బొగ్గు మంత్రిత్వ శాఖ
'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకలలో భాగంగా కోవిడ్-19 టీకా డ్రైవ్ నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన బీసీసీఎల్
Posted On:
28 AUG 2021 12:47PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకలలో భాగంగా కేంద్ర బొగ్గు
మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న కంపెనీ (కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ) అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) ప్రత్యేకంగా కోవిడ్-19 టీకా డ్రైవ్‌ను
నిర్వహించింది. ధన్‌బాద్ లోని జగ్జీవన్ నగర్‌లో గల అంబేద్కర్ స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ డ్రైవ్ పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చింది. ముఖ్యంగా బీసీసీఎల్‌కు చెందిన 250 మందికి కోవిషీల్డ్ మొదటి డోస్ టీకాను అందించారు.
కోవిడ్-19కు వ్యతిరేకంగా బీసీసీఎల్ చేస్తున్న పోరులో సఫాయికారులు వెన్నెముకగా నిలుస్తూ వస్తున్నారు. వారి అంకితభావం మరియు నిరంతర ప్రయత్నాలతో బీసీసీఎల్ తన కోవిడ్ -19 ఆసుపత్రులలో, క్వారెంటయిన్ కేంద్రాలు, కార్యాలయాలలో, గనులు మరియు కాలనీలలో నిరంతరంగా సేవలను అందించగలిగింది. వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదు తీసుకున్న వారికి హ్యాండ్ శానిటైజర్ బాటిల్, పునర్వినియోగానికి వీలుగా ఉండే కాటన్ ఫేస్‌మాస్క్‌లు ఉన్న ఎన్వలప్‌లు జారీ చేయడమైంది. ఈ సందర్భంగా మొత్తం 300 హ్యాండ్ శానిటైజర్‌లు మరియు ఫేస్ మాస్క్‌లు పంపిణీ చేయబడ్డాయి.
***
(Release ID: 1749973)
Visitor Counter : 189