ప్రధాన మంత్రి కార్యాలయం

భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ) వార్షిక సమావేశం - 2021 లో ప్రసంగించిన - ప్రధానమంత్రి

ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారం విజయవంతం కావడానికి ప్రధాన బాధ్యత భారతీయ పరిశ్రమలపై ఉంది : ప్రధానమంత్రి

విదేశీ పెట్టుబడులకు భయపడిన భారతదేశం, ఈ రోజున అన్ని రకాల పెట్టుబడులను స్వాగతిస్తోంది : ప్రధానమంత్రి

ఈ రోజున దేశవాసుల నమ్మకం భారతదేశంలో తయారైన ఉత్పత్తులపై ఉంది : ప్రధానమంత్రి

మన పరిశ్రమపై దేశం విశ్వాసం యొక్క ఫలితంగా, సులభతర వ్యాపారం మరియు జీవన సౌలభ్యం మెరుగుపడ్డాయి. కంపెనీల చట్టం లో చేసిన మార్పుల వల్ల ఇది సాధ్యమయ్యింది : ప్రధానమంత్రి

దేశ ప్రయోజనాల దృష్ట్యా అతి పెద్ద సాహసం చేయడానికి సైతం సిద్ధంగా ఉన్న ప్రభుత్వం, ఈ రోజు దేశంలో ఉంది. గత ప్రభుత్వాలు రాజకీయ సాహసం చేసే ధైర్యం చేయలేకపోయాయి : ప్రధానమంత్రి


ఈ ప్రభుత్వం కష్టమైన సంస్కరణలను చేపట్టగలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వ సంస్కరణలు నిర్ధారణకు సంబంధించిన విషయమే కానీ, బలవంతం కాదు : ప్రధానమంత్రి


గడచిన కాలానికి చెందిన పన్నుల రద్దు ప్రభుత్వం మరియు పరిశ్రమ మధ్య విశ్వాసాన్ని బలపరుస్తుంది: ప్రధానమంత్రి

Posted On: 11 AUG 2021 6:17PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ) వార్షిక సమావేశం - 2021 లో దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.  భారతదేశం@75: ఆత్మ నిర్భర్ భారత్ కోసం ప్రభుత్వం మరియు వ్యాపారం కలిసి పని చేస్తాయనే ఇతివృత్తంతో, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.   ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి, వివిధ రంగాలలో సంస్కరణల పట్ల ప్రధానమంత్రి నిబద్ధతను, సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల నాయకులు,  ప్రశంసించారు.  ‘ఇండియా@75: ఆత్మ నిర్భర్ భారత్ కోసం ప్రభుత్వం మరియు వ్యాపార రంగం కలిసి పనిచేస్తున్నాయి’ అనే సమావేశం ఇతివృత్తం పై వారు మాట్లాడుతూ, మౌలిక సవాళ్లను అధిగమించడానికి, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ఆర్థిక రంగాన్ని మరింత శక్తివంతం చేయడానికి, సాంకేతిక రంగంలో నాయకత్వ స్థానాన్ని సాధించడానికి భారతదేశ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన సమాచారంతో పాటు, పలు సూచనలు చేశారు. 

ఈ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, "ఆజాదీ-కా-అమృత్ మహోత్సవ్" మధ్యలో జరుగుతోందని అన్నారు.  భారతీయ పరిశ్రమ యొక్క కొత్త తీర్మానాలు మరియు కొత్త లక్ష్యాల కోసం ఇది ఒక గొప్ప అవకాశం అని ఆయన పేర్కొన్నారు.  ఆత్మా నిర్భర్ భారత్ ప్రచారం విజయవంతం కావడానికి ప్రధాన బాధ్యత భారతీయ పరిశ్రమలపై ఉందని ఆయన అన్నారు.  మహమ్మారి సమయంలో పరిశ్రమల రంగం స్థిరంగా నిలబడినందుకు ప్రధాన మంత్రి ప్రశంసించారు.

భారతదేశ అభివృద్ధి, సామర్ధ్యాల కోసం, దేశంలో ప్రస్తుతం నెలకొన్న విశ్వాస వాతావరణాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, శ్రీ మోదీ పరిశ్రమ వర్గాలను కోరారు.  ప్రస్తుత ప్రభుత్వ విధానంలో మార్పులు, ప్రస్తుత పని తీరులో మార్పులను గమనిస్తూ, కొత్త ప్రపంచం తో కలిసి పనిచేయడానికి, నేటి నూతన భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  ఒకానొక సమయంలో విదేశీ పెట్టుబడులను చూసి భయపడే భారతదేశం, ఈ రోజున అన్ని రకాల పెట్టుబడులను స్వాగతిస్తోంది.  అదేవిధంగా, పెట్టుబడిదారుల్లో నిరాశను ప్రేరేపించడానికి ఉపయోగించే పన్ను విధానాలు ఉండేవి.  ఇప్పుడు, భారతదేశం ప్రపంచంలో అత్యంత పోటీతత్వ కార్పొరేట్ పన్ను విధానాన్నీ, ప్రత్యక్షంగా సంప్రదించవలసిన అవసరంలేని పన్ను వ్యవస్థను అమలుచేస్తోంది.  గతంలో అనుసరించిన అధికార దర్పం స్థానంలో, ప్రస్తుతం, సులభతర వ్యాపార సూచికలో గణనీయమైన పెరుగుదల కనబడుతోంది.   అదేవిధంగా, మొత్తం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లు గా హేతుబద్ధం చేయడం; కేవలం జీవనోపాధిగా పరిగణించబడుతున్న వ్యవసాయ సంస్కరణల ద్వారా మార్కెట్‌లతో అనుసంధానించబడుతోంది.  ఫలితంగా, భారతదేశం రికార్డు స్థాయిలో ఎఫ్.డి.ఐ. మరియు ఎఫ్.పి .ఐ. లను పొందుతోంది.  ఫారెక్స్ నిల్వలు కూడా, మునుపెన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు,  ప్రధానమంత్రి కి ఈ సందర్భంగా తెలియజేశారు. 

ఒకానొక సమయంలో, విదేశీ అనే పదం మంచికి పర్యాయపదం గా ఉండేది.  పరిశ్రమ రంగంలో నిపుణులు అటువంటి ఆలోచనల పరిణామాలను అర్థం చేసుకుంటారు.  అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే, ఎంతో కష్టపడి అభివృద్ధి చెందిన స్వదేశీ వస్తువులు కూడా విదేశీ పేర్లతో ప్రచారమయ్యాయి.  అయితే, ఈ రోజు పరిస్థితి వేగంగా మారుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  నేడు దేశ ప్రజల నమ్మకం భారతదేశంలో తయారైన ఉత్పత్తులపైనే ఉంది.  ఈ రోజు ప్రతి భారతీయుడు భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను స్వీకరించాలని కోరుకుంటున్నారని, అయితే ఆ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ తప్పనిసరిగా భారతదేశానికి చెందినది కాకపోయినా, అని ఆయన అన్నారు.

భారత యువత రంగంలోకి దిగినప్పుడు, వారికి, ఈ రోజున, ఆ సంకోచం లేదని, ప్రధానమంత్రి చెప్పారు.   వారు కష్టపడి పనిచేయాలని, ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొని,  సత్ఫలితాలు పొందాలని కోరుకుంటున్నారు.  మేము ఈ ప్రాంతానికి చెందిన వారిగా యువత భావిస్తోందని ఆయన అన్నారు.  ఈ రోజున భారతదేశానికి చెందిన అంకుర సంస్థల పై కూడా అలాంటి విశ్వాసం ఉంది. 6-7 సంవత్సరాల క్రితం 3 లేదా 4 యునికార్న్‌ సంస్థలు ఉండేవి. అందుకు భిన్నంగా, ఈ రోజున భారతదేశంలో 60 యునికార్న్‌ సంస్థలు ఉన్నాయని, ప్రధానమంత్రి ప్రత్యేకంగా తెలియజేశారు.  ఈ 60 యునికార్న్‌ సంస్థల్లో, దాదాపు 21 సంస్థలు, గత కొన్ని నెలల్లోనే ప్రారంభమయ్యాయి.  విభిన్న రంగాలలో ఉన్న ఈ యునికార్న్ సంస్థలు, భారతదేశంలో ప్రతి స్థాయిలో మార్పులను సూచిస్తున్నాయి.  ఆ అంకుర సంస్థల పెట్టుబడిదారుల ప్రతిస్పందన అద్భుతంగా ఉంది. వృద్ధి చెందడానికి, భారతదేశంలో అసాధారణమైన అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని ఇది సూచిస్తుంది.

మన పరిశ్రమ రంగంపై దేశానికి గల విశ్వాసం యొక్క ఫలితంగానే, సులభతర వ్యాపారం మరియు జీవన సౌలభ్యం మెరుగుపడుతోందని, ఆయన అన్నారు.  కంపెనీల చట్టంలో చేసిన మార్పులే దీనికి సరైన ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వం కష్టమైన సంస్కరణలను చేపట్టగలదని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు, ఎందుకంటే ఈ ప్రభుత్వ సంస్కరణలు నిర్ధారణకు సంబంధించిన విషయమే కానీ, బలవంతం కాదని, ఆయన పేర్కొన్నారు.   ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు వంటి పార్లమెంటు సమావేశాల్లో చేపట్టిన చర్యల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, చిన్న వ్యాపారవేత్తలు రుణ సహాయం పొందడానికి, ఇది సహాయపడుతుందని చెప్పారు.  పెట్టుబడి బీమా మరియు రుణ హామీ కార్పొరేషన్ సవరణ బిల్లు చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడుతుందనీ,  ఇటువంటి చర్యలు ప్రభుత్వ ప్రయత్నాలను మరింత ప్రోత్సహిస్తాయనీ, ప్రధానమంత్రి వివరించారు.

గతంలోని తప్పులను సరిదిద్దడం ద్వారా ప్రభుత్వం, గడచిన కాలానికి చెందిన పన్నులను రద్దు చేసిందని ప్రధానమంత్రి చెప్పారు.  పరిశ్రమ వర్గాల ప్రశంసలనందుకోవడం ద్వారా, ఈ చర్య, ప్రభుత్వం మరియు పరిశ్రమల మధ్య విశ్వాసాన్ని బలపరిచిందని, ప్రధానమంత్రి తెలియజేశారు.

దేశ ప్రయోజనాల దృష్ట్యా అతి పెద్ద సాహసాన్ని తీసుకోవడానికి సైతం సిద్ధంగా ఉన్న ప్రభుత్వం, ఈ రోజున దేశంలో అధికారంలో ఉందని, ప్రధానమంత్రి, పేర్కొన్నారు.  గత ప్రభుత్వాలు రాజకీయంగా సాహసం చేసే ధైర్యం లేకపోవడం వల్లనే, జి.ఎస్.టి. చాలా సంవత్సరాలు నిలిచిపోయిందని ఆయన నొక్కి చెప్పారు.  మేము జీ.ఎస్‌.టీ.ని అమలు చేయడంతో పాటు, ఈ రోజు రికార్డు స్థాయిలో జి.ఎస్.టి. సేకరణను చూస్తున్నామని ఆయన అన్నారు.



(Release ID: 1745014) Visitor Counter : 260