌమారదశలో కార్బేవాక్స్ ™ వ్యాక్సిన్ యొక్క భద్రత,రోగనిరోధక శక్తి, ఏమేరకు దీనిని తట్టుకోగలరు అన్న అంశాలను అంచనా వేయడానికి దశ II/III అధ్యయనాన్ని ప్రారంభించడానికి 01.09.2021 న బయోలాజికల్ ఈ ఆమోదం పొందింది. ఇది ఒక ప్రోటీన్ సబ్-యూనిట్ టీకాగా పనిచేస్తుంది.
ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0 కింద ప్రారంభించిన మిషన్ కోవిడ్ సురక్ష ద్వారా , సురక్షితమైన మరియు సమర్థవంతమైన కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల అభివృద్ధికి సహకారం అందిస్తున్నామని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రేణు స్వరూప్ అన్నారు. పిల్లలు పెద్దలు తీసుకోవడానికి వీలుగా ఉండే టీకా విడుదల కోసం తాము ఎదురుచూస్తున్నామని అన్నారు.
సంస్థ అభివృద్ధి చేసిన టీకాల క్లినికల్ పరీక్షలకు అనుమతి లభించడం పట్ల బయోలాజికల్ ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల హర్షం వ్యక్తం చేశారు. పరీక్షలను పూర్తి చేసిన తరువాత టీకా ఉత్పత్తిని ప్రారంభిస్తామని అన్నారు. తమకు సహకరించిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
డీబీటీ గురించి:
శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న బయోటెక్నాలజీ విభాగం ( డీబీటీ ) భారతదేశంలో బయోటెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, జంతుశాస్త్రం, పర్యావరణం మరియు పరిశ్రమల రంగాలలో బయోటెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువ చేయడానికి డీబీటీ కృషి చేస్తున్నది.
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ గురించి:
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC)ని లాభాపేక్ష లేకుండా సెక్షన్ 8, షెడ్యూల్ బి కింద ఒక ప్రభుత్వ రంగ సంస్థగా బయోటెక్నాలజీ శాఖ నెలకొల్పింది. వ్యూహాత్మక పరిశోధన మరియు ఆవిష్కరణలను చేపట్టడం, జాతీయంగా సంబంధిత ఉత్పత్తి అభివృద్ధి అవసరాలను బయో టెక్నాలజీ ద్వారా తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తున్నది.
బయోలాజికల్ ఈ . లిమిటెడ్ గురించి
హైదరాబాద్ కేంద్రంగా బయోలాజికల్ ఈ . లిమిటెడ్ 1953 లో ఏర్పాటు అయ్యింది. ఫార్మాస్యూటికల్స్ , బయోలాజిక్స్ రంగంలో భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అయిన బయోలాజికల్ ఈ . లిమిటెడ్ దక్షిణ భారతదేశంలో తొలి ఫార్మాస్యూటికల్ కంపెనీ. బయోలాజికల్ ఈ టీకాలు మరియు చికిత్సా విధానాల అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా రంగాలలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. బయోలాజికల్ ఈ తన టీకాలను 100 కి పైగా దేశాలకు సరఫరా చేస్తుంది. సంస్థ అభివృద్ధి చేసిన చికిత్సా ఉత్పత్తులు భారతదేశం మరియు అమెరికాలలో అమ్ముడు పోతున్నాయి. లో అమ్ముడవుతాయి. బయోలాజికల్ ఈ అభివృద్ధి చేసిన 8 టీకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాథమిక గుర్తింపు పొందాయి.
విస్తరణ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మార్కెట్ని అవసరాలకు అనుగుణంగా యంత్రిత మార్కెట్‌ల కోసం సాధారణ ఇంజెక్షన్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, సింథటిక్ జీవశాస్త్రం మరియు జీవక్రియ ఇంజినీరింగ్‌ని అన్వేషించడం లాంటి అంశాలపై సంస్థ దృష్టి సారించింది.
ఇతర వివరాలను
***
(Release ID: 1751741)
Visitor Counter : 222