విద్యుత్తు మంత్రిత్వ శాఖ
డిస్కమ్‌లు 2021 ఆర్థిక సంవత్సరంలో 90,000 కోట్ల రూపాయల మేరకు నష్టాన్ని చవి చూసాయంటూ వస్తున్న వార్తలు ఊహాజనితమైనవి.. విద్యుత్ మంత్రిత్వ శాఖ
ఐసిఆర్ఏ అంచనాల కంటే 2020 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించిన తరువాత నష్టాలు సగం వరకు తగ్గి ప్రతికూలత 60,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఉంది
2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక వాణిజ్య కొరత నష్టాలు 23.5% నుంచి 21.83%ని తగ్గాయి
డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడడంతో అవి లాభాల బాట పడుతున్నాయి.
Posted On:
18 AUG 2021 12:51PM by PIB Hyderabad
విద్యుత్ పంపిణీ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే సరఫరా రంగం పని తీరు సక్రమంగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, పంపిణీ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు డిస్కమ్‌లు అమలు చేస్తున్న చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వడంతో డిస్కమ్‌ల పనితీరులో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా డిస్కమ్‌ల పనితీరుతో ఆర్థిక వ్యవహారాల్లో మెరుగుదల కనిపించిందని డిస్కమ్‌లు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై నిర్వహించిన ఆడిట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి;
* డిస్కమ్‌ల సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 23.5%గా ఉన్నాయి. ఇది 2019-20 ఆర్థిక సంవత్సరంలో 21.83%కి తగ్గింది.
* సగటు సరఫరా వ్యయం, సగటు ఆదాయం మధ్య 2016-17 ఆర్థిక సంవత్సరంలో 0.33/ కెడబ్ల్యు రూపాయలుగా ఉన్న వ్యత్యాసం 2019-20లో 0.28/ కెడబ్ల్యు రూపాయలకు తగ్గింది.
* పన్ను చెల్లించిన తరువాత లాభాలు రావడం లేదు. అయితే, నష్టాల మొత్తం తగ్గుతూ వస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 33,894 కోట్ల రూపాయలుగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తం 32,898 కోట్ల రూపాయలకు తగ్గింది.
2021 ఆర్థిక సంవత్సరంలో డిస్కమ్‌లు 90,000 కోట్ల రూపాయల వరకు నష్టాలను చవి చూసాయంటూ ఇటీవల కొన్ని వార్తలు వెలువడ్డాయి. 2021 మార్చిలో విద్యుత్ పంపిణీ రంగంపై ఐసీఆర్ఏ విడుదల చేసిన ఒక నివేదికను ఆధారంగా చేసుకుని ఈ వార్తలు వెలువడినట్టు కనిపిస్తోంది. ఈ నివేదికలో 2019 ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల పన్ను 50,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొంది. (ఇది పీఎఫ్సీ వార్షిక యుటిలిటీస్ నివేదికకు అనుగుణంగా ఉంటుంది). పన్ను చెల్లించిన తరువాత ఆర్జించిన లాభాలు ప్రతికూలతతో( నష్టాలు) 2020 ఆర్థిక సంవత్సరంలో 60,000 కోట్ల రూపాయల వరకు ఉంటాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ అంకెలను ఆధారంగా చేసుకొని డిస్కమ్‌లకు 90,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని వార్తలను ప్రచురించారు. కోవిడ్ తో విధించిన లాక్ డౌన్ వల్ల విద్యుత్ అమ్మకాలు 2020-21లో తగ్గాయని దీనితో డిస్కమ్‌లు భారీ నష్టాలను చవిచూశాయని పేర్కొన్నారు.
డిస్కమ్‌ల నుంచి విద్యుత్ కొనుగోలు చేసినవారు 2020 మార్చి నుంచి డిసెంబర్ వరకు 30,000 కోట్ల రూపాయల వరకు బకాయి పడ్డారు. నగదు చెల్లింపు అంశమైన దీనిని నివేదికలో నష్టాలుగా చూపించి 2020 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2021 ఆర్థిక సంవత్సరంలో డిస్కమ్‌ల నష్టాలు పెరుగుతాయని అంచనా వేసి ఉండవచ్చును.
అయితే, వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఐసీఆర్ఏ అంచనా వేసిన దానికన్నా తక్కువగా పన్ను చెల్లించిన తరువాత ఆర్జించిన ఆదాయం వుంది. ఐసీఆర్ఏ ఇది 60,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేసింది. అయితే, వాస్తవంగా ఇది అంచనాలో సగం వరకు మాత్రమే వుంది. దీనినిబట్టి చూస్తే ఐసీఆర్ఏ 2020 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన నివేదిక సహేతుకంగా లేదని తెలుస్తోంది. వాస్తవ విరుద్ధంగా ఉన్నఅంచనాలతో ఐసీఆర్ఏ రూపొందించిన నివేదికలో 2020 ఆర్థిక సంవత్సర నష్టాలకు అదనంగా 30,000 కోట్ల రూపాయలను కలిపి విడుదల చేశారు. కోవిడ్ వల్ల వాటిల్లిన నష్టాలుగా పేర్కొన్న ఈ నష్టాలకు సంబంధించి ఐసీఆర్ఏ తన నివేదికలో ఎటువంటి వివరణ పొందుపరచలేదు.
తప్పుల తడకగా రూపొందిన ఐసీఆర్ఏ నివేదికలో నష్టాలను 90,000 కోట్ల రూపాయలుగా చూపించారు. ఈ నివేదిక ఆధారంగా వార్తలను ప్రచురించిన సంస్థలు ప్రస్తుత విద్యుత్ టారిఫ్ నిర్ధారణ నియంత్రణ వ్యవస్థ కింద ట్రూ-అప్ యంత్రాంగం ఇప్పటికే ఉందనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కోవిడ్ వల్ల విధించిన లాక్‌డౌన్‌లతో వినియోగదారుల కేటగిరీల విధానాలలో వచ్చే మార్పులను తరువాతి సంవత్సరంలో సుంకాల ద్వారా వసూలు చేయబడుతుంది. ఐసీఆర్ఏ కూడా తన నివేదికలో ఈ అంశాన్ని సూచించింది, అయితే, ఈ సూక్ష్మమైన అంశం మీడియా నివేదికలలో ప్రతిబింబించలేదు.
ఇప్పటికే డిస్కమ్‌లపనితీరు గణనీయంగా మెరుగుపడింది. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల డిస్కమ్‌లు నష్టాల నుంచి బయటపడుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల డిస్కమ్‌ల పనితీరు మరింత మెరుగుపడి ఆర్థికంగా బలపడడానికి సిద్ధం అవుతున్నాయి.
డిస్కమ్‌ల పని తీరును మెరుగు పరచి ఆర్థికంగా అవి బలపడడానికి దోహదపడే అనేక చర్యలను అమలు చేస్తున్నది. నగదు కష్టాల నుంచి డిస్కమ్‌లను రక్షించడానికి ప్రభుత్వం ప్రభుత్వం లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ పథకాన్ని ప్రారంభించింది. సంస్కరణలతో ముడిపడి ఉన్న పథకం కింద డిస్కామ్‌లు ఇప్పటికే ప్రయోజనాలను పొందుతున్నాయి. విద్యుత్ రంగ సంస్కరణలకు సంబంధించిన 0.5% అదనపు రుణాలను 2022 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు లింక్ చేయడం ద్వారా ప్రభుత్వం డిస్కామ్‌ల పని తీరు మెరుగు పరచడానికి , సంస్కరణలను అమలు చేయడానికి ప్రోత్సాహాలను అందిస్తోంది. దీనితో పాటు, మౌలిక సదుపాయాలను కల్పించి సంస్కరణలను అమలు చేసి డిస్కామ్‌ల పనితీరును మెరుగు పరచి , ఆర్థిక పురోగతిని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంస్కరణల ఆధారిత ఫలితాలతో ముడిపడిన ప్రోత్సహకాలను అందిస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు అమలులో ఉండే ఈ పథకం కింద వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్‌లో చేరేలా చూడడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికే 10 కోట్ల స్మార్ట్ మీటర్లను అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమర్చడం జరిగింది. 2023 డిసెంబర్ నాటికి 15%కన్నా తక్కువుగా సాంకేతిక వాణిజ్య నష్టాలు ఉన్న అన్ని అమృత్ నగరాలు, అన్ని పారిశ్రామిక మరియు వాణిజ్య సంస్థలు, బ్లాక్ స్థాయిలో మరియు పైన ఉన్న అన్నిప్రభుత్వ కార్యాలయాలు,నష్టాలు ఎక్కువగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో స్మార్ట్ మీటర్లను అమర్చాలని లక్ష్యం గా నిర్ణయించుకోవడం జరిగింది.
***
(Release ID: 1747148)
Visitor Counter : 199