ఆర్థిక మంత్రిత్వ శాఖ

'వివాద్ సే విశ్వాస్‌' పథకం కింద రూ.99,756 కోట్లు వివాదాస్పద పన్ను పరిష్కారం

Posted On: 09 AUG 2021 6:07PM by PIB Hyderabad

'వివాద్ సే విశ్వాస్' అనేది, పన్ను చెల్లింపుదారులతో మాట్లాడుకుని ప్రత్యక్ష పన్నుల వివాదాలను  స్నేహపూర్వకంగా పరిష్కరించడానికి తీసుకొచ్చిన స్వచ్ఛంద పథకం. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించలేదు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈ విషయాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ లోక్‌సభకు వెల్లడించారు.

పరిష్కరించిన కేసుల సమాచారం, నగదు మొత్తాన్ని మరిన్ని వివరాలుగా అందించారు. ఆ వివరాలు క్రింది పట్టికలో ఉన్నాయి:

'వివాద్ సే విశ్వాస్' పథకం కింద దాఖలైన ప్రకటనల స్థితి

దాఖలైన మొత్తం ఫారం-1లు

(పరిష్కారమైన కేసులు)

పరిష్కారమైన వివాదాల సంఖ్య

పరిష్కారమైన వివాదాస్పద పన్ను మొత్తం (దాఖలు చేసిన డిక్లరేషన్ ప్రకారం) (రూ.కోట్లలో)

వివాదాస్పద పన్నుపై చెల్లింపులు (రూ. కోట్లలో)

                              బి

సి

డి

1,32,353

1,46,701

99,756

53,684

 

 

****


(Release ID: 1744245) Visitor Counter : 203


Read this release in: English , Urdu , Marathi , Punjabi