రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఫ్లైయింగ్ (పైలట్) వింగ్ కమాండర్ వరుణ్ సింగ్‌కు శౌర్య చక్ర ప్ర‌దానం

Posted On: 15 AUG 2021 9:00AM by PIB Hyderabad

లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) స్క్వాడ్రన్‌లో వింగ్ కమాండర్ వరుణ్ సింగ్ (27987) ఒక విమాన చోద‌కుడు. వింగ్ కమాండర్ వరుణ్ సింగ్, 12 అక్టోబర్ 2020వ తేదీన‌ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ (ఎఫ్‌సీఎస్‌) మరియు ప్రెషరైజేషన్ సిస్టమ్ (లైఫ్ సపోర్ట్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్) యొక్క ప్రధాన దిద్దుబాటు తర్వాత పేరెంట్ బేస్ నుండి దూరంగా ఎల్‌సీఏలో సిస్టమ్ చెక్ సోర్టీన‌ ఎగురుతున్నాడు. సోర్టీ సమయంలో, కాక్‌పిట్ ఒత్తిడి అధిక ఎత్తున వెళ్లి విఫలమైంది. ఈ స‌మ‌యంలో ఆయ‌న వైఫల్యాన్ని సరిగ్గా గుర్తించాడు ఏమాత్రం బెర‌వ‌కుండా ల్యాండింగ్ కోసం తక్కువ ఎత్తుకు దిగడాన్ని ప్రారంభించాడు. దిగేటప్పుడు, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ విఫలమైంది మరియు విమానం మొత్తం నియంత్రణ కోల్పోయింది. ఇది ఎన్నడూ జరగని అనూహ్య‌మైన విపత్తు వైఫల్యం. సాధారణ స్థాయికి చేరుతున్నప్పుడు ఎత్తు వేగంగా కోల్పోయింది, విమానం పైకి క్రిందికి దూసుకెళ్లింది. జీ పరిమితుల అంత్య భాగాలను కూడా చేరింది. తీవ్రమైన ప్రాణహాని కలిగించే పరిస్థితిలో అత్యంత తీవ్రమైన శారీరక మరియు మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా అతను ఆదర్శప్రాయమైన మేటి ప్రశాంతతను కొనసాగించాడు. విమానంపై నియంత్రణను తిరిగి పొందాడు, తద్వారా అసాధారణమైన ఎగిరే నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత, దాదాపు 10,000 అడుగుల వద్ద, విమానం మళ్లీ ఊహించ‌ని విధంగా అప‌విన్యాసాలు మరియు అనియంత్రితమైన‌ పిచింగ్‌తో పూర్తిగా నియంత్రణ కోల్పోయే స్థితికి చేరింది. ఇటువంటి క్లిష్ట సందర్భంలో, పైలట్ విమానాన్ని విడిచి వెళ్లిపోయేందుకు అవ‌కాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ వింగ్ కమాండర్ వరుణ్ సింగ్ తన జీవితానికి ముప్పు పొంచి ఉన్న‌ప్ప‌టికీ  ప్రమాదాన్ని ఎదుర్కొని.. అతను యుద్ధ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి అసాధారణమైన‌ ధైర్యం మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. పైలట్ కాల్ ఆఫ్ డ్యూటీకి మించి, భారీ రిస్క్‌తీసుకొని విమానాన్ని ల్యాండ్ చేశాడు. వింగ్ కమాండర్ వరుణ్ సింగ్ చ‌ర్య‌తో దేశీయంగా రూపొందించిన ఫైటర్‌లోని లోపం క‌చ్చితమైన విశ్లేషణ చేసుకొనేందుకు, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు ఎలాంటి నివారణ చర్యల తీసుకోవాల‌నే విష‌యాన్ని తెలుసుకొనేందుకు కూడా తగిన‌ వీలు క‌ల్పిస్తుంది. త‌న‌ జీవితానికి ముప్పు ఏర్పడుతున్న‌ప్ప‌టికీ కూడా వింగ్ కమాండర్ వరుణ్ సింగ్ వృత్తిపరమైన నైపుణ్యం, ప్రశాంతత మరియు స‌మయోచిత నిర్ణయం తీసుకోవడం వల్ల‌ అతను ఎల్‌సీఏ నష్టాన్ని నివారించడమే కాకుండా, పౌర ఆస్తి మరియు జ‌న న‌ష్టాన్ని కూడా నివారించ‌గ‌లిగాడు. వింగ్ కమాండర్ వరుణ్ సింగ్ అసాధారణ ధైర్య, తెగువ‌కు గుర్తింపుగా ఆయ‌న‌కు శౌర్య చక్ర ప్రదానం చేశారు.
                           

***


(Release ID: 1746209) Visitor Counter : 213