ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆధార్-పాన్/ఈపీఎఫ్ఓ అనుసంధాన సౌకర్యంలో ఎలాంటి అంతరాయాలు లేవుః యుఐడీఏఐ
Posted On:
28 AUG 2021 5:18PM by PIB Hyderabad
తమ సంస్థకు చెందిన సేవలన్నీ స్థిరంగా ఉన్నాయని, చక్కగా పనిచేస్తున్నాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యుఐడీఏఐ) ఈరోజు తెలిపింది. ప్రామాణీకరణ ఆధారిత సౌకర్యమైన ఆధార్-పాన్/ఈపీఎఫ్ఓ అనుసంధాన సౌకర్యంలో ఎలాంటి అంతరాయాలు లేవని యుఐడీఏఐ వెల్లడించింది. యుఐడీఏఐ గత వారం రోజులుగా తన సిస్టమ్స్‌లో అవసరమైన కొన్ని సెక్యూరిటీ అప్‌గ్రేడ్ ప్రక్రియను దశలవారీగా కొనసాగిస్తోంది. ఫలితంగా కొన్ని రకాల ఎన్‌రోల్‌మెంట్/అప్‌డేట్ సెంటర్లలో నమోదు, మొబైల్ అప్‌డేట్ సదుపాయంలో మాత్రం కొన్ని సేవాలలో అడపదడపా అంతరాయాలు ఏర్పడినట్టుగా వెలుగులోకి వచ్చింది. అప్‌గ్రేడేషన్ తర్వాత ఇప్పుడు వ్యవస్థ బాగా పనిచేస్తోంది. వ్యవస్థ స్థిరీకరించబడినప్పటికీ, నివాసితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేలా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు యుఐడీఏఐ తెలిపింది. 2021 ఆగస్టు 20న నవీకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి గత 9 రోజుల్లో 51 లక్షల మందికి పైగా నివాసితులు వివరాలను నమోదు చేసుకున్నట్టుగా సమాచారం. దీనిని బట్టి చూస్తే సగటున రోజుకు 5.68 లక్షల నమోదు ప్రక్రియలో పాలుపంచుకున్నారు. అయితే ప్రతిరోజూ సగటున 5.3 కోట్ల కంటే ఎక్కువ ప్రామాణీకరణ ధ్రువీకరణపు లావాదేవీలు జరుగుతున్నాయి. పాన్/ ఈపీఎఫ్ఓలతో ఆధార్‌ని అనుసంధానం చేయడంలో యుఐడీఏఐ వ్యవస్థలో పలు వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయని కొన్ని మీడియా నివేదికలపై యుఐడీఏఐ స్పందించింది. అలాంటి మీడియా కథనాలు కచ్చితమైనవి కావు అని తెలిపింది.
****
(Release ID: 1750015)
Visitor Counter : 219