ఆయుష్
azadi ka amrit mahotsav

ప్రజల వద్దకు ఆయుష్ .. కలసి పనిచేయనున్న ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు


రేపు గువాహటి లో సమావేశం కానున్న ఈశాన్య రాష్ట్రాల ఆయుష్, ఆరోగ్య శాఖల మంత్రులు

Posted On: 27 AUG 2021 5:36PM by PIB Hyderabad

ఆయుష్ వైద్య విధానాన్ని ప్రజలకు చేరువలోకి తీసుకుని వెళ్ళడానికి కలిసి పనిచేయాలని ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు  నిర్ణయించాయి. ఆయుష్ వైద్య విధానం ద్వారా వ్యాధుల నివారణచికిత్సపునరావాస అంశాల ప్రయోజనాలను ప్రజలకు అందించడానికి సంఘటితంగా ఈ రాష్ట్రాలు పనిచేయనున్నాయి. ఆగస్టు 28వ తేదీన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశాన్య ప్రాంత రాష్ట్రాల ఆరోగ్యఆయుష్ శాఖల మంత్రులు పాల్గొనున్నారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎం. ముంజాపర మహేంద్రభాయ్ మరియు అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వాస్ శర్మతో సహా పలువురు ఇతర ప్రముఖులు సమావేశానికి హాజరవుతారు.  ఈ సమావేశం గౌహతిలో ఖానాపారా అస్సాం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ లో  జరుగుతుంది.

ఈశాన్య రాష్ట్రాల్లో లభిస్తున్న  సహజ వనరులు, అమలులో ఉన్న  సాంప్రదాయ పద్ధతులు  ఆయుష్ వైద్య విధానంలో కీలకంగా ఉంటాయి. దీని వల్ల ఈశాన్య ప్రాంతంలో ఆయుష్ వైద్య విధానాన్ని మరింత సమర్థంగా పటిష్టంగా అమలు చేయడానికి అవకాశం ఉందని గుర్తించారు. ఈ సమావేశంలో ఆయుష్ వైద్య విధానం ప్రయోజనాలు,వ్యాధుల నివారణచికిత్సపునరావాస అంశాలలో దీని ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఈ విధానాన్ని వారికి మరింత చేరువలోకి తీసుకుని వెళ్ళడానికి అనుసరించవలసిన కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందిస్తారు. కోవిడ్ నివారణచికిత్సలో ఆయుష్ ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. 

ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ఆయుష్ వైద్య విధానానికి ప్రాచుర్యం కల్పించడానికి అవసరమైన మౌలిక సౌకర్యాలను జాతీయ ఆయుష్ మిషన్ కింద కల్పించే అంశానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత ఇస్తోంది. 50 పడకల ఆయుష్ ఆసుపత్రులను నెలకొల్పడంతో పాటు,

పిహెచ్‌సిలుసిహెచ్‌సిలు మరియు జిల్లా ఆసుపత్రులు లాంటి ప్రజారోగ్య కేంద్రాల్లో ఆయుష్ వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకుని రావడానికి మంత్రిత్వ శాఖ సహకరిస్తున్నది. గతంలో మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతంలో ఔషధ మొక్కల సాగు విస్తీర్ణాన్ని ఎక్కువ చేయడానికి సహకారం అందించింది. 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆయుర్వేద మరియు హోమియోపతిక్ ఎడ్యుకేషన్‌గా షిల్లాంగ్‌లోని నార్త్-ఈస్టర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి పనిచేస్తోంది.అరుణాచల్ ప్రదేశ్ లోని పసిఘాట్ లో ఉన్న  నార్త్ ఈస్టర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్    పేరును  నార్త్ ఈస్టర్న్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మరియు ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ గా మార్చి తాగిన గుర్తింపును ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఆయుర్వేద విద్య మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండాకోవిడ్ -19 మహమ్మారి సమయంలో మానవ వనరుల తో  సహా అభివృద్ధి చెందిన ఇతర మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతంలోని ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్నాయి. 


(Release ID: 1749752) Visitor Counter : 129