వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

5 వ జాతీయ ప్రజా సేకరణ సదస్సును నిర్వహించిన గవర్నమెంట్ ఈ- మార్కెట్ ప్లేస్ ( జెమ్ )


ప్రజా సేకరణ వ్యవస్థలో జెమ్ విప్లవాత్మక మార్పులు తెచ్చింది... వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్

ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 9 వరకు జరిగే డిజిటల్ ప్రదర్శనలో అమ్మకందారుల విక్రయిస్తున్న వివిధ ఉత్పత్తులు, సేవలను చూడవచ్చు

Posted On: 11 AUG 2021 1:04PM by PIB Hyderabad

'సామర్ధ్యంపారదర్శకతసమగ్ర సాంకేతిక ఆధారిత ప్రభుత్వ సేకరణఅనే అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారంతో గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ (జెమ్) 2021 ఆగస్ట్ 9,10 తేదీల్లో అయిదవ జాతీయ ప్రజా సేకరణ సదస్సును నిర్వహించింది. 

సదస్సును కేంద్ర వాణిజ్యంపరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జెమ్ చైర్మన్వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం కూడా ప్రారంభ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీమతి పటేల్  ప్రజా సేకరణ వ్యవస్థలో జెమ్ విప్లవాత్మక మార్పులు తెచ్చిందని అన్నారు. అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ జెమ్ పనిచేస్తున్నదని అన్నారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆత్మ నిర్భర్ భారత్ సాధన దిశలో ప్రపంచ స్థాయిలో స్థానికత కు ప్రాధాన్యత ఇస్తూ జెమ్ పనిచేస్తున్నదని ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం  అన్నారు. దీని ద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి జెమ్ సహకరిస్తున్నదని అన్నారు. 

సదస్సులో జెమ్ కార్యక్రలాపాలుఅమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. ప్రజా సేకరణలో స్మూక్మచిన్న మధ్య తరహా సంస్థలకు ఇస్తున్న ప్రాధాన్యతప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్న వ్యాపారులుసేవలను అందిస్తున్న వారు ఫిన్‌టెక్ ద్వారా రుణ సౌకర్యం పొందే అవకాశాలు లాంటి అంశాలపై చర్చలు జరిగాయి. సదస్సులో భాగంగా ప్రభుత్వ కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య వర్చువల్ విధానంలో బి 2బి, బి 2జి చర్చలు జరిగాయి. సదస్సులో కొనుగోలుదారులు మరియు విక్రేతలుజెమ్ లక్ష్యాలు నూతనంగా అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన, శిక్షణ మరియు సాంకేతిక సదస్సులను నిర్వహించారు. సమస్యలను  అక్కడికక్కడే పరిష్కరించడానికి మరియు విక్రేతలు మరియు కొనుగోలుదారుల నమోదును సులభతరం చేయడానికి వర్చువల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆన్‌లైన్ ప్రదర్శనలను, సదస్సులను నిర్వహించారు.

ఈ ఏడాది నిర్వహించిన సదస్సులో కొనుగోలుదారులు, అమ్మకందారుల, పరిశ్రమల మధ్య అవగాహన కుదిరి కొనుగోలుకు, అమ్మకానికి సిద్ధంగా ఉన్న వస్తువులు సేవల వివరాలను వివరించడానికి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. జెమ్ ద్వారా అందుబాటులో ఉండే వస్తువులు, సేవలపై 2021 ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 9 వరకు జరిగే డిజిటల్ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతారు. 

2020-21 ఆర్థిక సంవత్సరంలో జెమ్ ద్వారా సాగిన అమ్మకాలు, కొనుగోళ్లలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారికి జెమ్ సీఈఓ శ్రీ పీకే సింగ్ అవార్డులను అందించారు. 

ప్రభుత్వ కొనుగోలుదారులతో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధమ స్థానంలో ఉండగా పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ద్వితీయ స్థానంలో నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వాల తరగతిలో ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.ప్రభుత్వ రంగ సంస్థల విభాగంలో  గెయిల్ ఇండియా లిమిటెడ్, చమురు సహజ వాయువుల సంస్థ ప్రథమ, ద్వితీయ బహుమతులు గెల్చుకున్నాయి. అమ్మకందారుల విభాగంలో  టాటా మోటార్స్ లిమిటెడ్‌కు ప్రథమ బహుమతిని  మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కు  ద్వితీయ బహుమతిని అందించారు. 

ముగింపు ప్రసంగం చేసిన జెమ్ సీఈఓ శ్రీ సింగ్ విజేతలను అభినందించి, తమతో కలసి పనిచేస్తున్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నిర్దేశించిన విధంగా సమర్ధంగా, పారదర్శకంగా కార్యకలాపాలను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 


(Release ID: 1744980) Visitor Counter : 232