సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం

Posted On: 30 AUG 2021 1:42PM by PIB Hyderabad

ఒకవైపు వైవిధ్యమైన ఉత్పత్తులను అందిస్తూమరోవైపు భారీ పరిశ్రమలకు మధ్యంతర వస్తువులను అందిస్తున్న సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ ) రంగం ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు భారతదేశంలో కూడా  వస్తు పంపిణీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఆర్థిక రంగానికి వెన్నుముకగా ఉన్నాయి. దేశంలో అత్యధిక మందికి ఎంఎస్ఎంఈ రంగం ఉపాధి అందిస్తున్నది.  

భారతదేశంలో 6.3 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈ లు పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో లావాదేవీలను నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలు భారీ అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన విడి భాగాలను సరఫరా చేస్తున్నాయి. దేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువుల్లో ఎక్కువ భాగం ఈ రంగంలో ఉత్పత్తి అవుతున్నాయి.   జౌళి, తోలు, తోలు వస్తువులు, ఔషధాలు,  ఆటోమోటివ్రత్నాలు , ఆభరణాలు వంటి వివిధ రంగాల ద్వారా ఎగుమతి అవుతున్న వస్తువుల్లో 45 శాతం ఎంఎస్ఎంఈ రంగంలో ఉత్పత్తి అవుతున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా గణనీయమైన ప్రగతిని సాధిస్తున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ  భవిషత్తులో మరింత వృద్ధి రేటును నమోదు చేసి 2025 నాటికి అయిదు ట్రిలియన్ల అమెరికా డాలర్ల వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉంది. లక్ష్యాల మేరకు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సాధించడానికి అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధించవలసి  ఉంటుంది. 

ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ రంగం ప్రాధాన్యతను  గుర్తించిన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఈ రంగం మరింత అభివృద్ధి సాధించేలా చూడడానికి అనేక చర్యలను అమలు చేస్తోంది. ఎంఎస్ఎంఈ రంగంలో అమలవుతున్న ప్రధాన సంస్కరణలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

*  ఎంఎస్ఎంఈ  నిర్వచనంలో మార్పు:   దేశంలో  ఎంఎస్ఎంఈ   లను బలోపేతం చేయాలని నిర్ణయించిన భారత ప్రభుత్వం  జూన్ 2020 న ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద  ఎంఎస్ఎంఈ పరిధిని  పెంచడానికి ఆమోదం తెలిపింది.  పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ రెండింటిని పరిగణనలోకి తీసుకుంటూ  ప్రభుత్వం  ఎంఎస్ఎంఈ పరిధిని  సవరించింది.

* ఉద్యమ్ రిజిస్ట్రేషన్:   ఎటువంటి పత్రాలు, ఫీజు లేకుండా ఎంఎస్ఎంఈలు రిజిస్ట్రేషన్ పొందడానికి వీలు కల్పిస్తూ ఉద్యమ్ పేరుతో  ఆన్‌లైన్ మరియు సరళీకృత రిజిస్ట్రేషన్ విధానాన్ని మంత్రిత్వ శాఖ  అమలులోకి తెచ్చింది.  ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన ఈ  ప్రక్రియ సులభతర వ్యాపార నిర్వహణకు సహకరిస్తుంది.   యొక్క API ఇంటిగ్రేషన్‌ను కూడా జిఎమ్‌తో ప్రారంభించింది.  ప్రభుత్వ సేకరణలో ఎంఎస్‌ఇలు సులభంగా పాల్గొనడానికి ఎంఎస్ఎంఈలకు అవకాశం కల్పించడానికి ఉద్యమ్    రిజిస్ట్రేషన్ పోర్టల్ ను జెమ్ తో ఎంఎస్ఎంఈ   మంత్రిత్వ శాఖ అనుసంధానం చేసింది.   

* ఛాంపియన్స్ పోర్టల్: కష్ట సమయంలో ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఇలకు సహాయ సహకారాలను అందించడానికి  ఛాంపియన్స్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఐసిటి ఆధారిత టెక్నాలజీ వ్యవస్థ అయిన ఛాంపియన్స్  చిన్న యూనిట్‌ల సమస్యలను పరిష్కరించడంప్రోత్సహించడంసహకారం అందించి   వ్యాపార లావాదేవీలను పెంచి సంస్థలు అభివృద్ధి సాధించడానికి తోడ్పడుతుంది.   ఎంఎస్‌ఎంఇల అన్ని అవసరాలను సింగిల్ విండో విధానంలో ఇది పరిష్కరిస్తుంది.

* జాతీయ ఎస్టీ-ఎస్సీఈ వేదిక షెడ్యూలు కులాలుతెగలకు చెందిన వారు పరిశ్రమలను ప్రోత్సహించేలా చూడడానికి పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ఆర్డర్, 2018 లో పేర్కొన్న 4% సేకరణ లక్ష్యాన్ని నెరవేర్చడానికి  జాతీయ ఎస్టీ-ఎస్సీ  వేదిక   ప్రారంభించబడింది.  షెడ్యూలు కులాలుతెగలకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తున్న  మార్కెట్ లింకేజీఫైనాన్స్ సదుపాయాలుసామర్ధ్యం పెంపు మొదలైన అంశాలకు దీనిలో ప్రాధాన్యత కల్పిస్తారు. 

* స్వయం సమృద్ధ  భారతదేశం (SRI) నిధి: ఈ పథకం  ఎంఎస్‌ఎంఇ రంగానికి .50,000 కోట్ల రూపాయల  ఈక్విటీ ఫైనాన్సింగ్‌ను అందిస్తుంది.   వాటాలను జారీ చేసే ఎంఎస్‌ఎంఇలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో  జాబితాలో చేరడానికి అవకాశాన్ని అందిస్తుంది.  ఎంఎస్‌ఎంఇల  వ్యాపారాన్ని ఎక్కువ చేసి దాని ద్వారా  ఈ రంగంలో  మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఇది  సహాయపడుతుంది.

*  సేకరణ విధానం:  ఎంఎస్‌ఎంఇలకు మార్కెటింగ్ సహకారం  అందించడానికి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు/ప్రభుత్వ విభాగాలు మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ వార్షిక అవసరాలలో 25% వస్తువులు మరియు సేవల కోసం  ఎంఎస్‌ఎంఇ   ల నుండి 4% షెడ్యూలు కులాలు/తెగలకు చెందిన వారు నెలకొల్పిన ఎంఎస్‌ఎంఇల నుంచి, మహిళల నిర్వహణలో ఉన్న ఎంఎస్‌ఎంఇల నుంచి  3% MSE ల నుంచి  సేకరించాల్సి ఉంటుంది.  

*  ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ల ఏర్పాటు :  ఎంఎస్‌ఎంఇ  లకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట అందించే ఉద్దేశ్యంతో ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు పనిచేస్తున్నాయి.  ఇప్పటి వరకు  ఎంఎస్‌ఎంఇ   మంత్రిత్వ శాఖ భారతదేశ వ్యాప్తంగా 102  ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ సెంటర్‌   లను ఏర్పాటు చేసింది.  నిరంతర ప్రాతిపదికన గ్రామీణ సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే పనిచేస్తున్న, ఏర్పాటు కానున్న   ఎంఎస్‌ఎంఇ   లకు వృత్తిపరమైన సహాయ సహకారాలను   ఈ కేంద్రాలు అందిస్తాయి.

***(Release ID: 1750530) Visitor Counter : 476