మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పాఠశాల విద్యలో మరిన్ని విజయాలను సాధించడానికి, మరింత మందిని చేర్చడానికి ఇన్నోవేషన్ -ఆధారిత వర్చువల్ పాఠశాలలు ఉపయోగపడతాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
"ప్రియా– -ది యాక్సెసిబిలిటీ వారియర్" బుక్లెట్ ద్వారా దివ్యాంగుల సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్న -కేంద్ర విద్యా మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్, వీరేంద్ర కుమార్.. ఎన్ఈపీ- 2020 ఒక ఏడాది కాలంలో సాధించిన విజయాలతో, కార్యక్రమాలతో కూడిన బుక్లెట్ను ఆవిష్కరించారు.
Posted On:
24 AUG 2021 4:18PM by PIB Hyderabad
కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ ‘వన్ ఇయర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ’ (ఎన్ఈపీ)– 2020 పేరుతో ఒక బుక్లెట్ను ఆవిష్కరించారు. ఒక ఏడాది కాలంలో ఎన్ఈపీ సాధించిన విజయాలతో, కార్యక్రమాలతో కూడిన పుస్తకం ఇది. దీక్షాలోని నిపుణ్భారత్ ఎఫ్ఎల్ఎన్ టూల్స్, వర్చువల్ స్కూల్ ఆఫ్ ఎన్ఐఓఎస్, ఎన్సీఆర్టీ ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ను విడుదల వంటి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఎన్సీఈఆర్టీ వికలాంగుల వ్యక్తుల సాధికారత విభాగం అభివృద్ధి చేసిన యాక్సెసిబిలిటీ బుక్లెట్నూ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రవిద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్ కూడా పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, లక్షలాది మంది యువత ఆశలను, ఆకాంక్షలను వాస్తవికతగా మార్చడానికి భారతదేశాన్ని స్వయం ఆధారితంగా మార్చడానికి ఎన్ఈపీ ఒక మార్గదర్శక తత్వమని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ జ్ఞాన కేంద్రంగా మార్చాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి సహకార సమాఖ్యవాదానికి ఎన్ఈపీ సూత్రీకరణ కూడా చక్కటి ఉదాహరణ అని ఆయన అన్నారు. ఎన్ఈపీ పురోగతిని తిరిగి పరిశీలించాక, విద్యార్థుల భవిష్యత్తు గురించి మరింత నమ్మకం కలిగిందని వివరించారు. విద్య అనేది కేవలం డిగ్రీలు పొందడానికి పోటీ మాత్రమే కాదని, వ్యక్తిత్వ నిర్మాణానికి, జాతి నిర్మాణానికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే ఒక మార్పిడి సాధనం అని ప్రధాన్ పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, దేశవ్యాప్తంగా గ్రామీణ పాఠశాలలకు ఇంటర్నెట్ చేరేలా చూడాలని మంత్రి స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన "ప్రియా– -ది యాక్సెసిబిలిటీ వారియర్" పుస్తకం, దివ్యాంగుల సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తుందని ప్రధాన్ అన్నారు. పిల్లలకు దివ్యాంగుల అవసరాల గురించి సులభంగా తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి బుక్లెట్‌ను సరళంగా, ఆసక్తికరంగా మార్చామని వివరించారు.
ఎన్ఐఓఎస్ వర్చువల్ స్కూల్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ పాఠశాల ‘‘ఒక కొత్త అభ్యాస నమూనా’’ అని సాంకేతికత ఆవిష్కరణలను ప్రభావితం చేయడం, మరింత మందికి విద్యను సులువుగా అందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. వర్చువల్, లైవ్ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్ ల్యాబ్‌ల ద్వారా అధునాతన డిజిటల్ లెర్నింగ్ వేదికలను తీసుకురాగల ఇలాంటి పాఠశాల దేశంలోనే మొదటిదని మంత్రి వివరించారు. ఎన్సీఆర్టీ ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ పిల్లల అభ్యాసంలో పురోగతిని సులువుగా అంచనా వేయడానికి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులను ఉపయోగపడుతుందని ప్రధాన్ చెప్పారు. ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌లో సిలబస్ లేదా పాఠ్యపుస్తకం నుండి నేర్చుకున్న ఫలితాలు, ముఖ్య అధ్యాయాలను సూచిస్తూ వారాల వారీగా ఆసక్తికరమైన, సంక్లిష్టభరిత కార్యకలాపాల ప్రణాళిక ఉంటుంది.
ఈ సందర్భంగా వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, సదుపాయాల పెంపు దివ్యాంగుల వృద్ధికి తలుపులు తెరుస్తుందని, తద్వారా, అందరికీ అందుబాటులో ఉండే వాతావరణాన్ని సృష్టించడం
సాధ్యపడుతుందని చెప్పారు. ఏదైనా విప్లవాత్మక మార్పును నడిపించడానికి ముఖ్యమైనది అవగాహన కల్పనేనని ఆయన అన్నారు. దివ్యాంగులకు ప్రాప్యతను ప్రోత్సహించడానికి ప్రభుత్వ నిబద్ధతే ఈ–-కామిక్ కమ్ యాక్టివిటీ బుక్ ‘ప్రియా- ది యాక్సెసిబిలిటీ వారియర్’ అభివృద్ధికి దారితీసిందని వివరించారు. పాఠశాల విద్య & అక్షరాస్యత ఉన్నత విద్యా శాఖ రెండింటినీ అందుబాటులో ఉంచగల విద్యా మౌలిక సదుపాయాలు కంటెంట్‌ను సృష్టించే పనిని మిషన్మోడ్లో చేపట్టాలని కుమార్ కోరారు. కొత్త జాతీయ విద్యా విధానంలో ‘‘అందరికీ విద్య’’ కీలకమైన అంశమని అన్నారు. భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మనమందరం మన పిల్లలతో కలిసి 'యాక్సెసిబిలిటీ వారియర్స్'గా పని చేద్దామని పిలుపునిచ్చారు. మన పౌరులందరికీ ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి సమ్మిళిత విద్యను సాకారం చేద్దామని హితబోధ చేశారు.
ఈ సందర్భంగా ప్రారంభించిన మరో ముఖ్యమైన కార్యక్రమం "ప్రియా– -ది యాక్సెసిబిలిటీ వారియర్", ఇది వికలాంగుల సాధికారత విభాగం (దివ్యాంగ్జన్). కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్య అక్షరాస్యత శాఖల సహకారం ఫలితంగా ఇది ఏర్పడింది. ప్రమాదానికి గురవడంతో కాలు దెబ్బతిని నడవలేని ప్రియా అనే అమ్మాయి ప్రపంచాన్ని చూసే విధానాన్ని వివరిస్తుంది. పాఠశాలలో ఆమె అన్ని కార్యకలాపాలలో ఎలా పాల్గొనగలిగింది.. ప్రాప్యత ప్రాముఖ్యతను ఎలా నేర్చుకుంది.. తదితర విషయాలను ఈ కథ వివరిస్తుంది. ప్రాప్యత యోధురాలిగానూ ఆమె ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ కామిక్ పుస్తకం భారతీయ సంకేత భాష (ఐఎస్ఎల్), వివరణాత్మక వీడియో రూపంలో కూడా అందుబాటులో ఉంది.
విద్యను ఏ విభజన లేకుండా నిరంతరాయంగా అందించాలని ‘‘ఎన్ఈపీ 2020’’ భావిస్తుంది. చదువును మరింత అనుభవపూర్వకంగా, సమగ్రంగా, వ్యక్తిత్వాన్ని, ప్రశ్నించే స్వభావాన్ని పెంచేలా, ఆవిష్కరణ -ఆధారితంగా ఉండేలా, చర్చలపై ఆసక్తి పెంచేలా దృష్టి పెడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా విద్య మరింత సంతోషకరంగా ఉండేలా చూస్తుంది. ఈ దృక్పథంతో, పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగాలు అన్ని స్థాయిలలో అనేక కార్యక్రమాలను చేపట్టాయి. చివరికి పాఠశాల విద్య రంగాన్ని మార్చగల 62 ప్రధాన మైలురాళ్లను సాధించింది.
ఇతర ప్రధాన విజయాలు: 2026–-27 నాటికి గ్రేడ్– 3 ముగిసే సమయానికి ప్రతి బిడ్డ చదవడం, వ్రాయడం, సంఖ్యాశాస్త్రంలో కావలసిన అభ్యాస సామర్థ్యాలను సాధించేలా ఒక దృష్టితో నిపుణ్భారత్ మిషన్ ప్రారంభించడం; సమగ్ర శిక్ష ప్రస్తుత పథకాన్ని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ ఫర్ ఎడ్యుకేషన్ (ఎస్డీజీ-4) కి అనుగుణంగా మార్చడం, ఎన్ఈపీ 2020 సమగ్రమైన, సమానమైన, నాణ్యమైన, సంపూర్ణ పాఠశాల విద్యను అందేలా చూడటం, విద్యా ప్రవేశ్– గ్రేడ్ I పిల్లల కోసం మూడు నెలల స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ తయారు చేయడం. నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ ( ఎన్డీఈఏఆర్) బ్లూ ప్రింట్ ను విద్యా పర్యావరణ వ్యవస్థను శక్తివంతం చేయడానికి ఉత్ప్రేరకపరచడానికి తయారు చేశారు. ఉపాధ్యాయుల బోధన నాణ్యతను మెరుగుపరచడం, విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంపై దృష్టి సారించడానికి నిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. అభ్యాసాన్ని మరింత ఆనందంగా అనుభవపూర్వకంగా చేయడానికి అసెస్‌మెంట్ సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఈ–-కంటెంట్ మొదలైన వాటి టీచింగ్-లెర్నింగ్ రిపోజిటరీ.. దీక్షను సృష్టించారు.
ఎఫ్ఎల్ఎన్ టూల్స్, వనరులు.. నిపుణ్భారత్ మార్గదర్శకాలను అమలు చేయడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉపాధ్యాయులకు సహాయపడటానికి మార్గనిర్దేశం చేయడానికి దీక్ష కింద అభివృద్ధి చేయబడిన ప్రత్యేక విభాగంలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇన్ఫోగ్రాఫిక్స్, అభ్యాస ఫలితాలపై వీడియో, టీచర్ల కోసం అసెస్‌మెంట్ టూల్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు డిపార్ట్‌మెంట్ అటానమస్ సంస్థల అధిపతులు, అన్ని రాష్ట్రాల పాఠశాల విద్యా విభాగాల సీనియర్ అధికారులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.
ఒక సంవత్సరం కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) పై బుక్‌లెట్ చూడటానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయండి: https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/upload_document/ఎన్ఈపీ_achievement.pdf
"ప్రియా– -ఆక్సెస్సిబిలిటీ వారియర్" అనే బుక్లెట్ చూడటానికి లింక్‌పై క్లిక్ చేయండి: https://ncert.nic.in/ComicFlipBookEnglish/mobile/
వర్చువల్ ఓపెన్ స్కూల్ వివరాలను చూడటానికి దిగువ క్లిక్ చేయండి: http://virtual.nios.ac.in/
***
(Release ID: 1748897)
Visitor Counter : 213