ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పరస్పర సోదర భావనతో నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – ఉపరాష్ట్రపతి


• కర్ణాటక రాజ్ భవన్ లో ఉపరాష్ట్రపతి రక్షాబంధన్ వేడుకలు

• ఉపరాష్ట్రపతికి రాఖీలు కట్టిన చిన్నారులు

प्रविष्टि तिथि: 22 AUG 2021 6:05PM by PIB Hyderabad

పరస్పర సోదర భావనతో నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన, బెంగళూరు రాజ్ భవన్ లో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. నగరంలోని పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు ఉపరాష్ట్రపతికి రాఖీలు కట్టి, అనంతరం రక్ష తిలకాన్ని దిద్దారు. వారందరికీ ఆయన రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఉపరాష్ట్రపతి, వసుధైవ కుటుంబ భావనను భారతదేశం బలంగా నమ్మిందని, ఇదే భావనను జీవితానికి అన్వయించుకుని దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. రక్తం పంచుకుని పుట్టిన వారు మాత్రమే సోదరులు, సోదరిమణులు కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరినీ సోదర భావనతో చూసే వ్యక్తిత్వాన్ని యువత పెంపొందించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఈ భావన ద్వారా సమాజంలో అక్కడక్కడా నెలకొన్న వివక్షను పారద్రోలి, ఆత్మనిర్భర భారత నిర్మాణంలో యువత భాగస్వామ్యం వహించాలని సూచించారు.

***

*****

MS/RK/DP


(रिलीज़ आईडी: 1748083) आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Kannada