సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
పారా మిలిటరీ బలగాల కోసం 1.91 లక్షల ఖాదీ డ్యూరీలను సరఫరా చేయనున్న కేవీఐసీ
Posted On:
13 AUG 2021 3:34PM by PIB Hyderabad
పారామిలిటరీ దళాల కోసం ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ) రూ.10 కోట్ల విలువైన 1.91 లక్షల ఖాదీ కాటన్ డ్యూరీలను సరఫరా ఆర్డర్‌ను అందుకుంది. దేశంలోని అన్ని పారా మిలటరీ బలగాల తరపున కేటాయింపుల కోసం నోడల్ ఏజెన్సీ అయిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) నుండి ఈ మేరకు ఆర్డర్‌ను స్వీకరించింది. ఈ సంవత్సరం జనవరి 6న డ్యూరీలను సరఫరా చేయడానికి కేవీఐసీ మరియు ఐటీబీపీ మధ్య సంతకం చేసిన ఒప్పందానికి ఇది కొనసాగింపుగా నిలుస్తుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో స్వదేశీ భావన పెంపొందించాలన్న నేపథ్యంలోదేశ రక్షణ దళాలలకు స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలన్న హోంమంత్రి ఆదేశాల మేరకు ఈ చర్య చేపట్టడమైంది. నిర్ధేశించిన లెక్కల ప్రకారం కేవీఐసీ 1.98 మీటర్ల పొడవు మరియు 1.07 మీటర్ల వెడల్పు కలిగిన నీలి-రంగు డ్యూరీలను సరఫరా చేయనుంది. ఈ డ్యూరీలను ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ మరియు పంజాబ్ ఖాదీ సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. ఈ కొనుగోలు ఆర్డర్ ద్వారా.. ఖాదీ హస్త కళాకారుల కోసం అంచనా వేసిన 1.75 లక్షల మండేల అదనపు పని సృష్టించబడుతుంది. పారామిలిటరీ దళాలకు కేవీఐసీ డ్యూరీలను సరఫరా చేయడం ఇదే తొలిసారి. మొత్తం 1.91 లక్షల డ్యూరీలలో 51,000 ఐటీబీపీకి సరఫరా చేయబడుతుంది; బీఎస్ఎఫ్‌కు 59,500; సీఐఎస్ఎఫ్‌కు 42,700 మరియు ఎస్ఎస్‌బీకి 37,700 డ్య్యూరీలు సరఫరా చేయబడుతాయి. వచ్చే నవంబర్ నాటికి ఈ సరఫరా ఆర్డర్ పూర్తవుతుంది. కేవీఐసీ సంస్థ తయారు చేసిన పత్తి డ్యూరీలను టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖలోని ఉత్తర భారత టెక్స్‌టైల్ రీసెర్చ్ అసోసియేషన్ (నిట్రీ) ద్వారా ధ్రువీకరించబడ్డాయి. ఈ సందర్భగంఆ కేవీఐసీ ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ ఐటీబీసీ నుండి వచ్చిన ఈ ఆర్డర్‌కు.. బలగాలలో ఖాదీకి గల ప్రజాదరణకు అధిక నాణ్యత ప్రమాణాల నిదర్శనమని అభివర్ణించారు. కేవీఐసీ క్రమం తప్పకుండా పెద్ద మొత్తంలో కచ్చి ఘనీ, ఆవనూనెలను దళాలకు సరఫరా చేస్తోంది.
(Release ID: 1745657)
Visitor Counter : 205