బొగ్గు మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆగస్టు 19, 2021 నుంచి ‘వృక్షారోపణ్ అభియాన్’ను ప్రారంభిస్తున్న బొగ్గు మంత్రిత్వశాఖ
బొగ్గు క్షేత్రాల లోపల, చుట్టుపక్కల పచ్చదనాన్ని పెంచడం ద్వారా మైనింగ్ కార్యకలాపాల్లో పర్యావరణ సమతుల్యత దిశగా తీసుకుంటున్న ముఖ్యమైన నిర్ణయం
प्रविष्टि तिथि:
17 AUG 2021 2:39PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన బొగ్గు/లిగ్నైట్ పీఎస్యూలు ఈ సంవత్సరం ‘గో గ్రీనింగ్’ డ్రైవ్ కార్యక్రమంలోభాగంగా 2వేల 385 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కల పెంపకాన్ని చేపట్టాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించాయి. కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. బొగ్గు, గనులు, రైల్వేశాఖల సహాయ మంత్రి రావుసాహెబ్ దన్వే సమక్షంలో ‘వృక్షారోపణ్ అభియాన్ 2021’ను ఆగస్టు 19వ తేదీన ప్రారంభించడం ద్వారా ‘గో గ్రీనింగ్’ డ్రైవ్కు తగిన ప్రేరణ కల్పిస్తారు. ఆగస్టు 19వ తేదీన ‘వృక్షారోపణ్ అభియాన్’లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 300 బొగ్గుక్షేత్రాల్లో, చుట్టుపక్కల ‘గో గ్రీనింగ్’ డ్రైవ్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు.
అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లోభాగంగా నిర్వహిస్తున్న ఈ ‘వృక్షారోపణ్ అభియాన్ 2021’ మైనింగ్ కార్యకలాపాల్లో తప్పనిసరిగా పర్యావరణ సమతుల్యతను తీసుకువస్తుంది. ఇది రాబోయే రోజుట్లో మరిన్ని బొగ్గు గనులు సామాజిక, పర్యావరణ అనుమతులు పొందడానికి సహాయపడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మరింత మంది మైనింగ్ కార్యకలాపాల్లో పాల్గొనేలా బొగ్గుగనులు ప్రారంభించడానికి సహకరిస్తుంది. అంతేకాకుండా సమాజంలోని సామాన్య ప్రజల్లో కూడా అటవీకరణపై అవగాహన కల్పించి, పచ్చదనాన్ని పెంచేలా ప్రేరణ కలిగించడమే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రెండు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇంధన రంగాన్ని కర్బనరహితం చేయడం ఒకటి కాగా.. పెరుగుతున్న ఇంధన డిమాండ్తీర్చడం రెండోది. ఇంధన డిమాండ్ తీర్చడం దేశీయంగా అందుబాటులో ఉన్న బొగ్గు లభ్యతపైనే ఆధారపడి ఉంది. అందువల్ల మన బొగ్గురంగం దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో కీలక పాత్రను పోషించడం ద్వారా అభివృద్ధి అంచనాలను అందుకోవడంలో సహకరిస్తుంది. అదేసమయంలో పర్యావరణం, సమాజంపల్ల బాధ్యతగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని బొగ్గురంగం సమతుల్యమైన మైనింగ్ను ప్రోత్సహించడానికి అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది.
మైనింగ్ ప్రాంతాలలో, చుట్టుపక్కల "గో గ్రీనింగ్" డ్రైవ్ అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మారనుంది. తద్వారా స్థానిక పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా వాతావరణ మార్పులకు కారణాలను తగ్గించడానికి మరింత కర్బన పదార్థాలను గ్రహించే వ్యవస్థను సృష్టించినట్లువుతుంది. అంతేకాకుండా మా బొగ్గు కంపెనీలు విస్తృతంగా చెట్ల పెంపకాన్ని చేపట్టడం, స్వచ్ఛమైన బొగ్గు సాంకేతికతలను అమలుచేయడం వంటి పర్యావరణ అనుకూల చర్యల ద్వారా కార్బన్ తటస్థతను సాధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయి.
***
(रिलीज़ आईडी: 1746787)
आगंतुक पटल : 377