ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

'ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన'

Posted On: 10 AUG 2021 1:46PM by PIB Hyderabad

'ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన' (పీఎంఏఎస్‌బీవై) ప‌థ‌కం ఫిబ్రవరి 1వ తేదీ 2021 న ప్రకటించబడింది. 2021-2022 ఆర్థిక సంవ‌త్స‌రం బడ్జెట్ ప్రసంగంలో.. ఈ పథకాన్ని  ప్ర‌క‌టించారు. గ‌డిచిన ఆరు సంవత్సరాలలో సుమారు రూ.64,180 కోట్ల‌ అవుట్‌లేతో దీనిని అమలుచేయ‌డం జ‌రిగింది. ఇది జాతీయ ఆరోగ్య మిషన్ తోడ్పాటుకు అదనం. ఈ పథకం కింద ల‌క్ష్యంగా పెట్టుకున్న అంశాలు 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రం ద్వారా సాధించబడతాయి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

10 అత్య‌ధిక ప్రాధ‌న్యత క‌లిగిన రాష్ట్రాల‌లో 17,788 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మరియు ఆరోగ్య కేంద్రాలకు మద్దతివ్వ‌డం.

అన్ని రాష్ట్రాలలో 11,024 పట్టణ ఆరోగ్య మరియు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం.

అన్ని జిల్లాల‌లో స‌మీకృత ప్ర‌జా వైద్య ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేయడం మరియు 11 హై ఫోకస్ రాష్ట్రాల్లో 3382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్‌లను ఏర్పాటు చేయడం;

602 జిల్లాల‌లో క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్‌ల ఏర్పాటు మరియు 12 కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయడం;

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), దాని 5 ప్రాంతీయ శాఖలు మరియు 20 మెట్రోపాలిటన్ హెల్త్ నిఘా విభాగాలను బలోపేతం చేయడం;

అన్ని పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను కనెక్ట్ చేయడానికి అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ విస్తరణ;

17 కొత్త పబ్లిక్ హెల్త్ యూనిట్ల నిర్వహణతో పాటు 32 విమానాశ్రయాలు, 11 ఓడరేవులు మరియు 7 ల్యాండ్ క్రాసింగ్‌ల‌లో ఇప్పటికే ఉన్న దాదాపు 33 పబ్లిక్ హెల్త్ యూనిట్‌లను బలోపేతం చేయడం.;

15 ఆరోగ్య అత్యవసర ఆపరేషన్ కేంద్రాలు మరియు 2 సంచార వైద్యశాలల ఏర్పాటు;

డ‌బ్ల్యుహెచ్ఓ నైరుతి ఆసియా రీజియన్ కోసం ఒక జాతీయ సంస్థ ఏర్పాటు, 9 బయో-సేఫ్టీ లెవల్ III లాబొరేటరీలు మరియు 4 రీజినల్ నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఫర్ వైరాలజీ ఏర్పాటు చేయ‌డం.
 
కేంద్ర ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్‌ పవార్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.
                       

*****

 


(Release ID: 1744465) Visitor Counter : 280