ఆయుష్
నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి (సవరణ) బిల్లు, 2021 మరియు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (సవరణ) బిల్లు, 2021 లను ఆమోదించిన రాజ్యసభ
Posted On:
11 AUG 2021 9:48PM by PIB Hyderabad
నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి (సవరణ) బిల్లు, 2021 మరియు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (సవరణ) బిల్లు, 2021 లను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. ఈ రెండు బిల్లులను మంగళవారం లోక్‌సభ ఆమోదించింది.
ఈ రెండు బిల్లులను ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రవేశపెట్టారు. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్, 2020 ప్రకారం జాతీయ కమిషన్ ఏర్పాటు అయ్యేంత వరకు మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (సవరణ) ఆర్డినెన్స్, 2021 కింద ఏర్పాటైన బోర్డు అఫ్ గవర్నర్స్ తీసుకున్న నిర్ణయాలు, కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు జరిగేలా చూడడానికి, బాధ్యతలు నిర్వర్తించడానికిఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.
హోమియోపతి చట్టం, 2020 కింద జాతీయ కమిషన్ ఏర్పాటు అయ్యేంత వరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతి (సవరణ) ఆర్డినెన్స్, 2021 ప్రకారం ఏర్పాటు అయిన బోర్డు అఫ్ గవర్నర్స్ తీసుకున్న నిర్ణయాలు, కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు జరిగేలా చూడడానికి, బాధ్యతలు నిర్వర్తించడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.
రెండు బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబడతాయి.
***
(Release ID: 1745053)
Visitor Counter : 230