మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

'ఆజాది కా అమృత్ మహోత్సవం'లో భాగంగా 2000 గ్రామస్థాయి అవగాహన శిబిరాల్ని నిర్వహించిన‌ పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ


- గ్రామీణ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను రూపొందించడంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహాయపడుతుంది:
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్శోత్తం రూపాల

- రైతులు, పారిశ్రామికవేత్తలతో సంభాషించి వారి విజయగాథ‌లను అభినందిస్తున్న శ్రీ రూపాల‌

- ఆజాది కా అమృత్ మహోత్సవంను భారతదేశ ప్రజలకు అంకితం చేసిన స‌హాయ‌క‌ మంత్రి శ్రీ ఎల్ మురుగన్

Posted On: 27 AUG 2021 4:00PM by PIB Hyderabad

'ఆజాది కా అమృత్ మహోత్సవం'లో భాగంగా కేంద్ర‌ పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ ఉమ్మడి సేవా కేంద్రం నెట్‌వర్క్ ద్వారా డిపార్ట్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2000 గ్రామ స్థాయి శిబిరాలు జరిగాయి. ఆయా ప‌థ‌కాల‌పై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటుగా సీఎస్‌సీ ద్వారా పథకం పోర్టల్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలో.. హాజరైన వారికి పూర్తి సమాచారం అందించబడింది. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ పరశోత్తం రూపాల శిబిరాల ద్వారా అనుసంధానించబడిన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కేంద్ర కేబినెట్ తీసుకున్న‌ నిర్ణయం ప్రకారం జాతీయ పశుసంబంధ మిషన్, రాష్ట్రీయ గోకుల్‌మిషన్ పథకాలు ఇక‌పైన ప‌శుపెంపకందారుల్ని పారిశ్రామికవేత్తలుగా మరియు పశుగ్రాస వ్యవస్థాపకులుగా తీర్చి దిద్దే అంశాల‌ను కలిగి ఉన్నాయని తెలియజేశారు. జాతీయ పశు మిషన్ (ఎన్ఎల్ఎం) గ్రామీణ పారిశ్రామికవేత్తలను సృష్టించడంలో మరియు పశువులు, పాడి, పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, పందులు, ఫీడ్ మరియు పశుగ్రాస రంగంలో నిరుద్యోగ యువతకు, పశుసంవర్ధక రైతులకు మెరుగైన జీవనోపాధి అవకాశాల‌ను కల్పించి ఆత్మనిర్భ‌ర్ భార‌త్ దిశ‌గా మ‌నదేశం అడుగులు వేసేలా ఎంతో సహాయపడుతుంది. అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ ఈ పథకాల్లో గ్రామీణ పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు మరియు పందుల పెంప‌కంతో పాటు ఫీడ్ మరియు పశుగ్రాస అభివృద్ధితో సహా వ్యవస్థాపకత అభివృద్ధి మరియు జాతి మెరుగుదలపై పదునైన దృష్టిని తీసుకువస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ గ్రామీణ పౌల్ట్రీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగం 1.5 లక్షల మంది రైతులకు ప్రత్యక్షంగా ఉపాధిని క‌ల్పిస్తుంది. 2 లక్షల మంది రైతులు నేరుగా గొర్రెలు మేకలు మరియు పౌల్ట్రీ అభివృద్ధి ద్వారా ప్రయోజనం పొందుతారు. 3.5 లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చే రిస్క్ మేనేజ్‌మెంట్ కింద 7.25 లక్షల అధిక దిగుబడినిచ్చే జంతువులు కవర్ చేయబడతాయి. పశుగ్రాస వ్యవస్థాపకుల ద్వారా దేశంలో పశుగ్రాసం మరియు పశుగ్రాసం విత్తనాల లభ్యత అనేక రెట్లు పెరుగుతుంద‌న్నారు. ఈ సభలో ప్రసంగించిన మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ స‌హాయ మంత్రి శ్రీ ఎల్. మురుగన్ మాట్లాడుతూ ఆజాది కా అమృత్ మహోత్సవం భారతదేశ ప్రజలకు అంకితం అని అన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ మెరుగైన ఉత్పత్తికి సహాయపడటమే కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుందని అన్నారు.
                                 

***



(Release ID: 1749757) Visitor Counter : 162