యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

పారాలింపిక్ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామన్న నమ్మకంతో భారత నీటి క్రీడాకారులు


ఈ ముగ్గురు క్రీడాకారులు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టిఓపిఎస్‌) లో భాగం

Posted On: 23 AUG 2021 5:49PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:
భారతదేశానికి చెందిన ముగ్గురు సభ్యుల వాటర్ స్పోర్ట్స్ ప్రతినిధి బృందంలో ఇద్దరు పురుష స్విమ్మర్లు మరియు ఒక మహిళా కానో స్ప్రింట్ అథ్లెట్ ఉన్నారు.
సుయాష్ జాదవ్‌కు ఇది అతని 2 వ పారాలింపిక్ గేమ్స్ కాగా..నిరంజన్ ముకుందన్ మరియు ప్రాచీ యాదవ్ మొదటిసారి టోక్యోలో అతిపెద్ద వేదిక వద్ద తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
విదేశీ ఎక్స్‌పోజర్ పరంగా సుయాష్‌కు భారత ప్రభుత్వం నుండి సహాయం అందించబడింది.
నిరంజన్ 60 కి పైగా అంతర్జాతీయ పతకాలను సాధించారు మరియు 50 పతకాల మార్కును దాటిన ఏకైక పారా స్విమ్మర్.
ప్రాచి యాదవ్ 26 పారాలింపిక్ గేమ్స్ పారా కానోయింగ్ పోటీలో ప్రవేశించిన మొదటి భారతీయురాలు.
 
ఇద్దరు పురుష స్విమ్మర్లు మరియు ఒక మహిళా కానో స్ప్రింట్ అథ్లెట్‌తో కూడిన భారతదేశానికి చెందిన ముగ్గురు సభ్యుల వాటర్ స్పోర్ట్స్ ప్రతినిధి బృందం టోక్యోలో జరిగే పారాలింపిక్ గేమ్స్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శనలను ప్రదర్శిస్తుందని ఆశిస్తున్నారు. సుయాష్ జాదవ్‌కు ఇది  2 వ పారాలింపిక్ గేమ్స్ కాగా, నిరంజన్ ముకుందన్ మరియు ప్రాచీ యాదవ్ మొదటిసారి టోక్యోలో అతిపెద్ద వేదిక వద్ద తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ ముగ్గురు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్‌) లో భాగం.

2018 జకార్తాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌ పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లై ఎస్ 7 (32.71 సెకన్లు) లో సుయాష్ జాదవ్ విజయం అతనికి టోక్యో పారాలింపిక్స్‌కి ప్రవేశాన్ని కల్పించింది. వాస్తవానికి పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఎస్‌ఎం7 (2: 51.39) లో అతని కాంస్య పతకం కూడా టోక్యో పారాలింపిక్స్‌లో ఈవెంట్‌లో అతనికి స్లాట్ సంపాదించింది.



                                                             

    చిత్రం: సుయాష్ జాదవ్

ఇప్పుడు మహారాష్ట్రలోని డైరెక్టరేట్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్‌ పూణేలో తన ఈత కోచ్ తపన్ పాణిగ్రాహి పర్యవేక్షణలో బాలేవాడి స్టేడియంలో సుయాష్ జాదవ్ శిక్షణ పొందుతున్నారు. అతనికి విదేశీ ఎక్స్‌పోజర్ పరంగా భారత ప్రభుత్వం నుండి సహాయం అందించబడింది. ఇందులో అతను ఐదు కంటే ఎక్కువ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నారు. అలాగే స్పోర్ట్స్ కిట్‌తో పాటు స్పోర్ట్స్ సైన్స్ మద్దతుతో జాతీయ కోచింగ్ క్యాంప్‌లలో పాల్గొన్నారు. 11 సంవత్సరాల వయస్సులో విద్యుదాఘాతానికి గురైన తరువాత సుయాష్ చేతులు తొలగించాల్సి వచ్చింది. 2016 పారాలింపిక్స్‌ అనంతరం 2018 ఇండోనేషియాలో  జరిగిన ఏసియాన్‌ పారా గేమ్స్‌లో సుయాస్‌ ఒక బంగారు, రెండు కాంస్యపతకాలను సాధించారు.2018లో ఏకలవ్య అవార్డును, 2020లో అర్జున అవార్డును సాధించారు.

సుయాష్ పాల్గొనున్న 200 మీటర్ల ఇండివిజువల్ మెడ్లీ  ఎస్‌ఎం 7 ఈవెంట్ ఆగస్టు 27 న జరగనుండగా, అతను సెప్టెంబర్ 3 న పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లై ఎస్‌7 ఈవెంట్‌లలో నిరంజన్ ముకుందన్‌తో కలిసి మళ్లీ పాల్గొంటారు. అతను జర్మనీలోని హైడెల్‌బర్గ్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ స్వర్ణాన్ని సాధించారు.

ఈ నెల ప్రారంభంలో 26 ఏళ్ల బ్యాంకర్ నిరంజన్‌కు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ఈ గేమ్స్‌లో స్థానాన్ని కేటాయించింది. నిరంజన్‌ 60 అంతర్జాతీయ పతకాలను సాధించారు మరియు 50 పతకాల మార్కును దాటిన ఏకైక పారా స్విమ్మర్. నిరంజన్ విదేశీ ఎక్స్‌పోజర్ ట్రిప్‌లతో పాటు స్పోర్ట్స్ సైన్స్ మద్దతుతో జాతీయ కోచింగ్ క్యాంపులలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం నుండి సహాయం పొందారు.

 

చిత్రం: నిరంజన్

స్పైనల్‌ బిఫిడా మరియు క్లబ్డ్ పాదాలతో జన్మించిన నిరంజన్ తన అమ్మమ్మను కోల్పోయిన కొన్ని నెలలకే కోవిడ్ -19 బారినపడ్డారు. ఈ క్రమంలో జాన్ క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో బెంగళూరులో శిక్షణ పొంది పారాలింపిక్స్‌లో తనదైన ముద్ర వేయడానికి ఆసక్తిగా ఉన్నాడు.

26 ఏళ్ల ప్రాచీ యాదవ్ పారాలింపిక్ గేమ్స్ పారా కానోయింగ్ పోటీలో ప్రవేశించిన మొదటి భారతీయురాలు. ఆమె సెప్టెంబర్ 2 న మహిళల విఎల్‌ 2 200 మీటర్ల హీట్స్‌లో పాల్గొంటారు. మరుసటి రోజు సెమీస్ మరియు ఫైనల్ షెడ్యూల్ చేయబడుతుంది. మే 2019 లో పోలాండ్, పోజ్నాన్‌లో జరిగిన ఐసిఎఫ్‌ పారా కానో వరల్డ్ కప్‌లో ఆమె అంతర్జాతీయ అరంగేట్రంలో మొదటి రౌండ్ మరియు సెమీ ఫైనల్ దాటిన తర్వాత ఆమె ఎనిమిదవ స్థానంలో నిలిచారు. తరువాత 2019 ఆగస్టులో హంగేరీలోని స్జెగ్డ్‌లో జరిగిన ఐసిఎఫ్‌ పారా కానో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె సెమీఫైనల్లోకి ప్రవేశించారు.

 

చిత్రం: ప్రాచీ యాదవ్

నడుము క్రింద శారీరకలోపం కలిగిన ప్రాచి భోపాల్‌లోని లోవ్ సరస్సులో మయాంక్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రాచి శిక్షణ పొందారు.  అంతర్జాతీయ పోటీలు మరియు జాతీయ కోచింగ్ క్యాంపులతో పాటు క్రీడా సైన్స్ సపోర్ట్ మరియు కిట్‌లతో పాటు భారత ప్రభుత్వం నుండి కీలక మద్దతును ఆమె పొందారు.


 

 

****



(Release ID: 1748399) Visitor Counter : 142