యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
టోక్యో పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన - భావినా పటేల్
భారతదేశం టేబుల్ టెన్నిస్ లో మొట్టమొదటి పతకం సాధించింది
శ్రీ నరేంద్ర మోదీ మరియు భావినా పటేల్ కలిసి తీసుకున్న 2010 నాటి చిరస్మరణీయ ఫోటోను పంచుకున్న - శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
29 AUG 2021 5:54PM by PIB Hyderabad
ముఖ్యాంశం :
· ఆదివారం ఉదయం జౌ యింగ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత ప్రధానమంత్రి భావినా ను పిలిచి, రజత పతకం సాధించినందుకు ఆమెను అభినందించారు.
టోక్యో పారాలింపిక్స్ లో ఈ రోజు మహిళల సింగిల్స్ క్లాస్-4 టేబుల్ టెన్నిస్ పోటీల్లో, భారత తొలి రజత పతకాన్ని సాధించి భావినాబెన్ పటేల్ చరిత్ర సృష్టించారు. రజత పతకం గెలవడం, 2021 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశానికి ఇది ఒక చిరస్మరణీయ బహుమతి.
గతంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావినాతో పంచుకున్న కొన్ని ప్రతిష్టాత్మకమైన క్షణాలను, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భావినాతో పాటు ఆమె తోటి క్రీడాకారుడు సోనాల్‌బెన్ పటేల్‌ను అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సన్మానించిన 2010 నాటి ఫోటో ను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పంచుకున్నారు. "సోనాల్ మరియు భావినా 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడా పోటీలకు వెళ్తున్నారు. వారిని ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కలుసుకుని, ఉత్తమ ప్రదర్శన ఇవ్వమని ప్రోత్సహించారు," అని శ్రీ ఠాకూర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
"క్రీడా సంస్కృతిని నిర్మించడం, ప్రతి క్రీడకూ, ప్రతి క్రీడాకారునికీ మద్దతు ఇవ్వడం జీవితకాల ప్రయత్నం, ఇది నేటికీ కొనసాగుతోంది, దాని ఫలాలను అందిస్తోంది. క్రీడాకారుల ప్రధాన మంత్రి! " అని కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆదివారం ఉదయం జౌ యింగ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత ప్రధానమంత్రి భావినా ను పిలిచి, రజత పతకం సాధించినందుకు ఆమెను అభినందించారు.
34 ఏళ్ల భారతీయ పారా టేబుల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, క్లాస్-4 కేటగిరీ లో ప్రపంచ 12 వ ర్యాంక్ లో ఉన్న భావినా, ఫైనల్ లో పెద్ద పర్వతం వంటి యింగ్ పై పోటీ పడాల్సివచ్చింది. ఆమె ఇప్పుడు నాలుగు పారాలింపిక్ గేమ్స్ నుండి ఆరు బంగారు పతకాలు సాధించిన ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి చేతిలో 0-3 పాయింట్ల తేడాతో పరాజయం పాలయ్యింది. భావినా తన ప్రారంభ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో కూడా చైనా క్రీడాకారులతో పోటీ పడింది. ఏదేమైనా, ప్రీ-క్వార్టర్స్ దశ నుండే ఆమె అనుభవించిన వైఫల్యాలు మొత్తం గమనించదగినవి.
భావినా తన తొలి పారాలింపిక్ క్రీడల్లో ఆడుతూ, తన ఉన్నత స్థాయి ప్రత్యర్థి అయిన బ్రెజిల్ కు చెందిన జాయ్స్ డి ఒలివెరా పై, 16 వ రౌండ్ మ్యాచ్ లో వరుస గేమ్ లలో 3-0 పాయింట్లతో గెలిచింది. క్వార్టర్ ఫైనల్స్ లో భావినా ప్రత్యర్థి సెర్బియాకు చెందిన బోరిస్లావా పెరిక్, 2016 రియో పారాలింపిక్స్ లో స్వర్ణంతో పాటు రజత పతక విజేత గా నిలిచింది. ఆమె పై, ఈ భారతీయ క్రీడాకారిణి, 3-0 పాయింట్ల ఆధిపత్యంతో, విజయం సాధించింది. సెమీ ఫైనల్స్ లో, 2012 పారాలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత, 2016 పారాలింపిక్స్ రజత పతక విజేత జాంగ్ మియావో ను, భావినా 3-2 పాయింట్ల తేడాతో ఓడించింది.
అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడానికి వీలుగా, టి.టి. టేబుల్, 2.85 లక్షల విలువైన టి.టి. రోబో 'బటర్‌ఫ్లై - అమికస్ ప్రైమ్' తో పాటు 2.74 లక్షల రూపాయల విలువ చేసే ఒట్టోబాక్ చక్రాల కుర్చీ వంటి వివిధ సౌకర్యాలతో భారత ప్రభుత్వం భావినా కు సాధ్యమైనంత ఉత్తమమైన మద్దతును అందించింది.
*****
(Release ID: 1750289)
Visitor Counter : 222