ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

11వ యు.కె.-భారత ఆర్ధిక, ద్రవ్య సంబంధమైన సదస్సులో పాల్గొనే భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన - కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 02 SEP 2021 7:28PM by PIB Hyderabad

11వ భారత-యు.కె. ఆర్ధిక, ద్రవ్య సంబంధమైన సదస్సు (ఈ.ఎఫ్.డి) ఈ రోజు ఇక్కడ జరిగింది. ఈ సదస్సుకు, భారత కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మరియు యు.కె. కి చెందిన ట్రెజరీ ఛాన్సలర్ శ్రీ రిషీ సునాక్ దృశ్య మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు. 

ఈ సదస్సులో పాల్గొన్న భారత బృందం లో, భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్; సెబీ చైర్మన్; ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ. చైర్మన్;  కేంద్ర ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తో పాటు, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ; విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ; యు.కే. లో భారత రాయబార కార్యాలయానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

కాగా, యు.కె. బృందంలో, బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ గవర్నర్;  ఫైనాన్సియల్ కండక్ట్ అథారిటీ సి.ఈ.ఓ.; ఆర్ధిక కార్యదర్శి తో పాటు, యు.కే. హెచ్.ఎం.టి. కి చెందిన ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సదస్సులో, జి-20 మరియు సి.ఓ.పి-26 తో సహా బహుపాక్షిక సమస్యల పరిష్కారానికి ఆర్థిక సహకారం గురించి, ఇతర విషయాల గురించి, చర్చలు జరిగాయి.   ఫిన్-టెక్; జి.ఐ.ఎఫ్.టి. సిటీ, వార్షిక భారత-యు.కె. ఆర్ధిక మార్కెట్ సదస్సు  తో పాటు, ఫైనాన్షియల్ మార్కెట్లను సంస్కరించడానికి తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక ప్రాధాన్యత తో ఆర్ధిక సేవల సహకారాన్ని మరింతగా పెంచడంపై ఇరుపక్షాలు చర్చించాయి.  మౌలిక సదుపాయాల అభివృద్ధి; స్థిరమైన ఆర్ధిక సహకారంతో పాటు, క్లైమేట్ ఫైనాన్స్ ప్రోత్సాహం గురించి కూడా ఈ సందర్భంగా చర్చలు జరిగాయి.

భారత-యు.కె. ఆర్ధిక భాగస్వామ్యం (ఐ.యు.కె.ఎఫ్‌.పి) మరియు భారత-యు.కె. సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ కింద దాని ప్రగతి తో సహా ప్రైవేట్ రంగ కార్యక్రమాల గురించి కూడా ఈ సదస్సులో చర్చించారు.  భారతదేశంలోకి మూలధనాన్ని సమీకరించే ప్రయత్నాలను వేగవంతం చేయడానికి వీలుగా, ఆర్థిక సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలతో పాటు ఇప్పటికే ఉన్న స్థిరమైన ఆర్ధిక కార్యక్రమాలతో కలిసి పని చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన,  క్లైమేట్ ఫైనాన్స్ లీడర్‌షిప్ ఇనిషియేటివ్ (సి.ఎఫ్.ఎల్.ఐ) భారత భాగస్వామ్యాన్ని ఈరోజు ఇరుపక్షాలూ ప్రారంభించాయి.  బహుళపక్ష మరియు ప్రైవేట్ మార్గాల ద్వారా ఆర్ధిక సమీకరణ కు మరియు యు.కె. కు చెందిన రాబోయే సార్వభౌమ గ్రీన్ బాండ్ జారీ తో సహా సంబంధిత అనుభవాలను పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

భారత కేంద్ర ఆర్థిక మంత్రి మరియు యునైటెడ్ కింగ్‌డమ్ ఖజానా ఛాన్సలర్ల సంయుక్త ప్రకటనను ఆమోదించడంతో,  క్లైమేట్ ఫైనాన్స్ లీడర్‌షిప్ ఇనిషియేటివ్ (సి.ఎఫ్.ఎల్.ఐ) భారత భాగస్వామ్యానికి సంబంధించిన ఉమ్మడి ప్రకటన విడుదల చేయడంతో. 11వ ఆర్థిక, ద్రవ్య సంబంధమైన సదస్సు ముగిసింది.

అనుబంధం: 

1.       11వ భారత-యు.కె. ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ యొక్క ఉమ్మడి ప్రకటన : 

2.          క్లైమేట్ ఫైనాన్స్ లీడర్‌షిప్ ఇనిషియేటివ్ పార్ట్‌నర్‌షిప్ ఉమ్మడి ప్రకటన :

 

*****


(Release ID: 1751631) Visitor Counter : 242