యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

పురుషుల ఫ్రీ-స్టైల్ 65 కేజీల విభాగంలో రెజ్లర్ బజరంగ్ పునియాకు కాంస్య పతకం : టోక్యో ఒలింపిక్స్‌లో ఇది భారత్‌ కు ఆరో పతకం

Posted On: 07 AUG 2021 5:19PM by PIB Hyderabad

కీలక ముఖ్యాంశాలు :

*     కాంస్య పతక పోరులో పునియా 8-0 పాయింట్లతో కజకిస్తాన్‌ కు చెందిన డౌలెట్ నియాజ్‌బెకోవ్‌ ను ఓడించారు.

*     బజరంగ్ సాధించిన విజయానికి రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 

*     కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, "నేను మీ గురించి గర్వపడుతున్నాను. మీ ఆధిపత్య ప్రదర్శన మరియు అద్భుతమైన ముగింపు ను చూసి నేను చాలా ఆనందించాను." అని భజరంగ్ ను అభినందించారు.

టోక్యో ఒలింపిక్స్-2020 క్రీడల్లో, పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోల విభాగంలో రెజ్లర్ బజరంగ్ పునియా, ఈ రోజు, కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.  కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌ లో అతను,  8-0 పాయింట్లతో కజకిస్తాన్‌ కు చెందిన డౌలెట్ నియాజ్‌ బెకోవ్‌ ను ఓడించారు.  టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో, భారతదేశానికి ఇది ఆరో పతకం, తద్వారా లండన్ ఒలింపిక్‌ లో సాధించిన ఆరు పతకాల రికార్డు భారత్ సమం చేసింది.  రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తో సహా దేశం నలుమూలల నుండి భారతీయులు, బజరంగ్ పునియాకు  అభినందనలు తెలియజేశారు. 

రెజ్లర్ బజరంగ్ పునియా ను, రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, అభినందించారు. ప్రతి భారతీయుడు తన విజయానికి సంతోషాన్ని పంచుకుంటున్నారని ఆయన అన్నారు.

ఈ మేరకు రాష్ట్రపతి,  సామాజిక మాధ్యమం ద్వారా, ఒక ట్వీట్ చేస్తూ,   “భారత కుస్తీ పోటీలకు ఇది ఒక ప్రత్యేక క్షణం!  #టోక్యో- 2020 లో కాంస్య పతకం సాధించినందుకు బజరంగ్ పునియా కు అభినందనలు.  సంవత్సరాలుగా అవిశ్రాంత ప్రయత్నాలు, స్థిరత్వం, పట్టుదలతో మీరు అత్యుత్తమ రెజ్లర్‌ గా మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు.  మీరు విజయం సాధించినందుకు, ప్రతి భారతీయుడు ఆ సంతోషాన్ని పంచుకుంటున్నారు! ” అని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బజరంగ్ విజయాన్ని అభినందిస్తూ, "#టోక్యో-2020 నుండి సంతోషకరమైన వార్త! బజరంగ్ పూనియా, నీవు  అద్భుతంగా పోరాడావు.  ప్రతి భారతీయుడు గర్వంగా, సంతోషంగా భావించే, మీ విజయానికి, అభినందనలు. ” అని, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేసారు. 

కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్‌ లో అభినందన సందేశం తో పాటు గెలిచిన క్షణాన్ని తాను చూస్తున్న వీడియో క్లిప్‌ను పంచుకున్నారు.  “బజరంగ్‌కు కాంస్యం !!! మీరు సాధించారు! భారతదేశం మాటలకు అతీతంగా పులకించింది! నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను. #టోక్యో 2020 లో మీ ఆధిపత్య ఆట తీరు మరియు అద్భుతమైన ముగింపు ను చూడటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది!", అని, కేంద్ర క్రీడా శాఖ మంత్రి ట్వీట్ చేశారు. 

బజరంగ్ పునియా- బజరంగ్ పునియా 7 సంవత్సరాల వయస్సులో కుస్తీ చేయడం ప్రారంభించారు.  ఆయన హర్యానా రాష్ట్రంలోని ఝజ్జర్ జిల్లా, ఖుదాన్ గ్రామంలో ఒక గ్రామీణ నేపథ్య కుటుంబానికి చెందినవారు.   బజరంగ్ జన్మతః సంపన్న కుటుంబానికి చెందినవారు కాకపోవడం వల్ల,  బాల్యంలో, ఆయన, అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.  అయితే, అతని స్నేహితుడు మరియు గురువు అయిన  ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఎల్లప్పుడూ అతనికి మద్దతుగా నిలిచారు. 

వ్యక్తిగత వివరాలు :

పుట్టిన తేదీ : ఫిబ్రవరి 26, 1994

నివాస స్థానం : సోనిపట్, హర్యానా

క్రీడ : కుస్తీ

శిక్షణా స్థావరం : ఎస్.ఏ.ఐ.  ఎం.ఆర్.సి., సోనిపట్

వ్యక్తిగత కోచ్ : ఎమ్జారియోస్ బెంటినిడిస్

జాతీయ కోచ్ : జగ్మందర్ సింగ్

సాధించిన విజయాలు :

●     ప్రపంచ ఛాంపియన్‌ షిప్ :   రజతం -1  మరియు కాంస్యం - 2  

●     ఆసియా ఛాంపియన్‌ షిప్ :   స్వర్ణం - 2 ;  రజతం - 3 మరియు కాంస్య పతకాలు - 2  

●     ఆసియా క్రీడలు :                 స్వర్ణం - 1 మరియు రజతం - 1

●     కామన్వెల్త్ క్రీడలు :               స్వర్ణం - 1 మరియు రజతం - 1

కీలక ప్రభుత్వం జోక్యాలు:  

●     ఒలింపిక్ క్రీడల కోసం రష్యాలో సన్నాహక శిక్షణ శిబిరం.

●     అమెరికాలోని మిచిగన్‌ లో తన సహాయక సిబ్బందితో పాటు రెండు నెలల పాటు సన్నాహక శిక్షణా శిబిరం.  

●     అమెరికా, రష్యా, జార్జియాలో సన్నాహక శిక్షణా శిబిరం మరియు సీనియర్ ప్రపంచ ఛాంపియన్‌ షిప్-2019 (అర్హత పోటీ) కి ముందు. 

●     అలీ అలీవ్, టిబిలిసి జి.పి, ఆసియా ఛాంపియన్‌ షిప్‌ లు, యార్ డోగు, మాటియో పెల్లికోన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌ లలో పాల్గొనడం, ఇది టి.ఓ.పి.ఎస్. మరియు ఏ.సి.టి.సి. ద్వారా అందించబడింది

●     లాక్-డౌన్ (కోవిడ్) సమయంలో సప్లిమెంట్స్ మరియు మ్యాట్స్.

●     స్పోర్ట్ ఎస్. & సి. సామగ్రి. 

●     అంతర్జాతీయ ఆటగాళ్లకు మల్ల యుద్ధ భాగస్వాములుగా ఎం.వై.ఏ.ఎస్. మరియు ఏ.ఈ.ఏ. ద్వారా వీసా మద్దతు

●    బజరంగ్ కోసం వీసా సదుపాయం మరియు ఒలింపిక్ సన్నాహకంగా రష్యా కు సహాయక బృందం

●     జాతీయ శిబిరాల సమయంలో వ్యక్తిగత కోచ్ మరియు సహాయక సిబ్బందిని చేర్చడం. 

టి.ఓ.పి.ఎస్. : రూ.  1,47,40,348

ఏ.సి.టి.సి. :    రూ.     59,07,151

మొత్తం:          రూ.  2,06,47,499

పూనియాకు శిక్షణ ఇచ్చిన కోచ్‌ల వివరాలు:

క్షేత్ర స్థాయిలో :   వీరేందర్

అభివృద్ధి స్థాయిలో : రాంపాల్

ఉన్నత స్థాయిలో :  జగ్మీందర్ సింగ్ / ఎమ్జారియోస్ బెంటినిడిస్

 

 

*****



(Release ID: 1743772) Visitor Counter : 149