ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

స్టాప్ టీబీ భాగస్వామ్య బోర్డు చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవ్య


2025 నాటికి టీబీ విముక్త భారత్ చూడాలన్న ప్రధాన మంత్రి స్వప్నానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటన

ఇంతవరకు చైర్ పర్సన్ గా ఉన్న డాక్టర్ హర్షవర్ధన్ సేవలకు కితాబు

Posted On: 26 AUG 2021 4:40PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవ్య స్టాప్ టిబి భాగస్వామ్య బోర్డు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
 

మంత్రి 2024 వరకు బాధ్యతను నిర్వర్తిస్తారు. 2022 నాటికి యుఎన్ టీబీ లక్ష్యాలను చేరుకోవడానికి స్టాప్ టీబీ భాగస్వామ్య సచివాలయం, భాగస్వాములు, టీబీ సమాజం ప్రయత్నాలకు అయన  నాయకత్వం వహిస్తారు. అంతిమంగా  2030 నాటికి టీబీ నిర్ములించాలనే లక్ష్యంగా మెయిలు రాళ్లను దాటే ప్రయత్నం చేస్తారు.  

ఈ సందర్భంగా శ్రీ మాండవీయమాట్లాడుతూ, "స్టాప్ టిబి పార్ట్‌నర్‌షిప్ బోర్డ్ కి నేతృత్వం వహించడం నేను గౌరవంగా భావిస్తాను. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఈ వినాశకరమైన వ్యాధిని అంతం చేయడానికి ప్రపంచ ప్రయత్నాలకు కట్టుబడి ఉన్నాను. స్టాప్ టిబితో పనిచేయడానికి ఆసక్తితో ఉన్నాను." అని అన్నారు. ఈ సందర్భంగా 2025 నాటికి దేశంలో టీబీని అంతం చేయాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

ఇప్పటి వరకు స్టాప్ టిబి బోర్డుకు నేతృత్వం వహించిన, మాజీ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ హర్ష వర్ధన్ మార్గదర్శకత్వంలో భాగస్వామ్యం తీసుకున్న కార్యక్రమాలను ప్రశంసించారు.

 కొత్తగా నియమితులైన బోర్డ్ ఉపాధ్యక్షుడు శ్రీ. ఆస్టిన్ అరింజ్ ఒబిఫునా, ఆఫ్రో గ్లోబల్ అలయన్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - ఇంతకు ముందు స్టాప్ టిబి పార్ట్‌నర్‌షిప్ బోర్డ్, డెవలపింగ్ కంట్రీ ఎన్‌జిఓలలో అతిపెద్ద నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు కూడా  స్టాప్ టిబి భాగస్వామ్యం స్వాగతం పలికింది. అయన 2022 జనవరి 1 నుండి మూడేళ్ల పాటు బోర్డ్ వైస్ చైర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. 

టీబీని తొలగించడానికి భారతదేశ ప్రయత్నాలను గుర్తించిన స్టాప్ టిబి భాగస్వామ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ లూసికా డిటియు, రాబోయే మూడు సంవత్సరాలలో సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో కొత్త నాయకత్వానికి ఉన్న అనుభవం, అభిరుచి కీలకమని చెప్పారు.

 

****



(Release ID: 1749475) Visitor Counter : 164