మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ (డి.ఏ.హెచ్.డి) మరియు గ్రామీణాభివృద్ధి శాఖ (డి.ఓ.ఆర్.డి) ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి
'ఏ-హెచ్.ఈ.ఎల్.పి' ద్వారా, ఎస్.హెచ్.జి. ల సభ్యులను, పశువుల వనరులు మరియు ప్రాథమిక సేవా ప్రదాతలుగా ఉపయోగించడానికి దోహదపడనున్న - అవగాహనా ఒప్పందం
డి.ఏ.హెచ్.డి. పథకాల విస్తరణను పెంచడానికి, నిర్వహణను మెరుగుపరచడానికి సహాయపడనున్న - డి.ఏ.హెచ్.డి. మరియు ఎన్.ఆర్.ఎల్.ఎం. కలయిక
Posted On:
01 SEP 2021 5:22PM by PIB Hyderabad
"ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" లో భాగంగా, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ (డి.ఏ.హెచ్.డి), ఎం.ఓ.ఎఫ్.ఏ.హెచ్.డి. మరియు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం), ఎం.ఓ.ఆర్.డి. కలయిక ద్వారా గ్రామీణ ఆర్థిక వృద్ధి కోసం ఎస్.హెచ్.జి. వ్యవస్థను పెంపొందించాలనే ఉద్దేశ్యంతో డి.ఏ.హెచ్.డి. మరియు ఎం.ఓ.ఆర్.డి. మధ్య ఒక అవగాహన ఒప్పందం పై పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి, శ్రీ అతుల్ చతుర్వేది మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, శ్రీ ఎన్. ఎన్. సిన్హా, ఈ రోజు కృషి భవన్‌లో, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి, శ్రీ పురుషోత్తం రూపాల మరియు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, శ్రీ గిరిరాజ్ సింగ్ సమక్షంలో సంతకం చేశారు.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి, డా. ఎల్. మురుగన్; కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే తో పాటు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
* ఏ.హెచ్.ఐ.డి.ఎఫ్. (పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి); డి.ఐ.డి.ఎఫ్. (పాడి పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి); ఎఫ్.ఎం.డి. (పాదాలు మరియు నోటి వ్యాధి), బ్రూసెల్లోసిస్ మొదలైన వాటి కోసం ఎన్.ఏ.డి.సి.పి. (జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం) వంటి విభిన్న పథకాలు, కార్యక్రమాల ద్వారా పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ వ్యవసాయ సమాజానికి మరిన్ని ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను కల్పిస్తోంది.
* 2021-22 నుండి వచ్చే 5 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలానే ఉద్దేశ్యంతో ఇప్పటికే ఉన్న పథకాల యొక్క వివిధ భాగాలను సవరించడం, పునర్వ్యవస్థీకరించడం ద్వారా అనేక కార్యకలాపాలతో కూడిన ప్రత్యేక పశుసంవర్ధక ప్యాకేజీ ని అమలుచేయడానికి ఇటీవల, ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
* గ్రామీణాభివృద్ధి శాఖ కూడా గ్రామీణ అభ్యున్నతికి ఇదే వేదికపై వివిధ కార్యక్రమాల ద్వారా పనిచేస్తోంది. ఇక్కడ ఎక్కువ మంది మహిళలు జీవనోపాధి కార్యకలాపాలలో, ముఖ్యంగా పశుసంపద రంగంలో పని చేస్తూ, పాలుపంచుకుంటున్నారు.
* అందువల్ల, రైతులకు సహాయం చేయడంతో పాటు, పశుసంవర్ధక రంగం ద్వారా వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనే ఉమ్మడి లక్ష్యం నేపథ్యంలో డి.ఏ.హెచ్.డి. మరియు డి.ఓ.ఆర్.డి. ల మధ్య అంతరాలను తొలగించి, సమన్వయ పరిచే ప్రయత్నాలను తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉంది.
అవగాహన ఒప్పందం ప్రకారం, "ఏ-హెచ్.ఈ.ఎల్.పి" (పశువుల ఉత్పత్తి అభివృద్ధి, ఆరోగ్యం కోసం గుర్తింపు పొందిన ఏజెంట్) అనే కొత్త గుర్తింపు పొందిన మోడల్ ద్వారా, ఎస్.హెచ్.జి. ల సభ్యుల సేవలను, పశువుల వనరుల వ్యక్తులు, ప్రాథమిక సేవా ప్రదాతలుగా ఉపయోగించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఏ-హెచ్.ఈ.ఎల్.పి. కార్యకర్త గా మరింత శిక్షణ, గుర్తింపు అందించడం ద్వారా పశువుల కోసం (పశు సఖి) డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం. కింద అభివృద్ధి చేయబడిన ప్రస్తుత కేడర్‌ను ఉపయోగించడం ద్వారా ఈ మోడల్ దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది.
వ్యవసాయ జీవనోపాధి రంగానికి, దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం) అంతర్-బాహ్య అనుసంధానాల ద్వారా మద్దతునిస్తోంది. అంతర్ అనుసంధానం కింద, శిక్షణ, సామర్థ్య నిర్మాణ ప్రక్రియలో భాగంగా నిర్మాణాత్మక విధానాల ద్వారా శిక్షణ పొందుతున్న మరియు పశు పాఠశాలల ద్వారా మహిళా రైతులకు వ్యక్తిగత ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా సేవలను అందించే పశు సఖీల క్యాడర్ ల ద్వారా మద్దతు అందించబడుతుంది. ఈ మిషన్‌లో ప్రస్తుతం 40,000 కంటే ఎక్కువ మంది పశుసఖీలు ఉన్నారు. ఈ కమ్యూనిటీ క్యాడర్ల ద్వారా డి.ఏ.హెచ్.డి. పథకాల పరిధిని విస్తరించడంలో, క్యాడర్లకు అదనపు ఆదాయం సమకూర్చడంలో, తద్వారా వారి నిలకడను పెంచడంలో, ఈ కలయిక సహాయపడుతుంది.
డి.ఎ.హెచ్.డి. మరియు డి.ఆర్.డి. మధ్య అంతరాలను తొలగించి, కలిసి పనిచేయడానికి చేస్తున్న ప్రయత్నాలను, ప్రత్యేకించి రైతులకు సాయం చేయడం తో పాటు, పశుసంవర్ధక రంగం ద్వారా వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉమ్మడి లక్ష్యసాధన కోసం చేస్తున్న ప్రయత్నాలను, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల అభినందించారు.
ఈ అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు) పై సంతకం చేసినందుకు రెండు శాఖలను కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ అభినందించారు. గ్రామీణ శ్రేయస్సును పెంపొందించడం తో పాటు, ఇప్పటికే ఉన్న వనరులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అనే ఉమ్మడి లక్ష్యం కోసం రెండు విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.
*****
(Release ID: 1751258)
Visitor Counter : 624