గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బెంగళూరు మెట్రో ప్రాజెక్టు రెండవ దశలో వెస్టర్న్ ఎక్స్టెన్షన్‌ను ప్రారంభించిన హర్దీప్ సింగ్ పురీ
ప్రధానమంత్రి దార్శినిక నాయకత్వం కింద గత 7 సంవత్సరాలలో పట్టణీకరణ పట్ల మా విధానంలో రూపావళి మార్పు
Posted On:
29 AUG 2021 3:39PM by PIB Hyderabad
బెంగళూరు నమ్మ మెట్రో పథకం రెండవ దశలో భాగంగా మైసూరు నుంచి కెంగెరీ మెట్రో స్టేషన్ వరకు 7.5 కిమీల పొడవున వేసిన వెస్టర్న్ ఎక్స్టెన్షన్ మెట్రోలైన్‌ను కేంద్ర హౌజింగ్ & అర్బన్ వ్యవహారాలు, పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురీ కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ సమక్షంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, అప్లైడ్ సైన్సెస్ పరిశోధనలకు సంబంధించిన బలమైన ఉనికి దేశపు ఆర్థిక వృద్ధికి బెంగళూరు ప్రధాన సాధనమని, కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. దేశం నుంచి చేసే మొత్తం ఐటి ఎగుమతులలో ఈ నగరం 38% వాటాను కలిగి ఉంది. ఈ వెస్టర్న్ ఎక్స్టెన్షన్ మెట్రోలైన్‌ను నేడు ప్రారంభించడం అన్నది నగరంలో త్వరిత గతిన ప్రయాణించడానికి, చురుకుగా గతిశీలతను కలిగి ఉండే దిశగా వేసిన అడుగు అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వం కింద, నగరీకరణ దిశగా విధాన రూపావళిలో మార్పు వచ్చిందని, పౌరులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
దేశంలో మెట్రో రైలు ఏర్పాటులో పురోగతిని విస్తారంగా చెప్తూ, బెంగళూరు మెట్రో కార్యాచరణ సమయ పాలన 99.8%గా ఉందన్నారు. దేశంలోని మెట్రో నెట్‌వర్క్‌లలో ఉత్తమమైన వాటిలో ఇది ఒకటి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 2002లో తొలి మెట్రో లైన్‌ను ప్రారంభించగా, నేడు 18 భిన్న నగరాలలో 730 కిమీల మెట్రోలైన్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. వివిధ నగరాలలో 1049 కిమీల మెట్రోరైలు / ఆర్ ఆర్‌టిఎస్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.
అన్నిరకాలుగా సహకారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శనం, మద్దతుతో నూతన పట్టణ కేంద్రాలను నిర్మించడంలో ఎదురయ్యే సవాళ్ళను రాష్ట్రం అధిగమించగలుగుతుందని రాష్ట్రం విశ్వసిస్తోందని కర్నాటక ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రారంభించిన మెట్రోలైన్ వివరాలు
ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న 18.1 కిమీల పర్పుల్ గ్రీన్ (తూర్పు-పశ్చిమ) లైనుకు పశ్చిమంగా కొనన 7.5 కిమీల పొడవైన ఎలివేటెడ్ మెట్రోను పొడిగించారు. కార్యకలాపాలు సాగించే లైనులో మైసూరు రోడ్ మెట్రో స్టేషన్ ఆవల వెస్టర్న్ ఎక్స్టెన్షన్‌లో 6 కొత్త స్టేషన్లు - నాయనందనహళ్ళి, రాజరాజేశ్వరి నగర్, జ్ఞానభారతి, పత్తనగెరే, కెంగేరీ బస్ టెర్మినల్, కెంగేరీ మెట్రో స్టేషన్లు ఉన్నాయి.
కార్యకలాపాలు సాగిస్తున్న విస్తరణ మార్గంలోని మైసూర్ రోడ్ మెట్రో స్టేషన్ ఆవల 6 కొత్త స్టేషన్లు ఉన్నాయి. ఈ సెక్షన్‌ను (తూర్పు-పశ్చిమ) ప్రారంభించిన తర్వాత పర్పుల్ లైన్ మెట్రో కారిడార్ 23 స్టేషన్లతో 25.63 కిమీల పొడవు అవుతుంది. ఈ సెక్షన్‌లో నిర్మాణాన్ని ఫిబ్రవరి 2016లో ప్రారంభమైంది. నయందనహళ్ళి, రాజరాజేశ్వరి నగర్, జ్ఞాన భారతిలో పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటుగా చేయగా, కెంగేరీ బస్ టెర్మినల్ బస్ స్టేషన్‌లో రెండు స్థాయిలో పార్కింగ్‌ను నిర్మించారు.
ఈ విస్తరణ ఫలితంగా 2021లో ప్రయాణీకుల సంఖ్య 75,000కు పెరుగుతుందని అంచనా. ప్రతి స్టేషన్‌లోనూ ఎల్ఇడి లైట్లు, 8 ఎస్కలేర్లు, 4 ఎలివేటర్లను ఏర్పాటు చేశారు. దీనితో పాటుగా మార్చి 2022నాటికి ఇంటికప్పుపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
మొత్తం 6 స్టేషన్లలోనూ ఇంధన సమర్ధవంతమైన ఎల్ఇడి లైట్లను ఏర్పాటు చేశారు. అన్ని స్టేషన్లకూ నూతనంగా నిర్మించిన సర్వీస్ రోడ్డుకు ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు ఉన్నాయి. బస్ బేలు, టాక్సీలు, ఆటోలు ప్రయాణీకులను దింపేందుకు ప్రాంతాన్ని సర్వీసు రోడ్డులో కేటాయించారు. ఉచిత ప్రాంతంలో రోడ్లను దాటేందుకు స్టేషన్లను ప్రజలు ఉపయోగించుకోవచ్చు.
బయ్యప్పనహళ్ళి నుంచి కంగేరీకి ప్రయాణించేందుకు టికెట్టు ధర రూ.56/- కాగా, అత్యంత పొడవైన స్ట్రెచ్ అయిన కంగేరీ నుంచి సిల్క్ ఇనిస్టిట్యూట్ కు టికెట్ ధర రూ. 60/- బయ్యప్పనహళ్ళి నుంచి కంగేరికి ప్రయాణ సమయం 52 నిమిషాలు. కంగేరి నుంచి చల్లఘట్ట (2కిమీ)లకు తదుపరి విస్తరణ మార్చి 2022కి పూర్తి కానుంది.
***
(Release ID: 1750199)
Visitor Counter : 246