మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని జరుపుకొంటున్న అమృత్ మహోత్సవాల్లోభాగంగా దేశవ్యాప్తంగా 75 ‘హునార్ హాత్’లను నిర్వహిస్తున్నారు:ముక్తార్ అబ్బాస్ నఖ్వీ


దేశవ్యాప్తంగా వక్ఫ్ భూముల్లో 75 ‘అమృత్ మహోత్సవ్ పార్కులు’ నిర్మిస్తారు.

Posted On: 16 AUG 2021 2:58PM by PIB Hyderabad

భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకొంటున్న అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 75 హునార్ హాత్లను నిర్వహిస్తున్నారు. ఈ హస్తకళా ప్రదర్శనల ద్వారా 7లక్షల 50వేల మంది కళాకారులకు ఉపాధితోపాటు ఉపాధి అవకాశాలను కల్పించాలని కేంద్ర మైనార్టీ మంత్రిత్వశాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.

వక్ఫ్ తరఖ్ఖియాతీ స్కీమ్, ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం(పీఎంజీవీకే) కింద కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వక్ఫ్ భూముల్లో 75 అమృత్ మహోత్సవ్ పార్కులు నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి నఖ్వీ తెలిపారు.

  దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల చేతివృత్తులవారు, హస్తకళాకారులు తయారుచేసిన దేశీయ ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించే సంకల్పంతో ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదంతో దేశవ్యాప్తంగా 75 హునార్ హాత్లను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.  "హునార్ హాత్" లో సాంప్రదాయ వంట నిపుణుల విభాగం "బావర్చిఖానా" కూడా ఉంటుందని,  ఇక్కడ ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ రుచులను,  వంటకాలను ఆస్వాధిస్తారని, అంతేకాకుండా ‘హునార్ హాత్’ లో ప్రతి సాయంత్రం దేశంలోని ప్రముఖ కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించబడతాయని మంత్రి తెలిపారు.

అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా 2023 వరకు దేశవ్యాప్తంగా  ‘మేరా వతన్, మేరా చమన్’ పేరుతో ముషైరాలు, కవిసమ్మేళనాలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాల్లో ప్రముఖ కవులతోపాటు వర్ధమాన కవులు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ యొక్క ప్రభావవంతమైన, దేశభక్తి సందేశాన్ని ఇస్తారని  మంత్రి తెలిపారు.

దేశవ్యాప్తంగా 75 "అమృత్ మహోత్సవ్ పార్కుల" నిర్మాణం కోసం దేశంలోని వివిధ వక్ఫ్ బోర్డులు భూమిని ఇస్తున్నట్లు  నఖ్వీ చెప్పారు. ఈ "అమృత్ మహోత్సవ్ పార్కులు" స్వాతంత్య్ర పోరాటంలో నిర్దిష్ట ప్రాంతం పోషించిన పాత్ర యొక్క చరిత్రను కళాత్మక పద్ధతిలో చాటిచెబుతాయన్నారు. ఈ పార్కుల్లో యోగా, వ్యాయామం, నడక, పిల్లలకు ఆట స్థలం, పచ్చని ప్రాంతం, సాధారణ సేవా కేంద్రం కూడా ఉంటాయని మంత్రి నఖ్వీ తెలిపారు.

***

 



(Release ID: 1746577) Visitor Counter : 242