నౌకారవాణా మంత్రిత్వ శాఖ
అతి పెద్ద నౌక నుంచి సరకులను దించి రికార్డు సృష్టించిన విఓ చిదంబరనార్ పోర్ట్
Posted On:
31 AUG 2021 9:30AM by PIB Hyderabad
అతి పెద్ద నౌక నుంచి సరకులను దించి చిదంబరనార్ పోర్ట్ 29.08.2021 న సరికొత్త రికార్డు సృష్టించింది. యూఏఈ లోని మినా సాకర్ రేవు నుంచి మెస్సర్స్ చెట్టినాడ్ సిమెంట్స్ కి సింగపూర్ కి చెందిన ఎంవీ ఇన్స్ అంకారా నౌక లో వచ్చిన 93.719 టన్నుల సున్నపు రాయిని దించి చిదంబరనార్ పోర్ట్ ఈ రికార్డు సృష్టించింది. గతంలో 2021 మే 14వ వ తేదీన ఎంవీ బషన్స్ నౌక నుంచి 92,935 టన్నుల బొగ్గును దింపి నెలకొల్పిన రికార్డును 29.08.2021 న అధిగమించడం జరిగింది.
నౌకను 2021 ఆగస్ట్ 26న బెర్త్ నెంబర్ IXకి వచ్చింది. దీనిలో ఉన్న సరకును మూడు హార్బర్ మొబైల్ క్రేనులను ఉపయోగించి రోజుకు 50,000 టన్నుల చొప్పున దింపడం ప్రారంభించారు. 29వ తేదీ నాటికి మొత్తం సరకును దింపారు. సున్నపు రాయిని తీసుకుని వచ్చిన నౌక గా ఏజెంట్ మెస్సర్స్ మాక్సన్స్ షిప్పింగ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టీవెడరింగ్ ఏజెంట్ గా మెస్సర్స్ చెట్టినాడ్ లాజిస్టిక్స్, ట్యూటికోరిన్ పనిచేసాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో విఓ చిదంబరనార్ పోర్ట్ ద్వారా జరుగుతున్న సరకుల రవాణాలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. 2021 జూలై వరకు పోర్ట్ 11.33 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేసింది. గత ఏడాది ఇదే కాలంలో సరుకుల రవాణా 10.58 మిలియన్ టన్నులుగా ఉంది. గత ఏడాదితో పోల్చి చూస్తే 7.14% వృద్ధి రేటు నమోదు అయ్యింది. చిదంబరనార్ పోర్ట్ కంటైనర్ రవాణాలో కూడా గణనీయమైన మెరుగుదల కనబరిచింది. పోర్ట్ ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై 2021 వరకు 2.69 లక్షల TEU లను నిర్వహించింది గత ఆర్థిక సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే 21.07 %వృద్ధిని నమోదు చేసింది.
***
(Release ID: 1750738)
Visitor Counter : 225