విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఆజాది కా అమృత్ మహోత్సవం కింద సెమినార్ నిర్వహించి అంబులెన్స్‌ని ఎన్జీఓకి అప్పగించిన దుల్హస్తి పవర్ స్టేషన్
Posted On:
30 AUG 2021 9:23AM by PIB Hyderabad
కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్, ఎన్‌హెచ్‌పిసి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఏకే సింగ్ దుల్హస్తి పవర్ స్టేషన్ నిర్వహించిన ఆజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. సిఎస్ఆర్ పథకం కింద అంబులెన్స్ అందజేశారు. దుల్హస్తి పవర్ స్టేషన్ ఆజాది కా అమృత్ మహోత్సవ్ కింద ఎన్‌హెచ్‌పిసి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ దేశానికి సేవ చేయడానికి ముందుకు రావాలని ప్రజలను ప్రోత్సహించారు. కిష్త్వార్ జిల్లాలో ఎన్‌హెచ్‌పిసి చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడారు రాబోయే కాలంలో, ఈ ప్రాజెక్టుల పూర్తితో కిష్త్వార్ విద్యుత్ ఉత్పత్తికి పవర్ హబ్‌గా మారబోతోందని అన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికులకు ఉపాధి లభిస్తుంది మరియు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎన్‌హెచ్‌పిసి చేస్తున్న పనిని ఆయన అభినందించారు.
ఎన్‌హెచ్‌పిసి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎ.కె. సింగ్, ఆజాది కా అమృత్ మహోత్సవం కింద చేపట్టే వివిధ కార్యక్రమాలు వివరించారు.సీఎస్ఆర్ పథకం ద్వారా స్థానిక స్థాయిలో ఎన్‌హెచ్‌పిసి అనేక సామాజిక అభివృద్ధి కార్యకలాపాలతో నిమగ్నమై ఉందని, నేడు వెంటిలేటర్, ఇతర ఆధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను స్వచ్ఛంద సంస్థ సేవా భారతికి అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు.
కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీ ఎకె సింగ్ సేవా భారతి నిర్వాహకులకు అంబులెన్స్ తాళం చెవులను అందజేశారు.
జమ్మూ-కశ్మీర్ సేవా భారతి, అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ మన్హాస్,సిఎస్ఆర్ పథకం కింద అంబులెన్స్ అందించినందుకు ఎన్‌హెచ్‌పిసికి కృతజ్ఞతలు తెలిపారు. కిష్త్వార్, పరిసర ప్రాంతాల పేద ప్రజలు అంబులెన్స్ సేవ ద్వారా ప్రయోజనం పొందుతారని, ఈ అంబులెన్స్ సేవ ప్రజలకు లాభాపేక్ష లేకుండా జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో, జాతీయ సమైక్యత, సేవా పని పాత్ర అనే అంశంపై సెమినార్, అంబులెన్స్ అప్పగించే కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీపిపిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎకె చౌదరి, ఎన్‌హెచ్‌పిసి జమ్మూ రీజనల్ హెడ్ శ్రీ రాజన్ కుమార్, ఎన్‌హెచ్‌పిసి, సీవీపిపిఎల్ అధికారులు, ఉద్యోగులు, సేవా భారతి అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1750533)
Visitor Counter : 138