ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

చివరిగా తీసుకున్న జీతంలో 30% కి పెరగనున్న బ్యాంకు ఉద్యోగుల కుటుంబ పెన్షన్


పిఎస్‌యు బ్యాంక్ ఉద్యోగుల ఎన్‌పిఎస్ కార్పస్‌కు బ్యాంకులు చెల్లించే మొత్తం 14% కి పెంపుదల

Posted On: 25 AUG 2021 5:20PM by PIB Hyderabad

బ్యాంకు ఉద్యోగుల కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి కుటుంబ పెన్షన్‌ను చివరిగా తీసుకున్న జీతంలో 30% కి పెంచాలన్న  భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిర్ణయంతో బ్యాంకు ఉద్యోగుల కుటుంబ పెన్షన్ 30,000 నుంచి 35,000 రూపాయల వరకు పెరుగుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు ముంబై లో పాల్గొన్న పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి శ్రీ పాండా  ప్రకటించారు. 

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణపై 2020 నవంబర్ 11 వ తేదీన ఉద్యోగుల సంఘాలతో ఐబీఏ కుదుర్చుకున్న ద్వైపాక్షిక పరిష్కారానికి కొనసాగింపుగా బ్యాంకు ఉద్యోగుల కుటుంబ పెన్షన్ ని పెంచాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపారని ఆయన చెప్పారు. 'ఇదివరకు ఈ పథకంలో పెన్షనర్ ఆ సమయంలో తీసుకున్న వేతనంలో 15, 20 మరియు 30 శాతం స్లాబ్‌లు ఉండేవి.  ఇది గరిష్టంగా రూ .9,284/-కి లోబడి ఉంటుంది.  ఇది చాలా తక్కువ మొత్తం. ఈ అంశంతో   ఆర్థిక మంత్రి శ్రీమతి  సీతారామన్ కూడా ఏకీభవించారు.  బ్యాంకు ఉద్యోగుల కుటుంబ సభ్యులు జీవించి నిలదొక్కుకోవడానికి తగిన మొత్తాన్ని పొందేలా సవరించాలని సూచించారు.' అని శ్రీ పాండే అన్నారు. 
ఎన్పీఎస్ కు  యాజమాన్యాలు ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తాన్ని 10% నుంచి 14% కి పెంచాలన్న  ప్రతిపాదనకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కుటుంబ పెన్షన్ పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. ఎన్పీఎస్ కి యాజమాన్యాలు చెల్లించే మొత్తాన్ని పెంచడం వల్ల ఎన్పీఎస్ కింద  బ్యాంకు ఉద్యోగులకు ఆర్థిక భద్రత పెరుగుతుంది.

తన రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును సమీక్షించి స్మార్ట్ బ్యాంకింగ్ కోసం రూపొందించిన EASE 4.0 సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

(EASE 4.0 ను ఆర్థిక మంత్రి ప్రారంభించిన వివరాల కోసం PIB Mumbai Release on Launch of EASE 4.0 చూడండి)

  

***



(Release ID: 1749067) Visitor Counter : 207