గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

చ‌వ‌క ధ‌ర‌లో గృహ నిర్మాణానికి ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం

Posted On: 11 AUG 2021 2:40PM by PIB Hyderabad

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో అందుబాటుధ‌ర‌లో గృహ నిర్మాణాలు చేప‌ట్టేందుకు ఆధునిక‌, వినూత్న‌,హ‌రిత సాంకేతిక ప‌రిజ్ఞానం, గృహ‌నిర్మాణ సామ‌గ్రి,వేగ‌వంతంగా నాణ్య‌త‌తో గృహ‌నిర్మాణాల‌కు వీలుగా ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌- అర్బ‌న్ (పిఎంఎవై-యు) స‌బ్ మిష‌న్ (టిఎస్ఎం) పేరుతో ఒక టెక్నాల‌జీ స‌బ్ మిష‌న్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వం తీసుకున్న‌చ‌ర్య‌లు కింది విధంగా ఉన్నాయి.

టెక్నాలజీ స‌బ్ మిష‌న్ కింద గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ (ఎంఒహెచ్‌యుఎ) గ్లోబ‌ల్ హౌసింగ్ టెక్నాల‌జీ ఛాలెంజ్ - ఇండియా(జిహెచ్‌టిసి-ఇండియా)ను ప్రారంభించింది. విప‌త్తుల‌ను త‌ట్టుకునే, సుస్థిర‌మైన‌, త‌క్కువ ధ‌ర‌లో, సత్వ‌రం వివిధ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు, భౌగోళిక ప‌రిస్థితుల‌కు వాడడానికి ఉప‌యోగ‌ప‌డే వినూత్న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల‌నుంచి గుర్తించడం దీని ఉద్దేశం. జిహెచ్‌టిసి- ఇండియా కింద  ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల 54 వినూత్న సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను గుర్తించి ఆరు స్థూల విభాగాల కింద‌ వాటిని గుర్తించ‌డం జ‌రిగింది.
 జిహెచ్‌టిసి- ఇండియా కింద గుర్తించిన వినూత్న నిర్మాణ సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు ఆరు రాష్ట్రాలు అంటే మ‌ధ్య‌ప్ర‌దేశ్ (ఇండోర్‌), గుజ‌రాత్ (రాజ్‌కోట్‌), త‌మిళ‌నాడు (చెన్నై), జార్ఖండ్ (రాంచి), త్రిపుర (అగ‌ర్త‌ల‌),  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (ల‌క్నో)ల‌లో ఆరు లైట్ హౌస్ ప్రాజెక్టులు (ఎల్‌.హెచ్‌.పిల‌ను) చేప‌డుతున్నారు. ఇందులోఆరు ప్ర‌త్యేక సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను వాడుతున్నారు. గృహ నిర్మాణం, రియ‌ల్ ఎస్టేట్‌రంగంలో వీటిని విస్తృతంగా వాడేందుకువీటిని చేప‌ట్టారు.


ఎం.ఒ.హెచ్‌యుఎ దేశంలోని వివిధ ప్రాంతాల‌లో ప్ర‌ద‌ర్శిత గృహ నిర్మాణ ప్రాజ‌క్టులు (డిహెచ్‌పిల‌ను) వినూత్న‌, ప్ర‌త్యామ్నాయ‌, సుస్థిర సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను ఉప‌యోగించి చేప‌డుతున్న‌ది. వీటికి విస్తృత ఆమోద‌యోగ్య‌త ల‌భించేందుకువీలుగా వీటినిచేప‌డుతున్నారు.

 ఎంఒహెచ్‌యుఎ ఇప్ప‌టికే అందుబాటు ధ‌ర‌లో అద్దె గృహాల కాంప్లెక్స్‌లు ( ఎఆర్‌హెచ్‌సిలను )ప్రారంభించింది. పిఎంఎవై-యు కింద ఈ ఉప‌ప‌థ‌కాన్నిచేప‌ట్టారు.  ప‌ట్ట‌ణ‌ప్రాంతాల‌లో వ‌ల‌స కూలీలు, పేద‌ల‌కు సుల‌భ‌త‌ర జీవ‌నానికి వీలుగా  దీనిని చేప‌ట్టారు. ఈ ప‌థ‌కం కింద టెక్నాల‌జీ ఇన్నొవేష‌న్ గ్రాంట్ (టిఐజి) ప్ర‌తి ఇంటికి(సింగ్‌బెడ్‌రూం)కు రూ60,000లు, డ‌బుల్ బెడ్ రూంకు రూ 1,00,000లు, డార్మిట‌రీ బెడ్‌కు రూ 20,000లు వినూత్న నిర్మాణ‌ప‌ద్ధ‌తులు అనుస‌రిస్తున్నందుకుకేటాయించారు.ఇది ఎఆర్‌హెచ్‌సిలు స‌త్వ‌రం చేప‌ట్ట‌డానికి,మెరుగైన నిర్మాణం, ప‌నితీరు క‌న‌బ‌ర‌చ‌డానికి ఇది ఉప‌క‌రిస్తుంది.


వినూత్న‌, ప్ర‌త్యామ్నాయ సాంకేతిక‌ప‌రిజ్ఞానాల‌ను ఉప‌యోగించ‌డం ద్వారా పిఎంఎవై-యు కింద , వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లోని ప‌థ‌కాల కింద సుమారు 16 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మించ‌నున్నారు.
 ఈ స‌మాచారాన్ని కేంద్ర గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ‌కౌశ‌ల్ కిషోర్ ఈరోజు రాజ్య‌స‌భ‌కు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో తెలిపారు.


(Release ID: 1745015) Visitor Counter : 145


Read this release in: English , Urdu , Punjabi , Gujarati