చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
పత్రికా ప్రకటన (న్యాయాధీశుల నియామకం)
Posted On:
26 AUG 2021 7:35PM by PIB Hyderabad
భారత రాజ్యాంగం ఆర్టికల్ 124లో ఉన్న క్లాజ్ (2) ద్వారా అందించబడిన విశేష అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్రపతి.. జస్టిస్‌లు (i) శ్రీ అభయ్ శ్రీనివాస్ ఒకా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, (ii) శ్రీ విక్రమ్ నాథ్, ప్రధాన న్యాయమూర్తి, గుజరాత్ హైకోర్టు, (iii) శ్రీ జితేంద్ర కుమార్ మహేశ్వరి, ప్రధాన న్యాయమూర్తి, సిక్కిం హైకోర్టు, (iv) కుమారి జస్టిస్ హిమ కోహ్లీ, ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ హైకోర్టు, (v) శ్రీమతి జస్టిస్ బెంగళూరు వెంకట రామయ్య నాగరత్న, న్యాయమూర్తి, కర్ణాటక హైకోర్టు (vi) శ్రీ చుడలైల్ థెవన్ రవి కుమార్, న్యాయమూర్తి, కేరళ హైకోర్టు, (vii) శ్రీ ఎం.ఎం. సుంద్రేశ్, న్యాయమూర్తి, మద్రాస్ హైకోర్టు (viii) మిస్ జస్టిస్ బేలా మాధుర్య త్రివేది, జడ్జి, గుజరాత్ హైకోర్టు,(ix) శ్రీ పమిడిఘంటం శ్రీ నరసింహ, అడ్వకేట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. ఈ నియమకాలను అనుసరించి సంబంధికులు తమతమ కార్యాలయాలలో బాధ్యతను స్వీకరించిన తేదీ నుండి సీనియారిటీ పరిగణనలోకి వస్తుందని రాష్ట్రపతి ఉత్తర్వులలో పేర్కొనడమైంది.
***
(Release ID: 1749365)
Visitor Counter : 168