వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఆహారం మరియు పోషకాహార భద్రత కోసం వ్యవసాయ జీవవైవిధ్యాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ భాగస్వామ్యం


వ్యవసాయంపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది

2021 బ్రిక్స్ సమావేశాలకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది

బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల పదకొండవ సమావేశం ఉమ్మడి ప్రకటనపై చర్చించారు

Posted On: 14 AUG 2021 11:32AM by PIB Hyderabad

ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్, ది రష్యన్ ఫెడరేషన్,  ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, రిపబ్లిక్ ఆప్ సౌత్ఆఫ్రికా దేశాల వ్యవసాయ మంత్రులు ‘ఆహారం మరియు పోషకాహార భద్రత కోసం వ్యవసాయ జీవవైవిధ్యాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ భాగస్వామ్యం’ అనే అంశంపై విస్తృతంగా చర్చించారు.

2030 నాటికి ఆకలి మరియు పేదరికాన్ని నిర్మూలించడానికి, సుస్థిర అభివృద్ధి సాధించడంలో సహాయ పడడానికి బ్రిక్ దేశాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని సుస్థిర అభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 2030 ఎజెండా పేర్కొంది. బ్రిక్స్ దేశాల్లో మెరుగైన వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, పరిజ్ఞానాన్ని పుంచుకోవలసిన అవసరం, మెరుగైన ఉత్పాదకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ల్యాబ్ నుంచి ల్యాండ్కు బదిలీ చేయడం.. ప్రత్యేకించి తీవ్రమైన వాతావరణ మార్పులు జరుతున్న పరిస్థితుల్లో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని నిర్వహించడం, సుస్థిరాభివృద్ధికి సహజ వనరులను వినియోగించుకోవడం వంటివి గుర్తించబడ్డాయి.
 
బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా,  దక్షిణాఫ్రికా) వ్యవసాయ పరిశోధన, విస్తరణ, సాంకేతిక బదిలీ, శిక్షణ మరియు సామర్థ్య పెంపుదల రంగాలలో సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం ద్వారా వ్యవసాయ పరిశోధన వేదిక అభివృద్ధి చేయబడింది. బ్రిక్స్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ను క్రియాశీలంగా మార్చాలనే ఉద్దేశం మరియు ఉత్పత్తిదారులు, ప్రాసెస్ చేసేవారి అవసరాలను తీర్చడం కోసం వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని, అమలును మెరుగుపరచడానికి పరిశోధన సహకారాన్ని ప్రోత్సహించడం కూడా వ్యక్తీకరించబడింది.

బ్రిక్ దేశాల వ్యవసాయ సహకారం కోసం బ్రిక్స్ దేశాల కార్యచరణ ప్రణాళికపై పదకొండవ సమావేశంలో చేసిన ఉమ్మడి ప్రకటన గురించి.. బ్రిక్స్ వ్యవసాయ వేదికపైనా ఈ సమావేశంలో లోతుగా చర్చించారు.
బ్రిక్స్ దేశాల 2021  24 కార్యచరణ ప్రణాళికను ఈ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఆమోదిస్తుంది.

న్యూఢిల్లీలోని  సుష్మాస్వరాజ్ భవన్ లో ఆగస్టు 12, 13వ తేదీల్లో వర్చువల్ పద్ధతిలో జరిగిన బ్రిక్స్ దేశాల వర్కింగ్గ్రూప్ సమావేశానికి   కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్,  కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమశాఖ అదనపు కార్యదర్శి అభిలాక్ష లిఖి,  కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి అలక్నందా దయాళ్ హాజరయ్యారు.



(Release ID: 1745969) Visitor Counter : 175